మారుతి జిప్సీలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్: కొత్త డీజిల్, పెట్రోల్ ఇంజన్స్!

By Ravi

మార్కెట్లో కొత్తగా ఎన్ని కార్లు వచ్చినప్పటికీ, కొన్ని పాత కార్లకు ఉండే క్రేజ్ మాత్రం అలానే ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి ఈ మారుతి సుజుకి జిప్సీ. భారతదేశపు పురాతన, మొదటి అత్యంత ప్రాచుర్యమైన ఎస్‌యూవీ ఇది. ఇప్పటికీ ఈ ఎస్‌యూవీ చాలా మందికి క్రేజ్.

వాస్తవానికి, ప్రస్తుతం మార్కెట్లో అనేక పాపులర్, పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ర్యాలీ డ్రైవర్లు తమ రేస్‌లు, అడ్వెంచరెస్ ప్రయాణాల కోసం మారుతి సుజుకి జిప్సీనే ఎంచుకుంటున్నారంటే ఈ మోడల్ ప్రత్యేకత ఏంటో ఇట్టే అర్థమవుతుంది.

ఇది కూడా చదవండి: మారుతి జిప్సీకి స్వస్తి పలకనున్న భారత సైన్యం

మారుతి సుజుకి జిప్సీ

మారుతి సుజుకి జిప్సీని కొనుగోలు చేసేవాళ్లలో ఎక్కువగా ఆఫ్-రోడ్ డ్రైవర్లు, ఆర్మీ బలగాలు మాత్రమే ఉన్నారు. ఆన్-రోడ్ ఉపయోగం కోసం ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేసే రెగ్యులర్ కస్టమర్లు నామమాత్రమే. ఇందుకు ప్రధాన కారణం ఇందులో డీజిల్ వెర్షన్ అందుబాటులో లేకపోవటం, అలాగే దీని డిజైన్ పాతదిగా అనిపించడం.

మారుతి సుజుకి జిప్సీ

ఈ నేపథ్యంలో, మారుతి జిప్సీ ఎస్‌యూవీ మోడ్రన్ లుక్ కల్పించేందుకు కంపెనీ నడుం బిగించింది. అంతేకాకుండా, ఈ మోడల్ అమ్మకాలను పెంచుకునేందుకు ఇంజన్ ఆప్షన్స్ కూడా పెంచనుంది. అలాగే ఇందులో ఓ డీజిల్ వెర్షన్ కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

మారుతి సుజుకి జిప్సీ

ఆరంభంలో మారుతి జిప్సీలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే వారు. ఆ తర్వాత దానిని 1.3 లీటర్ జి13 పెట్రోల్ ఇంజన్‌తో రీప్లేస్ చేశారు. జిప్సీ ఇప్పటికీ ఇదే ఇంజన్‌తో లభిస్తుంది. అంతేకాదు, ఈ ఇంజన్‌ను కేవలం మారుతి జిప్సీలో మాత్రమే ఉపయోగిస్తున్నారు.

మారుతి సుజుకి జిప్సీ

ప్రస్తుతం మారుతి ఈకోలో ఉపయోగిస్తున్న జి12బి ఇంజన్‌ను కొత్త జిప్సీలో ఉపయోగించేందుకు మారుతి సన్నాహాలు చేస్తుంది. ఈ ఇంజన్ మరింత సమర్థంగా ఉండటమే కాకుండా మెరుగైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తుంది.

మారుతి సుజుకి జిప్సీ

డీజిల్ వెర్షన్ జిప్సీ విషయానికి వస్తే, ఇందులో 1.3 లీటర్ మల్టీ జెట్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రీమియర్ రియోలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు (ఇది రియల్ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది). మారుతి తమ జిప్సీలో ఈ ఇంజన్‌ను ఉపయోగించినట్లయితే, ఇందులో కూడా రియల్ వీల్ డ్రైవ్ కలిగిన వేరియంట్‌ను మనం ఆశించవచ్చు. అదేగనుక జరిగితే, జిప్సీ ఈ సెగ్మెంట్లోని మహీంద్రా థార్, ఫోర్స్ మోటార్స్ గుర్ఖా మోడళ్లకు పోటీగా నిలువనుంది.


ఆధునిక టెక్నాలజీ, లేటెస్ట్ డిజైన్, స్మార్ట్ ఫీచర్స్ వంటి లేమి కారణంగా మారుతి సుజుకి జిప్సీ ఎస్‌యూవీకి పాపులారిటీ తగ్గిన మాట వాస్తమే. దీంతో ఈ మోడల్ ఇక కనుమరుగైపోతుందని, కంపెనీ దీనిని పూర్తిగా మార్కెట్ నుంచి తొలగించివేస్తుందని అనుకున్నారు.

కానీ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, మారుతి సుజుకి తమ పాపులర్ జిప్సీకి పునజ్జీవం కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంది. సరికొత్త డిజైన్, ఇంజన్స్‌తో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

Most Read Articles

English summary
If the rumors to be believed about Gypsy, Maruti Suzuki might introduce a new facelift Gypsy with minor updates in terms of looks and new engine options. Company is planing to replace the current G13 engine with G12B engine and also plans to introduce diesel engine in new Gypsy.
Story first published: Wednesday, November 13, 2013, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X