హ్యుందాయ్ ఎక్సెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా షారుఖ్ ఖాన్

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కోసం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. షారుఖ్ ఖాన్ గడచిన 16 ఏళ్లుగా వివిధ హ్యుందాయ్ మోడళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ మేరకు హ్యుందాయ్ ఎక్సెంట్ కారుతో షారుఖ్ ఖాన్‌పై చిత్రీకరించిన ఓ టెలివిజన్ కమర్షియల్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. త్వరలోనే ఈ ప్రకటన వివిధ టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. గడచిన 16 ఏళ్లుగా హ్యుందాయ్‌తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని, భారత్‌లోని అత్యంత విశ్వసనీయమైన, ప్రియమైన కార్ బ్రాండ్‌తో అసోసియేట్ కావటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.


ఇక హ్యుందాయ్ ఎక్సెంట్ విషయానికి వస్తే.. గడచిన సంవత్సరంలో హ్యుందాయ్ విడుదల చేసిన గ్రాండ్ 10 హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌పై ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ను తయారు చేశారు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ ఇంజన్‌ను మరియు డీజిల్ వెర్షన్‌లో 1.1 లీటర్ ఇంజను ఉపయోగించారు. (గ్రాండ్ ఐ10లోను ఇవే ఇంజన్లను ఉపయోగించారు).

స్టైల్, స్పేస్, ఎకానమీ మరియు టెక్నలాజికల్ ఫీచర్లకు విలువిచ్చే కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఎక్సెంట్‌ను అభివృద్ధి చేశామని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ కపెనీ నామ్‌యాంగ్ ఆర్ అండ్ డి ఇంజనీర్లు సంయుక్తంగా ఈ కారును కాన్సెప్ట్ స్టేజ్ నుంచి అభివృద్ధి స్టేజ్ వరకు కలిసి పనిచేశారు.

Shah Rukh Khan Is The Brand Ambassador For Hyundai Xcent

పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఎక్సెంట్‌లో ఆల్-అల్యూమినియం 1.2 లీటర్ కప్పా డ్యూయెల్ విటివిటి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 83 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 11.6 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ ఎక్సెంట్‌లో 1.1 లీటర్ అడ్వాన్స్డ్ యూ2 సిఆర్‌డిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 72 పిఎస్‌ల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

పెట్రోల్ వెర్షన్ లీటరుకు 19.1 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ లీటరుకు 24.4 కిలోమీటర్ల మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Hyundai Motor India Limited (HMIL), the country’s largest exporter and the second-largest car manufacturer, today announced Bollywood legend and superstar Shah Rukh Khan as the brand ambassador for Xcent- the real family sedan. 
Story first published: Wednesday, September 17, 2014, 16:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X