జులై 3, 2014వ తేదీన నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ విడుదల

By Ravi

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కొత్త 2014 నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్‌ను వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడదల చేసేందుకు కంపెనీ ముహుర్తం ఖరారు చేసింది. ఈ మోడ్రన్ సన్నీ సెడాన్‌ను జులై 3, 2014వ తేదీన దేశీయ విపణిలో విడుదల చేయాలని నిస్సాన్ ఇండియా నిర్ణయించింది.

ఇది కూడా చదవండి : నిస్సాన్ సన్నీ ఫస్ట్ డ్రైవ్ రిపోర్ట్

నిస్సాన్ ఇండియా ఇటీవలే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో తమ కొత్త సన్నీ ఫేస్‌లిఫ్ట్ కోసం మీడియా టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా ఈ టెస్ట్ డ్రైవ్ కార్యక్రమానికి హాజరయ్యింది. ఈ సందర్భంగా, కొత్త 2014 నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.


కొత్త 2014 నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్‌లో కేవలం కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంజన్స్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. కొత్త సన్నీ మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. అవి - ఎక్స్ఈ, ఎక్స్ఎల్ మరియు ఎక్స్‌వి. ఇందులో ఎక్స్ఈ, ఎక్స్ఎల్ వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి. కాగా.. ఎక్స్‌వి వేరియంట్ మాత్రం కేవలం డీజిల్ వేరియంట్లోనే లభిస్తుంది. ఎక్స్‌వి వేరియంట్ కోసం కంపెనీ యాక్ససరీ ప్యాక్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. అవి - ప్రీమియం ప్యాక్ 1, ప్రీమియం ప్యాక్ 2.

బేస్ (ఎక్స్ఈ) వేరియంట్లో బాడీ కలర్డ్ బంపర్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, డ్యూయెల్ ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ ఎకానమీ డిస్‌ప్లే, కప్ హోల్డర్స్, టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్రైవర్ ఎయిర్‌బ్యాక్, ఏబిఎస్ మరియు బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు లభిస్తాయి.


మిడ్ (ఎక్స్ఎల్) వేరియంట్లో, బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, బ్లాకెన్డ్ రిమ్స్ విత్ వీల్ కవర్స్, బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్, బ్లాక్ బి-పిల్లర్, రియర్ డిఫాగ్గర్, 2-డిన్ ఆడియో సిస్టమ్ (బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీతో) స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్, 4 స్పీకర్లు, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, రియర్ ఆర్మ్ రెస్ట్, గ్రే థీమ్డ్ ఇంటీరియర్స్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, బూట్ ల్యాంప్, యాంటీ-థెఫ్ట్ అలారమ్, సీట్ బెల్ట్ ఇండికేటర్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో ఎక్స్ఎల్ వేరియంట్ ఆటోమేటిక్ (సివిటి) గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. డీజిల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ లేదు.
2014 Sunny Interior

ఇకపోతే టాప్ (ఎక్స్‌వి) వేరియంట్ కేవలం డీజిల్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇందులో మిడ్ (ఎక్స్ఎల్) వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా.. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ర్, అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ (ఇండికేటర్లతో), ఫ్రంట్ బంపర్ మరియు బూట్ డోర్‌పై క్రోమ్ గార్నిష్, 2-డిన్ ఆడియో సిస్టమ్ కోసం డిస్‌ప్లే యూనిట్, అవుట్‌సైడ్ టెంపరేచర్ డిస్‌ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, రియర్ వ్యూ కెమెరా, రియర్ ఏసి వెంట్స్, రియర్ రీడింగ్ ల్యాంప్స్, వైపర్స్ కోసం వేరియబల్ స్పీడ్ సెట్టింగ్ ఆప్షన్, ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్స్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

ఎక్స్‌వి వేరియంట్ కోసం కంపెనీ రెండు ప్రత్యేక యాక్ససరీ ప్యాక్‌లను కూడా అందిస్తోంది. ఇందులో ప్రీమియం ప్యాక్ 1లో లెథర్ సీట్స్, లెథర్‌తో కవర్ చేయబడిన స్టీరింగ్ వీల్, గేర్ లివర్ ఫీచర్లు లభిస్తాయి. అలాగే ప్రీమియం ప్యాక్ 2లో సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి. దీని ధర ఇతర వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Japanese automobile manufacturer Nissan will be launching the updated version of its Sunny sedan. They had showcased the new model at the 2014 Auto Expo held in New Delhi. The facelifted version of the sedan will sport a host of upgrades.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X