రోల్స్ రాయిస్ వ్రైత్ విడుదల; ధర రూ.4.4 కోట్లు

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా, దేశీయ విపణిలో తమ లేటెస్ట్ హైపెర్ఫామెన్స్ కారు రోల్స్ రాయిస్ వ్రైత్ (Rolls Royce Wraith)ను విడుదల చేసింది. భారత మార్కెట్లో రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ సెడాన్ ధర రూ.4.4 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

రోల్స్ రాయిస్ ఈ ఏడాది మార్చ్ నెలలో జరిగిన 83వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో తొలిసారిగా వ్రైత్ సెడాన్‌ను ఆవిష్కరించింది. రోల్స్ రాయిస్ వ్రైత్‌లో 6.6 లీటర్, వి12, ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 624 హార్స్ పవర్‌ల శక్తిని, 800 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 8-స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ట్రాన్సిమిషన్ ఇంజన్ నుంచి విడలయ్యే శక్తిని వెనుక చక్రాలకు బదిలీ చేస్తుంది. ఇది కేవలం 4.2 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

రోల్స్ రాయిస్ నుండి అత్యంత పాపులర్ అయిన లగ్జరీ సెడాన్ 'ఘోస్ట్' ప్లాట్‌‌ఫామ్ ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ 'వ్రైత్'ను అభివృద్ధి చేసింది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

రోల్స్ రాయిస్ వ్రైత్ విడుదల

రోల్స్ రాయిస్ వ్రైత్‌లోని ఎయిర్ సస్పెన్షన్ ఎలాంటి రోడ్లపై అయినా సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని కల్పిస్తుంది. రోల్స్ రాయిస్ దీనిని మ్యాజిక్ కార్పెట్ రైడ్ అని అభివర్ణిస్తుంది.

రోల్స్ రాయిస్ వ్రైత్ విడుదల

శాటిలైట్ ఎయిడెడ్ ట్రాన్సిమిషన్ అనే ఓ కీలక అధునాతన టెక్నాలజీ ఫీచర్‌ను ఈ కారులో జోడించారు. ఈ సిస్టమ్ డ్రైవింగ్ స్టయిల్‌ను అంచనా వేయటం ద్వారా జిపిఎస్ మ్యాపింగ్ సాయంతో పనిచేస్తుంది. ఫలితంగా నడిపే తీరును, రోడ్డును బట్టి, ఇందులో గేర్ ఆటోమేటిక్ ఛేంజ్ అవుతుంటుంది.

రోల్స్ రాయిస్ వ్రైత్ విడుదల

ఇందులో చెప్పుకోదగిన మరొక ఫీచర్ రూఫ్. కారు లోపలి భాగంలో 1,340 చిన్న చిన్న ల్యాంప్‌లను ఫ్యాబ్రిక్‌లో చేతితో అల్లారు. ఈ లైట్లను ఆన్ చేసినప్పుడు నక్షత్రాల అనుభూతి కలుగుతుంది.

రోల్స్ రాయిస్ వ్రైత్ విడుదల

భారత మార్కెట్లో రోల్స్ రాయిస్ వ్రైత్ లగ్జరీ సెడాన్ ధర రూ.4.4 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
The Wraith is the newest member from the Rolls Royce royalty to be launched in India. The Wraith, the sporties of the lot, is still a heavy beast. But a massive turbo charged engine and stiff suspension give it an impressive performance for a car that tips the scale at 2360 kg.
Story first published: Monday, August 19, 2013, 17:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X