రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షో; మరికొద్ది రోజుల్లో విడుదల

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా (Renault India) ఎమ్‌పివి సెగ్మెంట్లో 'లాజీ' (Lodgy) అనే పేరుతో ఓ సరికొత్త మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్న సంగతి తెలిసినదే. ఈ మేరకు, కంపెనీ తమ 2015 రెనో లాజీ ఎమ్‌పివి అధికారిక ఫొటోని కూడా విడుదల చేసింది. కాగా.. తాజాగా.. ఈఎమ్‌పివిని తొలిసారిగా పబ్లిక్ కోసం ప్రదర్శనకు ఉంచింది.

రెనో మెయిన్ స్పాన్సర్‌గా వ్యవహరించిన 'రెనో స్టార్ గిల్డ్ అవార్డ్స్' అనే కార్యక్రమంలో కంపెనీ తమ లాజీ ఎమ్‌పివిని ప్రదర్శించింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక బాలీవుడ్ ప్రముఖులు, రెనో కార్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్, రెనో ఇండియా ఎండి, సీఈఓ సుమిత్ సాహ్నేలు రెనో లాజీ కారును ఆవిష్కరించారు.

కాగా.. ఈ షోలో మొట్టమొదటి రెనో లాజీ కస్టమర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పేరును ప్రకటించారు. రెనో లాజీ ఎమ్‌పివికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

వాస్తవానికి లాజీ ఎమ్‌పివి ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో డాసియా బ్యాడ్జ్ క్రింద విక్రయిస్తున్నారు. రెనో లాజీ ఒక 7-సీటర్ ఎమ్‌పివి. చెన్నైకి సమీపంలో ఓరగడం వద్ద ఉన్న రెనో-నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలో లాజీ ఎమ్‌పివిని తయారు చేయనున్నారు.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్‌తో డిజైన్ చేసిన ఈ గ్లోబల్ మోడల్ ఎమ్‌పివి ప్రస్తుతం నిస్సాన్ విక్రయిస్తున్న ఇవాలియా కన్నా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉంటుంది.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో లాజీ ఎమ్‌పివిలో పాపులర్ 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 84 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, ఒకవేళ ఇందులో పెట్రోల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లయితే, కంపెనీ తమ డస్టర్‌లో ఉపయోగిస్తున్న 1.6 లీటర్, 84 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

దేశీయ విపణిలో దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, నిస్సాన్ ఇవాలియా, షెవర్లే ఎంజాయ్, మహీంద్రా జైలో వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌పై ఆటోగ్రాఫ్ చేస్తున్న బాలీవుడ్ నటి దీపికా పడుకొన్.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌పై ఆటోగ్రాఫ్ చేసి, ఫోటోకి ఫోజిస్తున్న బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌పై ఆటోగ్రాఫ్ చేస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌పై ఆటోగ్రాఫ్ చేసి, ఫోటోకి ఫోజిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ హిరానీ.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌పై ఆటోగ్రాఫ్ చేస్తున్న బాలీవుడ్ నటుడు రితేష్ దేష్‌ముఖ్.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌పై ఆటోగ్రాఫ్ చేసి, ఫోటోకి ఫోజిస్తున్న బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌పై ఆటోగ్రాఫ్ చేసి, ఫోటోకి ఫోజిస్తున్న బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో డస్టర్ ఆల్-వీల్ డ్రైవ్ మోడల్‌పై ఆటోగ్రాఫ్ చేసి, ఫోటోకి ఫోజిస్తున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్.

రెనో లాజీ ఎమ్‌పివి పబ్లిక్ షోకేస్

రెనో డస్టర్ ఎస్‌యూవీపై చిందులేస్తున్న బాలీవుడ్ నటి ఆలియా భట్.

Most Read Articles

English summary
All new Renault Lodgy revealed at Renault Star Guild Awards for the 1st time in India. Renault holds the distinction of being the inventor of the MPV, with the Renault Espace launched in Europe three decades ago, its expertise will be reflected in its new MPV offering for India through “The Renault Lodgy”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X