ఆటో ఎక్స్‌పో 2014: రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్

By Ravi

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'డస్టర్'లో ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను భారత్‌కు పరిచం చేసింది. గడచిన సంవత్సరం జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించిన లిమిటెడ్ ఎడిషన్ డాసియా డస్టర్ నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసిన సరికొత్త డస్టర్‌ను కంపెనీ నేడు (ఫిబ్రవరి 5, 2014)న 12వ ఢిల్లీ ఆటో ఎక్స్‌‌లో విడుదల చేసింది.

ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ అని పిలువనున్నారు. పేరుకు తగినట్లుగానే, ఈ ఎస్‌యూవీ ఆఫ్-రోడింగ్‌కు అనువుగా డిజైన్ చేశారు. ఈ డస్టర్ అడ్వెంచర్‌లో కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, అదనపు లైట్లతో కూడిన బంపర్ ప్రొటెక్షన్ గార్డ్, స్పెషల్ బాడీ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లను జోడించారు. రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని, ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌‌

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌‌లో బాడీ గ్రాఫిక్స్ మరియు చిన్న కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లేవీ లేవు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌

ముఖ్యంగా రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌లో యాంత్రికపరమైన మార్పులు లేవు. ప్రస్తుత డస్టర్‌లో ఉపయోగించిన ఇంజన్లనే ఇందులో ఉపయోగిస్తున్నారు.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌

రెనో డస్టర్ అడ్వెంచర్ టూ-వీల్ డ్రైవ్ (4X2), ఫోర్-వీల్ డ్రైవ్ (4X4) ఆప్షన్లతో లభ్యం కానున్నట్లు సమాచారం.

రెనో డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్‌

త్వరలోనే ఈ సరికొత్త రెనో డస్టర్ వేరియంట్ దేశీయ విపణిలో వాణిజ్య పరంగా లభ్యంకానుంది.

Most Read Articles

English summary
French carmaker Renault India has unveiled the limited edition version of Duster SUV dubbed as 'Duster Adventure' at 2014 Auto Expo in Greater Noida today. Duster Adventure will be available in both 4X2 and 4X4 versions.
Story first published: Wednesday, February 5, 2014, 12:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X