రెనో న్యూ ఇయర్ గిఫ్ట్: భారత్‌లో అప్‌గ్రేడెడ్ డస్టర్ విడుదల

By Ravi

మీరు రెనో డస్టర్ కొనటానికి ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఇంకొంత కాలం వేచి ఉన్నట్లయితే, ఇదిగో ఈ ఫొటోల్లో కనిపిస్తున్న సరికొత్త డస్టర్‌ను సొంతం చేసుకోవచ్చు. అవును.. ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డస్టర్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఇప్పటికే కొత్త 2014 డస్టర్‌ను కంపెనీ గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది.

గడచిన ఆగస్టు నెలలో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో రెనో ఈ కొత్త 2014 డస్టర్‌ను తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో కంపెనీ ఈ కొత్త మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఈ మేరకు భారత్ వంటి మార్కెట్ల కోసం రూపొందించిన కొత్త 2014 రెనో డస్టర్ ఫొటోలను కంపెనీ తాజాగా విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ కొత్త డస్టర్ విడుదల కానుంది.

మరి ఈ అప్‌గ్రేడెడ్ 2014 రెనో డస్టర్‌లోని ఆ కొత్త ఫీచర్లేంటో తెలుసుకుందాం రండి..!

అప్‌గ్రేడెడ్ రెనో డస్టర్

కొత్త 2014 రెనో డస్టర్ బేసిక్ డిజైన్ మాత్రం ఇదివరకటిలానే ఉంటుంది. అయితే, కొత్త క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, ఆకర్షనీయమై పెద్ద రెనో లోగో, డ్యూయెల్ ఎలిమెంట్ హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్ యూనిట్స్ వంటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్‌ల కారణంగా ఇది మునుపటి వెర్షన్ డస్టర్ కన్నా మరింత ప్రీమియంగా, స్టయిలిష్‌‌గా కనిపిస్తుంది.

అప్‌గ్రేడెడ్ రెనో డస్టర్

వెనుక డిజైన్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేవీ లేవు. టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌ను కొద్దిగా రీడిజైన్ చేశారు. అలాగే లైసెన్స్ ప్లేట్‌కు పైభాగంలో ప్లాస్టిక్ ఇన్‌సెర్ట్‌ను అమర్చారు.

అప్‌గ్రేడెడ్ రెనో డస్టర్

కొత్త డస్టర్ సైడ్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేవు. రూఫ్ రెయిల్స్ ఇప్పుడు డస్టర్ బ్యాడ్జ్‌తో లభిస్తాయి. ఇకపోతే ఇందులో కొత్తగా 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

అప్‌గ్రేడెడ్ రెనో డస్టర్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఆడియో కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్, సరికొత్త రెనో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను జోడించారు. అయితే, ఇవి టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అప్‌గ్రేడెడ్ రెనో డస్టర్

చివరగా.. కొత్త డస్టర్‌లో సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ వంటి మార్పులు చేర్పులు చేశారు. కానీ, యాంత్రిక పరంగా మాత్రం ఇందులో మార్పులు చేర్పులు ఉండబోవని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి లోపుగా ఇది విడుదల కావచ్చని అంచనా.

Most Read Articles

English summary
Here is the first images of the Renault Duster facelift we have all been waiting for. The original source of these images is not known, however, this is rumored to be the face of the 2014 Duster that's headed to India.
Story first published: Saturday, November 30, 2013, 16:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X