ఇప్పుడు రెనో ఇండియా వంతు; రూ.4 లక్షలకు దిగువన చిన్న కారు

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా తమ పురాతన డాట్సన్ బ్రాండ్‌తో రూ.4 లక్షలకు దిగువన ఓ చవక కారును (గో హ్యాచ్‌బ్యాక్) ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. కాగా.. నిస్సాన్ భాగస్వామి రెనో ఇండియా కూడా భారత మార్కెట్ కోసం రూ4 లక్షలకు దిగువన ఓ చిన్న కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

అయితే, రెనో మాత్రం నిస్సాన్ మాదిరిగా తమ చిన్న కారును వేరే బ్రాండ్ క్రింద కాకుండా తమ స్వంత బ్రాండ్ క్రిందనే విడుదల చేయాలని యోచిస్తోంది. ఆల్టో, ఇయాన్ వంటి కార్లకు పోటీగా ఓ ఎంట్రీ లెవల్ కారును విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రెనో ఇండియా సీఈఓ, ఎమ్‌డి సుమితు సాహ్నే తెలిపారు.

Renault Entry Level Car

రెనో ఇండియా ప్రస్తుతం 2.6 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను రానున్న మూడు నాలుగేళ్లలో 5 శాతానికి పెంచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రూ.4 లక్షల దిగువన విడుదల చేసే చిన్న కారు తమ ఎంతగానో సహకరించగలదని కంపెనీ విశ్వసిస్తోంది. భారత్‌లో ఈ సెగ్మెంట్ కార్లకు మంచి డిమాండ్ ఏర్పడగలదని రెనో యోచిస్తోంది.

ప్రస్తుతం రెనో ఇండియాకు ఈ సెగ్మెంట్లో ఎలాంటి ఉత్పత్తి లేదు. పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ను మాత్రమే కంపెనీ విక్రయిస్తోంది. దీని ధర రూ.4 లక్షలకు ఎగువన ఉంటోంది. అయితే, రెనో తమ చిన్న కారు కోసం డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌నే ఉపయోగించుకుంటుందా..? లేక సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన కారును విడుదల చేస్తుందా..? అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది.

Most Read Articles

English summary
Renault India CEO & MD Sumit Sawhney has stated that the company will launch its first entry level car next year that will be placed in the same category as the Alto. The French automaker wants to increase its current market share of 2.6 percent to 5 percent in the next 3 to 4 years. The company believes its sub-4 lakh car will help it achieve that goal.
Story first published: Saturday, March 15, 2014, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X