చెవర్లే సెయిల్ సెడాన్‌కు ప్రీ బుకింగ్స్ ప్రారంభం!

By Ravi

జనరల్ మోటార్స్ ఇండియా నుంచి బడ్జెట్ కార్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ 'సెయిల్' మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. చెవర్లే సెయిల్‌ను వచ్చే నెల 1వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయాలని జనరల్ మోటార్స్ నిర్ణయించింది. ఇప్పటికే దేశీయ విపణిలో విడుదలై సక్సెస్ సాధించిన సెయిల్ యువా (Sail U-Va) హ్యాచ్‌బ్యాక్‌కు సెడాన్ వెర్షన్‌గా వస్తున్న సెయిల్ కూడా మంచి సక్సెస్‌ను సాధించగలదని కంపెనీ అంచనా వేస్తోంది.

చెవర్లే సెయిల్ ఇప్పటికే కొన్ని అధీకృత డీలర్ల స్టాక్ యార్డ్‌కు చేరిపోయింది. ఫిబ్రవరి 1, 2013న ఇది వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, కొందరు జనరల్ మోటార్స్ డీలర్లు చెవర్లే సెయిల్ సెడాన్ ముందస్తు (ప్రీ-బుకింగ్) బుకింగ్‌లను ప్రారంభించారు. వినియోగదారుల నుంచి దాదాపు రూ.50 వేల మొత్తాన్ని సేకరించి ఈ సెడాన్‌ను బుక్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జనరల్ మోటార్స్ ఇండియా అందిస్తున్న చెవర్లే ఏవియో స్థానాన్ని ఈ చెవర్లే సెయిల్ సెడాన్ భర్తీ చేయనుంది.

చెవర్లే సెయిల్ యువా హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన ఇంజన్లనే చెవర్లే సెయిల్ సెడాన్‌లోను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.2 లీటర్ (1199సీసీ) స్మార్టెక్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.3 లీటర్ (1248సీసీ) స్మార్టెక్ టర్బో-ఛార్జ్‌డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

* స్లీక్ స్టయిలిష్ లుక్స్:

రోడ్డుపై వెళ్తుంటే, అవతలి వాళ్ల తలలు తిప్పుకునేలా, హృదయాలను గెలుచుకునేలా చెవర్లె సెయిల్ సెడాన్‌ను డిజైన్ చేశారు. ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, ఆకట్టుకునే ఇంటీరియర్స్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

* విశాలమైన ఇంటీరియర్ స్పేస్:

సెయిల్‌లో ఉండే ఎక్సలెంట్ లెగ్ రూమ్, విశాలమైన బూట్ స్పేస్, రియర్ సీట్ ఆర్మ్‌‌రెస్ట్, స్మార్ట్ స్టోరేజ్ స్పేసెస్ వంటి ఫీచర్ల వలన ఇది విలాసవంతమైన కారు అనుభూతిని కల్పిస్తుంది.

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

* అధునాతన భద్రతా ఫీచర్లు:

సెయిల్‌లో ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించేలా ఈ కారును తీర్చిదిద్దారు. ప్రమాద పరిస్థితులను తట్టుకునేలా 'సేఫ్ కేజ్' స్ట్రక్చర్‌తో దీనిని తయారు చేశారు. కారు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-టెన్షనర్ సీట్ బెల్ట్స్, క్రంపల్ జోన్స్, కొలాప్సబల్ స్టీరింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

* సాటిలేని పెర్ఫామెన్స్:

చెవర్లే సెయిల్ యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన ఇంజన్లనే చెవర్లే సెయిల్ సెడాన్‌లోను ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.2 లీటర్ (1199సీసీ) స్మార్టెక్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4400 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ సెయిల్‌లో అమర్చిన 1.3 లీటర్ (1248సీసీ) స్మార్టెక్ టర్బో-ఛార్జ్‌డ్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 78 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 205 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి.

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

* స్మార్ట్ ఫీచర్లు:

ఫోన్ కాల్స్ చేసుకునేందుకు, సంగీతం వినేందుకు వీలుగా బ్లూటూత్ కనెక్టివిటీ, విశిష్టమైన 3-5-3 అడ్వాంటేజ్ (3 ఏళ్లు/45,000 కి.మీ. చెవర్లే ప్రామిస్, 5 ఏళ్లు/1,50,000 కి.మీ. ఇంజన్, ట్రాన్సిమిషన్ వారంటీ, 3 ఏళ్లు/1,00,000 కి.మీ. వారంటీ)తో ఇది లభిస్తుంది.

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌ ఫ్రంట్ వ్యూ

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌ సైడ్ వ్యూ

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌ రియర్ వ్యూ

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

హనీ కోంబ్ గ్రిల్

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

షార్ప్ హెడ్ ల్యాంప్స్

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

సన్‌రూఫ్

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

క్లియర్ లెన్స్ టెయిల్ ల్యాంప్స్

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

విశాలమైన బూట్ స్పేస్

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్

చెవర్లే సెయిల్ సెడాన్‌

చెవర్లే సెయిల్ సెడాన్‌

టీజర్ ఇమేజ్


ఆకర్షనీయమైన డిజైన్, స్టయిలిష్ లుక్, ఎక్సలెంట్ లెగ్ రూమ్, విశాలమైన బూట్ స్పేస్, రియర్ సీట్ ఆర్మ్‌‌రెస్ట్, స్మార్ట్ స్టోరేజ్ స్పేసెస్ వంటి ఫీచర్లతో ఇది విలాసవంతమైన కారు అనుభూతిని అందిస్తుంది. ప్రమాద పరిస్థితులను తట్టుకునేలా 'సేఫ్ కేజ్' స్ట్రక్చర్‌తో దీనిని తయారు చేశారు. కారు వేగాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్స్, సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-టెన్షనర్ సీట్ బెల్ట్స్, క్రంపల్ జోన్స్, కొలాప్సబల్ స్టీరింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు చెవర్లే సెయిల్ సొంతం.

Most Read Articles

English summary
US auto major General Motors India is all set to launch the much awaited Sail sedan on February 1, 2013. The all-new Chevrolet Sail sedan is expected priced at around INR 6 lakh. Chevrolet Sail Sedan and has also reached to all Chevrolet dealerships across India. The buyers can book the car with an amount of INR 50,000 and can take away the car once launched.
Story first published: Tuesday, January 29, 2013, 17:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X