జెనీవా మోటార్ షో: నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్ ఆవిష్కరణ

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న పవర్‌ఫుల్ జ్యూక్ మినీ ఎస్‌యూవీలో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న అంతర్జాయ మోటార్ షోలో ఆవిష్కరించింది. 'నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్' పేరిట ఆవిష్కరించిన ఈ కారు విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈ కొత్త నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్‌లో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 113 హార్స్ పవర్‍‌ల శక్తిని, 190 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్‌ను పెంచేందుకు గాను ఇందులో కొత్తగా స్టార్ట్/స్టాప్ ఇంజన్ ఫీచర్‌ను జోడించారు.

ఈ కొత్త మోడల్‌లో నిస్సాన్ కనెక్ట్, నిస్సాన్ సేఫ్టీ షీల్డ్, అరౌండ్ వ్యూ మోనిటర్, ఎల్ఈడి డేటైమై రన్నింగ్ లైట్స్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. దీని బూట్ స్పేస్‌ను కూడా రివైజ్ చేశారు, ఇప్పుడు ఇందులో 40 శాతం అదనపు లగేజ్ పడుతుంది (మొత్తం 354 లీటర్లు). మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్

2014 జెనీవా మోటార్ షోలో ఈ కొత్త నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్‌ను ప్రదర్శనకు ఉంచారు. ఇదివరకి నిస్సాన్ జ్యూక్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. కానీ, డిజైన్ పరంగా ఇది చూపరులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్

నిస్సాన్ 370జీ కారును పోలి ఉండే హెడ్‌లైట్స్‌ను ఇందులో గమనించవచ్చు. హెడ్‌లైట్స్‌కు దిగువన మళ్లీ రెండు లైట్స్‌ను అమర్చారు. వాటి క్రింది భాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్‌ను ఇందులో చూడొచ్చు.

నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్

గ్రే బాడీ కలర్‌లో ఉండే నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్‌లో రెడ్ కలర్ సైడ్ మిర్రర్స్ మరియు కారు క్రింది భాగంలో చుట్టూ ఉండే రెడ్ లైన్ ప్రత్యేకంగా అనిపిస్తుంది. దీని వీల్ ఆర్చెస్ పెద్దవిగా ఉండి, ఈ మినీ ఎస్‌యూవీ మంచి లుక్‌నిస్తాయి.

నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్

ఈ యాంగిల్‌లో నిస్సాన్ జ్యూక్ చక్కగా అనిపిస్తుంది. షెవర్లే బీట్ మాదిరిగా వెనుక డోరు హ్యాండిల్‌ను సైడ్ విండో దగ్గర అమర్చారు. కారు వెనుక భాగంలో జోడించిన రియర్ స్పాయిలర్ జ్యూక్‌కు మరింత స్పోర్టీ లుక్‌నిస్తుంది. ఇందులో సన్‌రూఫ్ కూడా ఉంది.

నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్

నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్ వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఎల్ షేపులో ఉండే టెయిల్ ల్యాంప్స్, నిస్మో ఆర్ఎస్ బ్యాడ్జింగ్, రెడ్ లైన్‌తో కూడిన బంపర్‌లు కొత్తగా అనిపిస్తాయి. వెనుక సైలెన్సెర్‌ ఒక్కటిగా కాకుండా, ఇరువైపులా (స్ప్లిట్ సైలెన్సర్) జోడించి ఉంటే బాగుండేది.

నిస్సాన్ జ్యూక్ నిస్మో ఆర్ఎస్

బ్లాక్ అండ్ రెడ్ థీమ్‌తో డిజైన్ చేసిన ఇంటీరియర్స్ జ్యూక్ నిస్మోకు మంచి స్పోర్టీ అప్పీల్‌నిస్తాయి. డ్రైవర్‌కు స్టీరింగ్ వీల్ పొజిషన్‌ను గుర్తి చేసేలా దాని పైభాగంలో ఉండే రెడ్ కలర్ రింగ్, స్పోర్టీ ఫుట్ పెడల్స్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను ఇందులో గమనించవచ్చు.

Most Read Articles

English summary
Nissan have showcased their facelifted version of the Juke at Geneva Motor Show. However, the design of the mini SUV hasn't changed to great extent. It still has the love it or hate it look.
Story first published: Wednesday, March 5, 2014, 12:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X