ఇన్-కార్ టెక్నాలజీలో నెంబర్ వన్ 'రేంజ్ రోవర్ ఎవోక్'

By Ravi

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ప్రవేశపెట్టిన ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ "రేంజ్ రోవర్ ఎవోక్" అవార్డుల మీద అవార్డులను దక్కించుకుంటోంది. తాజాగా మరో మూడు ప్రముఖ అవార్డులు ఈ బ్రిటీష్ ఎస్‌యూవీని వరించింది.

పాత్రికేయులు, విశ్లేషకులు, విమర్శకులు మరియు యజమానుల ఇప్పటికే విస్తృతస్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈ బుజ్జి లగ్జరీ ఎస్‌యూవీ తాజా అవార్డులతో మొత్తం 161 అవార్డులను సొంతం చేసుకుంది. రేంజ్ రోవర్ ఎవోక్ తాజాగా బెస్ట్ ఇన్-కార్ టెక్నాలజీ రీడర్ అవార్డ్, ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, బెస్ట్ ప్రీమియం ఎస్‌యూవీ అవార్డులను కైవసం చేసుకుంది.

ప్రత్యేకించి, రేంజ్ రోవర్ ఎవోక్ కారులో ఆఫర్ చేస్తున్న ఇన్-కార్ టెక్నాలజీ ఫీచర్లు చాలా విశిష్టమైనవి. అవేంటో మనం ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఇన్-కార్ టెక్నాలజీలో నెంబర్ వన్ 'రేంజ్ రోవర్ ఎవోక్'

రేంజ్ రోవర్ ఎవోక్ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీలోని ఇన్-కార్ టెక్నాలజీ ఫీచర్లను తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

ఇన్-కార్ టెక్నాలజీలో నెంబర్ వన్ 'రేంజ్ రోవర్ ఎవోక్'

రేంజ్ రోవర్ ఎవోక్‌‌లోని 4x4i సిస్టమ్ వాహన డైనమిక్స్‌ను నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ, సెంటర్ కన్సోల్‌పై ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ద్వారా ఊహాజనిత సమాచారాన్ని అందిస్తుంది. దీనినిక అదనంగా, ల్యాండ్ రోవర్ ఆఫ్-రోడ్ నావిగేషన్ సిస్టమ్, అన్‌మ్యాప్డ్ ఏరియాస్‌లో (మ్యాప్‌లలోని ఏరియాల్లో) డ్రైవింగ్‌కి కావల్సిన సహాయాన్ని అందిస్తుంది.

ఇన్-కార్ టెక్నాలజీలో నెంబర్ వన్ 'రేంజ్ రోవర్ ఎవోక్'

ఇందులోని ల్యాండ్ రోవర్ వేడ్ సెన్సింగ్, డోర్ మిర్రర్లో ఉండే సెన్సార్లను ఉపయోగించుకొని నీటిలో డ్రైవ్ చేస్తున్నప్పుడు, ప్రత్యేకించి రాత్రివేళల్లో విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు, వాహన పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకునే వాతావరణ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని డ్రైవర్‌కు అందిస్తుంటాయి. ఎవోక్ గరిష్ట వేడింగ్ డెప్త్ 500 మి.మీ.

ఇన్-కార్ టెక్నాలజీలో నెంబర్ వన్ 'రేంజ్ రోవర్ ఎవోక్'

రేంజ్ రోవర్ ఎవోక్‌లోని సరౌండ్ కెమెరాలు విజిబిలిటీని మరియు డ్రైవర్ అవగాహనను పెంచుతాయి. ఇందులో ఐదు డిజిటర్ కెమెరాలను వాగనం చుట్టూ అమర్చబడి ఉంటాయి, ఇవి వాహన చుట్టుపక్కల దాదాపు 360 డిగ్రీ రియల్ టైమ్ వ్యూని చూపిస్తుంటాయి.

ఇన్-కార్ టెక్నాలజీలో నెంబర్ వన్ 'రేంజ్ రోవర్ ఎవోక్'

ఇందులోని బ్లైండ్ స్పాట్ మోనిటరింగ్ మరో విశిష్టమైన ఫీచర్. సైడ్ మౌంటెడ్ రాడార్ సెన్సార్లను ఉపయోగించుకొని పనిచేసే ఈ సిస్టమ్, వాహనం వెనుక ఇరువైపులా పటిష్టమైన బ్లైండ్ స్పాట్‌లను గుర్తించి, లైను మారేటప్పుడు ఏ బ్లైండ్ స్పాట్ నుంచి వాహనం వేగంగా వస్తుందో అనే సమాచారన్ని తెలియజేస్తుంది. వాహనానికి ఇరువైపులా ఉండే సైడ్ మిర్రర్స్‌పై బ్లైండ్ స్పాట్ వార్నింగ్ లైట్‌ను ఫ్లాష్ చేయటం ద్వారా ఇది సదరు బ్లైండ్ స్పాట్ గురించి డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుంది.

ఇన్-కార్ టెక్నాలజీలో నెంబర్ వన్ 'రేంజ్ రోవర్ ఎవోక్'

రివర్స్ ట్రాఫిక్ డిటెక్షన్ ఇందులో మరో విశిష్టమైన ఫీచర్. వాహనాన్ని రివర్స్ చేస్తున్నప్పుడు లేదా రివర్స్ పార్క్ చేస్తున్నప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇది తెలియజేస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం గుర్తిస్తే, విజువల్ మరియు ఆడియో సంకేతాల ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేయటం జరుగుతుంది.

ఇన్-కార్ టెక్నాలజీలో నెంబర్ వన్ 'రేంజ్ రోవర్ ఎవోక్'

బెటల్ మైలేజ్, ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ డ్రైవింగ్ కోసం ఇందులో ఈకో డ్రైవ్ ఫీచర్ ఉంటుంది. ఇది ఇంధన వినియోగం, ఇదివరకటి డ్రైవింగ్ హిస్టరీ, డేటా కంపారిజన్లను గుర్తించి 8-ఇంచ్ టచ్‌స్క్రీన్‌పై అనేక రకాల సమాచారాన్ని తెలియజేస్తుంది. డ్రైవింగ్ స్టైల్‌ను మెరుగు పరచుకునేందుకు కూడా ఇది చిట్కాలను అందిస్తుంది.

ఇన్-కార్ టెక్నాలజీలో నెంబర్ వన్ 'రేంజ్ రోవర్ ఎవోక్'

ల్యాండ్ రోవర్ తమ రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్‌ను 2011లో తొలిసారిగా మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది సుమారు 161కి పైగా అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. స్టయిలిష్ డిజైన్, సుపీరియర్ క్వాలిటీ, మోడ్రన్ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్స్, ఫ్యూయెల్ ఎఫీషియెంట్ ఇంజన్ అండ్ 9-స్పీడ్ ఆటోమేటిక్ జెడ్ఎఫ్ ట్రాన్సిమిషన్ వంటి అనేక విశిష్టతలు దీని సొంతం.

వీడియో

రేంజ్ రోవర్ ఎవోక్ డ్రైవింగ్ డైనమిక్స్‌ను వివరించే వీడియోని ఈ స్లైడ్‌లో వీక్షించండి.

Most Read Articles

English summary
Range Rover Evoque is known for its global haul of accolades. Since its launch in 2011, the Evoque has won awards for leading-edge design, striking interior, and now yet again for in-car technology. 
Story first published: Tuesday, July 1, 2014, 12:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X