చవక 'మైక్రా యాక్టివ్' విడుదల చేసిన నిస్సాన్ ఇండియా

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా అప్‌గ్రేడెడ్ 2013 మైక్రా విడుదలతో పాటుగా ఓ చవక రకం మైక్రాను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సెగ్మెంట్లో మారుతి ఆల్టో, వ్యాగన్ఆర్, హ్యుందాయ్ ఐ10, చెర్లే బీట్, వంటి చిన్న కార్లకు పోటీగా కేవలం రూ.3.5 లక్షల ప్రారంభ ధరకే కంపెనీ 'నిస్సాన్ మైక్రా యాక్టివ్' (Nissan Micra Active) అనే వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

డిజైన్, ఫీచర్ల విషయంలో ఇది కొత్త మైక్రా (2013 మోడల్) మాదిరిగా కాకుండా దాదాపుగా పాత మోడల్ మైక్రా మాదిరిగానే ఉంటుంది. అయిదే, ఇదివరకటి మైక్రాను కాస్తంత విభిన్నంగా డిజైన్ చేసి, మోడ్రన్ టచ్ ఇచ్చి తక్కువ ధరకే నిస్సాన్ ఇండియా ఈ మైక్రా యాక్టివ్‌ను ఆఫర్ చేస్తోంది. నిస్సాన్ మైక్రా యాక్టివ్ మొత్తం నాలు వేరియంట్లలో (ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి సేఫ్టీ) లభిస్తుంది.

నిస్సాన్ మైక్రా యాక్టివ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి:

ఇంజన్, ట్రాన్సిమిషన్

ఇంజన్, ట్రాన్సిమిషన్

నిస్సాన్ మైక్రా యాక్టివ్ కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఇదివరకటి వెర్షన్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభ్యమవుతుంది.

మైలేజ్

మైలేజ్

పాత మైక్రాతో పోల్చుకుంటే ఈ కొత్త మైక్రా యాక్టివ్ దాదాపు 30 కేజీల తక్కువ బరువును కలిగి ఉంటుంది కాబట్టి, ఇది లీటర్ పెట్రోలుకు 19.49 కి.మీ. మైలేజీ ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇదివరకటి మైక్రా మైలేజ్ 18.44 కెఎమ్‌పిఎల్ మాత్రమే.

కొత్త డిజైన్

కొత్త డిజైన్

పాత మైక్రా డిజైన్‌కు, కొత్త మైక్రా డిజైన్‍‌‌కు కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. మైక్రా యాక్టివ్‌లో కొత్త బంపర్ (ఫాగ్ లైట్లు లేవు, వాటి స్థానంలో ఎయిర్ వెంట్లను జోడించారు), అదే పాత గ్రిల్ (క్రోమ్ లైనింగ్ లేదు)తో ఇది ఆర్డనరీ లుక్‌ని కలిగి ఉంటుంది.

యాక్టివ్ బడ్జెట్ ఫీచర్లు

యాక్టివ్ బడ్జెట్ ఫీచర్లు

పిండి కొద్ది రొట్టె అన్న చందంగా, ఇందులో చక్రాల ప్లాస్టిక్ క్యాప్స్‌ను మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్ కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నాయి. లోపలి వైపు కూడా అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్‌ల స్థానంలో ఫిక్స్డ్ హెడ్‌రెస్ట్‌లను ఆఫర్ చేస్తున్నారు.

మైక్రా యాక్టివ్ కలర్స్

మైక్రా యాక్టివ్ కలర్స్

నిస్సాన్ మైక్రా యాక్టివ్ టార్క్వాయిస్ బ్లూ (కొత్త కలర్), బ్లేడ్ సిల్వర్, స్టోర్మ్ వైట్స ఆంక్సీ బ్లాక్, ఆక్వా గ్రీన్ మరియు బ్రిక్ రెడ్ అనే ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది.

టాప్-ఎండ్ వేరియంట్ ఫీచర్లు

టాప్-ఎండ్ వేరియంట్ ఫీచర్లు

నిస్సాన్ మైక్రా యాక్టివ్ ఎక్స్‌వి సేఫ్టీ (టాప్ ఎండ్) వేరియంట్లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బిఏ (బ్రేక్ అసిస్ట్), ఇమ్మొబిలైజర్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, సెంట్రల్ లాకింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

నిస్సాన్ మైక్రా యాక్టివ్ ధరలు

నిస్సాన్ మైక్రా యాక్టివ్ ధరలు

నిస్సాన్ మైక్రా యాక్టివ్ ఎక్స్ఈ - రూ.3.50 లక్షలు

నిస్సాన్ మైక్రా యాక్టివ్ ఎక్స్ఎల్ - రూ.4.01 లక్షలు

నిస్సాన్ మైక్రా యాక్టివ్ ఎక్స్‌వి - రూ.4.39 లక్షలు

నిస్సాన్ మైక్రా యాక్టివ్ ఎక్స్‌వి సేఫ్టీ - రూ.4.71 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

నిస్సాన్ మైక్రా యాక్టివ్

Most Read Articles

English summary
Along with the launch of the 2013 Micra, Nissan took everyone by surprise by launching a new low cost model of the Micra, named Micra Active. The new Micra Active is set apart from the new ‘regular' Micra by its differently designed face, which is reminiscent of the outgoing Micra, but with a modern touch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X