గ్లోబల్ మార్కెట్ల కోసం నిస్సాన్ పల్సర్ హ్యాచ్‌బ్యాక్ విడుదల!

By Ravi

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ తమ ప్రస్తుత రేంజ్ కార్లకు అదనంగా, 'పల్సర్' (Pulsar) అనే మరో కొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. నిస్సాన్ ఇప్పుడు తమ పల్సర్ హ్యాచ్‌బ్యాక్ పరదాలను తొలగించింది.

ఎస్-సెగ్మెంట్లో విడుదలైన ఈ చిన్న కారు ఫస్ట్ లుక్‌ను ఈ ఫొటోలలో చూడొచ్చు. వాస్తవానికి నిస్సాన్‌కు పల్సర్ బ్రాండ్ కొత్తదేమీ కాదు, 1978లోనే నిస్సాన్ తొలి పల్సర్ కారును కొన్ని ఎంపిక చేసిన దేశాలలో విక్రయించేంది.


కాగా.. తాజాగా కంపెనీ ఆవిష్కరించిన 5-డోర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను పూర్తిగా బార్సెలోనాలో డిజైన్ చేశారు. ఇది నిస్సాన్ ఫ్యామిలీ డిజైన్‌ను కలిగి ఉండి, మంచి ఫ్యూచరిస్టిక్ లుక్‌ని కలిగి ఉంటుంది.

నిస్సాన్ పల్సర్ హ్యాచ్‌బ్యాక్ 4385 మి.మీ. పొడవును కలిగి ఉండి 2700 మి.మీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. అంటే, దీని ఇంటీరియర్ స్పేస్ చాలా మెరుగ్గా ఉంటుందని అర్థం. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది.


పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ డిఐజి-టి ఇంజన్‌ను ఉపయోగించారు, ఈ ఇంజన్ గరిష్టంగా 115 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ డిసిఐ ఇంజన్‌ను ఉపయోగించారు, ఈ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

అయితే, 2015లో పల్సర్‌లో మరింత పవర్‌ఫుల్ వేరియంట్‌ను చేర్చుతామని నిస్సాన్ ప్రకటించింది. ఈ పవర్‌ఫుల్ వేరియంట్‌లో 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 190 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Nissan Pulsar Rear

నిస్సాన్ పల్సర్ గ్లోబల్ హ్యాచ్‌బ్యాక్‌ను తొలిసారిగా యూరప్ వంటి మార్కెట్లలో విడుదల చేయనున్నారు. యూరప్‌లో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఫోర్డ్ ఫోకస్, ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లను ఈ నిస్సాన్ పల్సర్ సవాల్ చేయనుంది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ మరియు క్యాష్‌కాయ్ మోడళ్లకు మధ్యలో నిస్సాన్ పల్సర్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సరికొత్త నిస్సాన్ స్మాల్ ఇప్పట్లో ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Nissan have launched their latest hatchback the Pulsar. The first Pulsar by Nissan was launched in the year 1978, it was sold in selected countries. It is a 5-door premium hatchback which, has been designed in Barcelona. The hatchback features Nissan's family design and looks futuristic.
Story first published: Thursday, May 22, 2014, 9:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X