ఖాష్కాయ్ ఎస్‌యూవీని భారత్‌కు తీసుకురానున్న నిస్సాన్

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా ఈనెల 20వ తేదిన తమ తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ టెర్రానో' (Nissan Terrano)ను భారత మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. అయితే, టెర్రానో విడుదల తర్వాత మరొక కొత్త ఎస్‌యూవీని కూడా దేశీయ విపణిలో విడుదల చేయాలని నిస్సాన్ ఇండియా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

నిస్సాన్ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న 'నిస్సాన్ ఖాష్కాయ్' (Nissan Qashqai)ని ఇండియాలో విడుదల చేయటానికి గల సాధ్యాసాధ్యాలను నిస్సాన్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎస్‌యూవీలకు మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీ సెగ్మెంట్లోని అవకాశాలను క్యాష్ చేసుకోవాలని నిస్సాన్ భావిస్తోంది.


ఇందులో భాగంగానే, తమ ఫుల్ సైజ్డ్ ఎస్‌యూవీ ఖాష్కాయ్‌ని భారత విడుదల చేయాలని నిస్సాన్ యోచిస్తోంది. ఇతర మార్కెట్లలో మాదిరిగానే ఇది ఇండియన్ మార్కెట్లో కూడా మంచి విజయాన్ని సాధించగలదని కంపెనీ అంచనా వేస్తోంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, కాంపాట్ డైమెన్షన్స్ కలిగిన ఖాష్కాయ్ ఎస్‌యూవీ ఓవరాల్‌ డిజైన్ స్మార్ట్ లుక్‌ని కలిగి ఉంటుంది.

స్పోర్టీ ఎస్‌యూవీ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని ఖాష్కాయ్‌ను అభివృద్ధి చేశారు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 4-సిలిండర్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్‌లో 4-సిలిండర్ కె9కె ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఖాష్కాయ్ ఎస్‌యూవీ విషయంలో నిస్సాన్ మార్కెట్ అధ్యయనం విజయవంతమైతే వచ్చే ఏడాదిసలో భారత్‌లో విడుదల కావచ్చు. భారత మార్కెట్లో దీని ధర రూ.14 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
Nissan Qashqai Interior
Most Read Articles

English summary
After Nissan Terrano which will launched 20th of this month, the Japanese carmaker Nissan has evaluating the launch of yet another crossover/compact SUV - the Nissan Qashqai. Why an SUV? The answer is clear. Despite the excise hike, the SUV segment is still going strong compared to the premium sedan segment.
Story first published: Tuesday, August 6, 2013, 18:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X