భారత మహారాజుల జ్ఞాపకార్థం 'రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్'

By Ravi

భారతదేశానికి, బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్‌కి అవినాభావ సంబంధం ఉంది. మన దేశంలో రాజరికపు పరిపాలన అమల్లో ఉన్నప్పుడు మనదేశపు రాజులు ఈ బ్రిటీష్ కార్లను ప్రత్యేకంగా తయారు చేయించుకునేవారు. 'గోల్డెన్ ఏజ్ ఆఫ్ ది రాజా'గా చెప్పుకునే ఐదు దశాబ్ధాల కాలంలో 840 విశిష్టమైన రోల్స్ రాయిస్ మోడళ్లను మన భారతీయ రాజులు కొనుగోలు చేశారు.

భారతదేశంతో తమకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని, బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ ఓ సరికొత్త మహారాజా ఎడిషన్ కారును తయారు చేసింది. 'రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే' పేరుతో కంపెనీ తయారు చేసిన ఈ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ కేవలం ఒకే ఒక్క యూనిట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మహారాజుల నుంచి స్ఫూర్తి పొంది ఈ కారును డిజైన్ చేశారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్

తర్వాతి స్లైడ్‌లలో రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే కారును ఏజిఎమ్‌సి రోల్స్ రాయిస్ షోరూమ్ వద్ద నవంబర్ 13న ఆవిష్కరించారు. దుబాయ్‌లోని 20 భారతీయ రోల్స్ రాయిస్ అభిమానులను సంప్రదించి ఈ మోడల్‌ను డిజైన్ చేశారు.

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే కారును తయారు చేయటానికి కంపెనీకి దాదాపు రెండేళ్ల సయమం పట్టింది. ఈ కారును దుబాయ్‌లోని కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచనున్నారు.

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే ఎక్స్టీరియర్‌ను కర్రారా వైట్ కలర్‌లో పెయింట్ చేశారు. దీనిపై బ్లూ కలర్ పీకాక్ (నెమలి) యాంబ్లం ఉంటుంది. నెమలి మన దేశపు జాతీయ పక్షి.

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్

నెమలి నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసిన బ్లూ కలర్ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్‌పై బ్లూ కలర్ లైన్స్, ఉడెన్ డ్యాష్‌బోర్డ్, ఉడ్‌ఫినిషింగ్‌పై ఎంబోస్ చేసిన నెమలి డిజైన్లను ఈ కారులో గమనించవచ్చు.

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్

ఈ స్పెషల్ కారును పూర్తిగా చేతుల్తోనే తయారు చేశారు. ఈ కారులోని ఇంటీరియర్ డిటేలింగ్‌ను చేతుల్తో రూపొందించడానికి సుమారు 9 నెలల సమయం పట్టిందని కంపెనీ తెలిపింది. క్రీమ్ లైట్ లెథర్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ థీమ్‌తో దీని ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు.

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే కారు ధరను కంపెనీ వెల్లడించలేదు. సాధారణంగా డ్రాప్‌హెడ్ కూపే ప్రారంభ ధర 4.90 లక్షల డాలర్ల గాను, లేటెస్ట్ రోల్స్ రాయిస్ బెస్పోక్ మోడల్ ధర 7.10 లక్షల డాలర్ల గాను ఉంది.

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్

రోల్స్ రాయిస్ మహారాజా ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే

Most Read Articles

English summary
British luxury carmaker Rolls-Royce has unveiled the one-of-a-kind Maharaja Phantom Drophead Coupe on November 13, at the AGMC Rolls Royce Showroom. This exclusive model is designed to pay tribute to the historic relationship between Rolls Royce and India Maharajas.
Story first published: Friday, November 14, 2014, 17:18 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X