నానో విషయంలో తప్పు చేశాం; కొత్త నానో విడుదల చేస్తాం: టాటా

By Ravi

రతన్ టాటా కలల కారు 'టాటా నానో'ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తుంటే, ఈ కారు విషయంలో తాము చేసిన తప్పేంటే కంపెనీ యాజమాన్యానికి ఇప్పుడే అర్థమైనట్లుంది. టాటా నానో కారు మార్కెటింగ్ విషయంలో తప్పు జరిగిందని, నానోను చౌక/చీప్ కారుగా మార్కెటింగ్ చేయటమే తాము చేసిన తప్పని రతన్ టాటా ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

నానో మార్కెటింగ్ విషయంలో చౌక కారు ప్రచారంతో తప్పు చేశామని ఆయన అంగీకరించారు. ద్విచక్ర వాహనాలపై పిల్లలతో సహా ప్రయాణించే మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని, వారికి అందుబాటులో ఉండే ధరకే కారు అందించాలనే ఉద్దేశంతో టాటా నానో కారును తయారు చేశామే తప్ప, ఇది చౌక కారు మాత్రం కాదని ఆయన వివరించారు.

ఇదిలా ఉండగా.. టాటా నానో కారుపై పడిన చౌక/చీప్ కార్ అనే ముద్రను తొలగించుకునేందుకు టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తుందని ఆయన చెప్పారు. ఆ వివరాంటే, టాటా మోటార్స్ ఏం చేయబోతుందో క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి.

సరికొత్త నానో..

సరికొత్త నానో..

టాటా మోటార్స్ ఓ సరికొత్త నానోను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తుందని రతన్ టాటా తెలిపారు. నానో కారుకు కొత్త రూపు (కొత్త డిజైన్) మరియు ఇమేజ్‌ని ఇవ్వాలనే లక్ష్యంతో టాటా గ్రూప్ ముందుకు సాగుతోంది.

ముందుగా ఇండోనేషియాలో విడుదల..

ముందుగా ఇండోనేషియాలో విడుదల..

ఈ వ్యూహంలో భాగంగానే సరికొత్త టాటా నానో కారును భారత్‌లోనే కాకుండా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో (ముందుగా ఇండోనేషియాలో) కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయని రతన్ టాటా తెలిపారు.

చీప్ కారు ముద్ర తొలగింపు..

చీప్ కారు ముద్ర తొలగింపు..

టాటా నానోపై పడిన చీప్ కార్ అనే ముద్రను తొలగించే దిశగా కొత్త నానో కారును తీర్చిదిద్దనున్నామని, ఈ కొత్త నానోను ఇండోనేషియాలో ప్రవేశపెట్టిన తర్వాత ఇండియన్ మార్కెట్లోకి తీసుకు వస్తామని వివరించారు.

యూరప్ మార్కెట్లో కూడా విడుదల..

యూరప్ మార్కెట్లో కూడా విడుదల..

కొత్తగా మార్పులు చేర్పులు చేసిన సరికొత్త టాటా నానో కారును యూరప్ దేశాల్లో కూడా విక్రయిస్తామని, నానో పట్ల ఇప్పటికే కొన్ని ప్రపంచ దేశాల్లో మంచి ఆసక్తి నెలకొని ఉందని సీఎన్‌బీసీ మేనేజింగ్ ఏషియా కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా చెప్పారు.

నానో సేల్స్ డౌన్..

నానో సేల్స్ డౌన్..

టాటా మోటార్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని భారత్‌లో విడుదల చేసిన నానో కారు అమ్మకాలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 43,627గా ఉన్న నానో విక్రయాలు ఈ ఏడాది ఇదే కాలానికి 72 శాతం క్షీణించి 12,322కు పడిపోయాయి.

కొత్త 2013 నానో, నానో సిఎన్‌జి విడుదల

కొత్త 2013 నానో, నానో సిఎన్‌జి విడుదల

టాటా మోటార్స్ ఇటీవలే అప్‌గ్రేడ్ చేసిన కొత్త 2013 నానోతో పాటుగా సిఎన్‌జి వెర్షన్ నానో కారును కూడా విడుదల చేసింది. ఈ మోడళ్లలో కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కొత్త 2013 నానోలో చేసిన మార్పులు చేర్పులు ఏంటో తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

2013 టాటా నానో - ఎక్స్టీరియర్స్

2013 టాటా నానో - ఎక్స్టీరియర్స్

అలాగే, కొత్త ఎక్స్టీరియర్ కలర్స్, ఫ్రంట్ అండ్ రియర్ క్రోమ్ స్ట్రిప్స్‌తో మరింత ప్రీమియం లుక్‌నిచ్చేలా డిజైన్ చేశారు. వెనుక వైపు ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు గాను బంపర్‌కు పెద్ద ఎయిర్ వెంట్స్‌ను జోడించారు. సులువుగా స్టీరింగ్‌ను ఆపరేట్ చేసేలా స్టీరింగ్‌ను, సస్పెన్షన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మూడు కొత్త ఎక్స్టీరియర్ కలర్స్ (డాజల్ బ్లూ, రాయల్ గోల్డ్, కార్న్‌ఫ్లవర్ బ్లూ)ను జోడించారు.

2013 టాటా నానో - ఇంటీరియర్స్

2013 టాటా నానో - ఇంటీరియర్స్

కొత్త టాటా నానో కారులో రిమోట్ కీలెస్ ఎంట్రీ, డ్యాష్‌బోర్డుపై ఏర్పాటు చేసిన రెండు గ్లౌ బాక్సులు, 12 వోల్ట్ పవర్‌ సాకెట్‌తో కూడిన రీస్టయిల్డ్ సెంటర్ కన్సోల్, రియర్ పార్సిల్ షెల్ఫ్, నాలుగు స్పీకర్లు, బ్లూటూత్, ఆక్స్-ఇన్ మరియు యూఎస్‌బి సపోర్టుతో కూడిన ఆంఫీస్ట్రీమ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఇంటీరియర్ ఫీచర్లను జోడించారు.

ఇంజన్, మైలేజ్

ఇంజన్, మైలేజ్

టాటా నానోలో ఉపయోగించిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 25.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

రూ.1 లక్ష నుంచి రూ.2.65 లక్షల వరకూ..

రూ.1 లక్ష నుంచి రూ.2.65 లక్షల వరకూ..

లక్ష రూపాయల కారుగా 2009లో భారత మార్కెట్లో విడుదలైన టాటా నానో ప్రస్తుత ధరలు రూ.1.45 లక్షల నుంచి రూ.2.65 లక్షల రేంజ్‌లో (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

Most Read Articles

English summary
After around five years since the launch of Tata Nano Ratan Tata, the man behind the ambitious ‘World Cheapest Car' project, has admitted that marketing the car as the cheapest was indeed a mistake. "It became termed as a cheapest car by the public and, I am sorry to say, by ourselves, not by me, but the company when it was marketing it. I think that is unfortunate," Mr Tata said.
Story first published: Saturday, November 30, 2013, 13:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X