నిస్సాన్ ఇవాలియా టాప్-ఎండ్ వేరియంట్‌లో కొత్త ప్రీమియం ఫీచర్స్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న మల్టీ పర్సప్ వెహికల్ ఇవాలియా అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. వాస్తవానికి గ్లోబల్ మార్కెట్లలో అత్యంత విజయం సాధించి, మంచి పాపులారిటీని దక్కించుకున్న ఇవాలియా ఎమ్‌పివి, ఇండియన్ మార్కెట్లో మాత్రం ఆశించిన రీతిలో అమ్ముడుపోవటం లేదు.

నిస్సాన్ ఇవాలియా సక్సెస్ కాకపోవటానికి అనేక కారణాలున్నాయి. దీని డిజైన్, ఫీచర్లు ఆకట్టుకునేలా లేకపోవటం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో, నిస్సాన్ ఇండియా తమ టాప్-ఎండ్ వేరియంట్ ఇవాలియాలో కొన్ని కొత్త ప్రీమియం ఫీచర్లను జోడించి, తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. అప్-మార్కెట్ ఫీల్‌నిచ్చేలా ఈ ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.

nissan evalia special variant launch

నిస్సాన్ ఇవాలియా స్పెషల్ వేరియంట్‌గా పిలిచే ఇందులో ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్స్ పరంగా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా.. సరికొత్త ఫ్రంట్ క్రోమ్ గ్రిల్, పూర్తిగా రీడిజైన్ చేయబడిన సరికొత్త ఫ్రంట్ బంపర్, కొత్త ఫాగ్‌ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ సరౌండింగ్స్‌ను ఇందులో గమనించవచ్చు.

ఇంకా ఇందులో క్రోమ్ స్ట్రైప్‌తో అప్‌డేట్ చేసిన ఫ్రంట్ బానెట్, రియర్ రూఫ్ స్పాయిలర్, వెనుక వైపు క్రోమ్ గార్నిష్, 10-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు కూడా ఉన్నాయి. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. మధ్య వరుసలో సౌకర్యవంతమైన కెప్టెన్ సీట్స్, రెండవ మరియు మూడవ వరుసలలో కూర్చునే ప్యాసింజర్ల సౌకర్యార్థం కారు పైభాగంలో ఏర్పాటు చేసిన రూఫ్ ఏసి వెంట్స్ వంటి మార్పులు ఉన్నాయి.

nissan evalia special variant

అంతేకాకుండా.. ఇందులో కొత్తగా 2-డిన్ ఆడియో సిస్టమ్ (యూఎస్‌బి కనెక్టివిటీతో), రియర్ వైపర్, రియర్ డిఫాగ్గర్, యాంటీ-గ్లేర్ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్, ఫ్రంట్ రో అసిస్ట్ గ్రిప్, గ్లవ్ బాక్స్ లిడ్, డ్యాష్‌బోర్డుపై క్లాసీ ఉడ్ ఫినిష్, 3వ వరుసలోని ప్రయాణికుల కోసం మ్యాప్ ల్యాంప్స్ వంటి ఫీచర్లను కూడా జోడించారు.

ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఇవాలియా ఎక్స్‌వి (ఆప్షనల్) వేరియంట్‌కు ఎగువన ఈ కొత్త నిస్సాన్ ఇవాలియా స్పెషల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా.. ఈ కొత్త వేరియంట్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఇవాలియాలో ఉపయోగించిన ఇంజన్‌నే ఈ కొత్త వేరియంట్ ఇవాలియాలోను ఉపయోగిస్తున్నారు.

nissan evalia limited variant

నిస్సాన్ ఇవాలియా కేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 86 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 19.3 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. దేశీయ విపణిలో కొత్త నిస్సాన్ ఇవాలియా స్పెషల్ వేరియంట్ ధర రూ.11,61,930 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
Nissan India has introduced a new premium version of its urban-class utility vehicle, Evalia with an upmarket feel inside and out. The Nissan Evalia ’Special Variant’ gets an all-new chrome front grille for impactful presence. The front bumper has been completely redesigned for a sporty appearance and houses integrated foglamps with stylish chrome surrounds.
Story first published: Thursday, October 23, 2014, 9:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X