రెనో కొలియోస్‌ ఫేస్‌లిఫ్ట్ ధరలు వెల్లడి, ఫిబ్రవరిలో లాంచ్

By Ravi

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ తమ 2014 రెనో కొలియోస్‌కు సంబంధించి సమచారాన్ని తమ అధికారిక వెబ్‌సైడ్‌లో విడుదల చేసింది.

కొత్త 2014 రెనో కొలియోస్ వేరియంట్లు, ఫీచర్లు మరియు ధరల వివరాలను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీని మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ అధికారికంగా విడుదల చేయనుంది. రెనో ఇండియా సెప్టెంబర్ 2011లో తొలిసారి తమ కొలియోస్ ఎస్‌యూవీ భారత్‌లో విడుదల చేసింది. ఇప్పటి వరకు ఇది కేవలం ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌లో కేవలం ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభ్యమయ్యేది.


అయితే, కొత్త ఫేస్‌లిఫ్ట్ రెనో కొలియోస్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌తో పాటుగా టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్‌లో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో ఉంది. టూ-వీల్ డ్రైవ్ కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌లో మాత్రమే లభ్యమవుతుంది. అన్ని వేరియంట్లు కూడా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తాయి. అయితే, వేరియంట్‌ను బట్టి ఇంజన్ ట్యూనింగ్ వేరుగా ఉంటుంది.

ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌‌లోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 173 పిఎస్‌ల శక్తిని, 360 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టూ-వీల్ డ్రైవ్ వేరియంట్‌లోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 150 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సును ఆటోమేటిక్ వేరియంట్లోల 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్సులను ఉపయోగించారు.

Renault Koleos Facelift Interiors

ఇక ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే, బేస్ మోడల్‌లో సింగిల్ టోన్ అల్లాయ్ వీల్స్, 4x4 మోడళ్లలో డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో బోస్ ఆడియో సిస్టమ్, ఈఎస్‌పి, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రిస్ సీట్ అడ్జస్టమెంట్, లెథర్ సీట్స్ వంటి ఫీచర్లను తొలగించారు. కొత్త కొలియోస్ వేరియంట్లు, ధరలు, మైలేజ్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

* రెనో కొలియోస్ 4×2 ఎమ్‌టి: ధర - రూ.22.36 లక్షలు; మైలేజ్ - 17.15 కెఎమ్‌పిఎల్
* రెనో కొలియోస్ 4×4 ఎమ్‌టి: ధర - రూ.25.19 లక్షలు; మైలేజ్ - 16.26 కెఎమ్‌పిఎల్
* రెనో కొలియోస్ 4×4 ఏటి: ధర - రూ.26.25 లక్షలు; మైలేజ్ - 14.56 కెఎమ్‌పిఎల్

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, మైలేజ్ వివరాలు ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం)

Most Read Articles

English summary
French carmaker Renault India has revealed the prices and details of the refreshed 2014 Renault Koleos ahead of its Indian premiere at the Auto Expo 2014 in Feb. Take a look.
Story first published: Wednesday, January 29, 2014, 11:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X