భారత్‌లో పోర్షే మకన్ విడుదల; ధర రూ.1 కోటి

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ పోర్షే (ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ) గడచిన బీజింగ్ మోటార్ షోలో ప్రదర్శించిన తమ అధునాతన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'పోర్షే మకన్' (Porsche Macan)ను కంపెనీ ఈ ఏడాది జులై నెలలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. పోర్షే గడచిన సోమవారం తమ మకన్ స్పోర్ట్స్ కారును న్యూఢిల్లీలో విడుదల చేసింది.

సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఈ మోడల్‌ను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతుంది. దేశీయ విపణిలో పెట్రోల్ వెర్షన్ ధర రూ.1.11 కోట్లుగా ఉంటే డీజిల్ వెర్షన్ ధర రూ.1 కోటిగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అంతర్జాతీయ మార్కెట్లలో పోర్షే మకన్ ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయింది, అలాగే ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ ఇప్పటికే పూర్తిగా బుక్ అయినట్లు కంపెనీ పేర్కొంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

భారత్‌లో పోర్షే మకన్ విడుదల

పోర్షే మకన్ ఎస్‌యూవీ తొలిసారిగా గడచిన సంవత్సరంలో జరిగిన లాస్ ఏంజిల్స్ ఆటో షోలో కంపెనీ విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

భారత్‌లో పోర్షే మకన్ విడుదల

ఆడి క్యూ5 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని పోర్షే మకన్ ఎస్‌యూవీని అభివృద్ధి చేశారు. అయితే, ఆడి క్యూ5తో పోల్చుకుంటే ఇది కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది.

భారత్‌లో పోర్షే మకన్ విడుదల

పోర్షే మకన్ ఎస్ డీజిల్ వేరియంట్లో 245 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ట్విన్ టర్బో, 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. పోర్షే మకన్ టర్బో వేరియంట్లో 400 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ట్విన్ టర్బో, 3.6 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

భారత్‌లో పోర్షే మకన్ విడుదల

ఈ రెండు ఇంజన్లు కూడా 7-స్పీడ్ పిడికె డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో నుసంధానం చేయబడి ఉంటాయి. ఈ రెండు వేరియంట్లు కూడా ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఇందులో ఇతర ఎలక్ట్రానిక్ సాంకేతికతలతో పాటుగా పోర్షే ట్రాక్షన్ మేనేజ్‌మెంట్ ఫీచర్ కూడా ఉంది.

భారత్‌లో పోర్షే మకన్ విడుదల

మకన్ ఎస్ డీజిల్ వేరియంట్ 6.3 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇదే వేగాన్ని టర్బో వేరియంట్ కేవలం 4.8 సెకండ్ల వ్యవధిలోనే చేరుకుంటుంది. ఆప్షనల్ స్పోర్ట్ క్రోనో ప్యాకేజ్ జోడించుకున్నట్లయితే, ఈ సమయం వరుసగా 5.0 సెకండ్లు, 4.4 సెకండ్లకు తగ్గుతుంది.

భారత్‌లో పోర్షే మకన్ విడుదల

పోర్షే మకన్ ఎస్ డీజిల్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 230 కిలోమీటర్లు. పోర్షే మకన్ టర్బో వేరియంట్ గరిష్ట వేగం గంటకు 266 కిలోమీటర్లు.

భారత్‌లో పోర్షే మకన్ విడుదల

అన్ని మకన్ ఎస్‌యూవీలు స్పోర్ట్ బటన్‌తో లభిస్తాయి. ఈ బటన్ వలన స్టీరింగ్ మరింత రెస్పాన్సివ్‌గా, సస్పెన్షన్ మరింత స్టిఫ్‌గా, ఇంజన్ పెర్ఫామెన్స్ మరింత మెరుగ్గా ఉండి స్పోర్టీ డ్రైవ్‌ను ఆఫర్ చేస్తుంది.

భారత్‌లో పోర్షే మకన్ విడుదల

ఆఫ్ రోడింగ్ కోసం ఒక్క బటన్‌ను ప్రెస్ చేయగానే, ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రతి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ రోడింగ్ డ్రైవ్‌కు అనుగుణంగా మారిపోతుంది. అంతేకాకుండా, ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 1.58 ఇంచ్‌ల నుంచి 9.06 ఇంచ్‌లకు పెరుగుతుంది. అయితే, ఇది కేవలం గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని దిగువన ఉన్నప్పుడే పనిచేస్తుంది.

భారత్‌లో పోర్షే మకన్ విడుదల

పోర్షే మకన్ ఇంటీరియర్స్ ఇతర పోర్షే వాహనాల ఇంటీరియర్స్‌ను పోలి ఉంటాయి. ఉదాహరణకు, సెంట్రల్ కంట్రోల్ ప్యానెల్ 918 స్పైడర్ మోడల్‌లోని సెంటర్ కన్సోల్‌ను తలపిస్తుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, బోస్ లేదా బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, హార్డ్ డ్రైవ్ ఆధారిత నావిగేషన్ సిస్టమ్, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ మొదలైన అనేక ఎలక్ట్రానిక్ ఫీచర్లను ఇందులో చూడొచ్చు.

Most Read Articles

English summary
The German luxury car manufacturer, Porsche has launched its much awaited compact SUV Macan in India. Petrol version Porsche Macan is price at INR 1.11 crore while diesel version is priced at INR 1 crore (all prices ex-showroom New Delhi).
Story first published: Tuesday, July 22, 2014, 11:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X