ఢిల్లీలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 విడుదల

Written By:

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా, గడచిన నవంబర్ నెలలో ముంబైలో విడుదల చేసిన తమ సరికొత్త 'ఘోస్ట్ సిరీస్ 2' (Ghost Series II) మోడల్‌ను తాజాగా ఢిల్లీ మార్కెట్లో కూడా విడుదల చేసింది. దేశీయ విపణిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 లగ్జరీ కారు ధరను రూ.4.50 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 కారును తొలిసారిగా 2014 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించారు. రోల్స్ రాయిస్ ఇండియాకు, భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్ ఘోస్ట్. అప్‌డేటెడ్ స్టయిలింగ్, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్ మరియు మోడ్రన్ టెక్నాలజీతో ఈ కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్2 మోడల్‌ను తయారు చేశారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 మోడల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

డిజైన్, ఫీచర్స్:

రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, బంపర్స్‌తో ఇది ముందు వైపు సరికొత్త లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడి పవర్డ్ హెడ్‌ల్యాంప్స్ మరియు హెడ్‌లైట్స్ చుట్టూ గుండ్రంగా ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు ఏమీ లేవు. రోల్స్ రాయిస్ కార్ల బానెట్‌పై ఉండే లెజండ్రీ 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ' బానెట్ మస్కట్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్. ఇది ఈ ఏడాది 103వ జన్మదినాన్ని జరుపుకోనుంది.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. అత్యంత విలాసవంతంగా మరియు ఆధునిక సాంకేతికతతో తయారు చేశారు. కస్టమర్ల ఎంపిక మేరకు అనేక కస్టమైజేషన్ ఆప్షన్లను రోల్స్ రాయిస్ అందుబాటులో ఉంచనుంది.

స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లు ఎలాంటి అనుభూతి పొందుతారో, ఘోస్ట్ సిరీస్ 2 లగ్జరీ కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా కూడా అదే రకమైన అనుభూతిని పొందుతారని రోల్స్ రాయిస్ పేర్కొంది.

ఇంజన్:

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 కారులో 6.0 లీటర్, ట్విన్ టర్బో, వి12, డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5250 ఆర్‌పిఎమ్ వద్ద 563 బిహెచ్‌పిల శక్తిని, 1500 ఆర్‌పిఎమ్ వద్ద 780 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా ఈ ఇంజన్‌ను సరికొత్త 8-స్పీడ్ జెడ్ఎఫ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేశారు.

పెర్ఫార్మెన్స్, టాప్ స్పీడ్:

ఇది కేవలం 5 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

కొలతలు:

* పొడవు - 5569 మి.మీ.
* వెడల్పు - 1948 మి.మీ.
* ఎత్తు - 1550 మి.మీ.
* వీల్‌బేస్ - 3465 మి.మీ.
* టర్నింగ్ రేడియస్ - 14 మీటర్లు
* బూస్ స్పేస్ - 490 లీటర్లు
* బరువు - 2520 కేజీలు

మైలేజ్:

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఇంధన వినియోగం సిటీ, హైవేలపై క్రింది విధంగా ఉంటుంది.
* సిటీ - ప్రతి 100 కిలోమీటర్లకు 21.4 లీటర్లు
* హైవే - ప్రతి 100 కిలోమీటర్లకు 9.8 లీటర్లు

కార్లను పోల్చు

రోల్స్ రాయిస్ ఘోస్ట్
రోల్స్ రాయిస్ ఘోస్ట్ వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
English summary
Following the successful launch of Ghost Series II in Mumbai last November, the super-luxury marque rolled into the Indian capital last evening and received a gala reception at The Grand New Delhi.
Please Wait while comments are loading...

Latest Photos