టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన నిస్సాన్ టెర్రానో

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, టెర్రానో (Terrano) అనే ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా చెన్నై రోడ్లపై నిస్సాన్ టెర్రానోను టెస్టింగ్ చేస్తుండగా కెమరాకు చిక్కింది. ముందు వైపు డిజైన్ బ్లాక్ క్లాత్‌తో కవక్ చేయబడి ఉన్న ఈ టెర్రానో, కంపెనీ ఇటీవల విడుదల చేసిన అఫీషియల్ స్కెచ్‌లో చూపినట్లుగానే ఉంది. టీజర్ ఫొటోలో చూపించిన హనీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్ ప్లేస్‌మెంట్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్‌ను ఈ స్పై షాట్‌లో చూడొచ్చు.

ఈ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నిస్సాన్ టెర్రానో' ధర రూ.8.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. రెనో డస్టర్ బేస్ డీజిల్ వేరియంట్ (ఆర్ఎక్స్ఈ) ధర రూ.8.73 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అంటే, ఇది నిస్సాన్ టెర్రానో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ కన్నా కేవలం రూ.17,000 మాత్రమే తక్కువ ధరను కలిగి ఉంది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇది వచ్చే సెప్టెంబర్/అక్టోబర్ నెల నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఫీచర్ల విషయంలో ఇది రెనో డస్టర్ కన్నా మెరుగ్గా ఉండనుంది. అందుకే దీని ధర కూడా డస్టర్ కన్నా అధికంగా ఉండనుంది.

నిస్సాన్ టెర్రానో అఫీషియల్ స్కెచ్

నిస్సాన్ టెర్రానో అఫీషియల్ స్కెచ్

నిస్సాన్ టెర్రానో స్పైషాట్

నిస్సాన్ టెర్రానో స్పైషాట్

నిస్సాన్ టెర్రానో స్పైషాట్

నిస్సాన్ టెర్రానో స్పైషాట్


ప్రారంభంలో భాగంగా, నిస్సాన్ టెర్రానో ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ డీజిల్ వేరియంట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసినదాని ప్రకారం, ఇది లీటరుకు 20.5 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేయనుంది. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.
Source: IAB

Most Read Articles

English summary
Nissan Terrano has been spotted testing in Indian roads. Our fellow blog IAB brought these exclusive spyshots of Terrano. Nissan Terrano will launched in October and the expected starting price will be INR 8.90 lakhs (ex-showroom, Delhi).
Story first published: Tuesday, July 2, 2013, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X