స్కొడా ర్యాపిడ్ జనవరి 2015 ఆఫర్

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ర్యాపిడ్ అమ్మకాలను పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. తాజాగా.. జనవరి ఆఫర్‌లో భాగంగా స్కొడా ర్యాపిడ్‌పై కంపెనీ ప్రత్యేకమైన ఫైనాన్స్ స్కీమ్‌ను ప్రకటించింది. కేవలం 7.99 శాతం వడ్డీ రేటుకే (ఫోక్స్‌వ్యాగన్ ఫైనాన్స్ డివిజన్ ద్వారా) కంపెనీ రుణాన్ని ఆఫర్ చేస్తోంది.

అంతేకాకుండా.. ఈ జనవరి నెలలో స్కొడా ర్యాపిడ్ కారును కొనుగోలు చేసే కస్టమర్లు మొదటి సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్‌ను, 2+2 ఇయర్స్ ఎక్స్‌టెండెడ్ వారంటీని పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమేనని కంపెనీ ప్రకటించింది. ఈ ఫైనాన్స్ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత స్కొడా డీలరును సంప్రదించండి.

Skoda Rapid January 2015 Offer

గడచిన సెప్టెంబర్ నెలలో స్కొడా తమ అప్‌గ్రేడెడ్ ర్యాపిడ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త స్కొడా ర్యాపిడ్ ఆప్షనల్ బ్లాక్ ప్యాకేజ్‌తో లభిస్తుంది. ఈ ప్యాకేజ్‌లో భాగంగా.. బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ఫాగ్ ల్యాంప్స్, బ్లాక్ గ్రిల్ అండ్ లోగో, బ్లాక్ వింగ్ మిర్రర్స్, బ్లాక్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, బ్లాక్ గ్లాసీ రూఫ్ మరియు బ్లాక్ సైడ్ ఫోయిల్స్‌లు యాక్ససరీలుగా లభిస్తాయి.

డీజిల్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్‌లోని ఈ 1.5 లీటర్ టిడిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 103 హార్స్‌పవర్‌ల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యువల్ వెర్షన్ మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 21.14 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

Skoda Rapid

పెట్రోల్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్‌లో 1.6 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5250 ఆర్‌పిఎమ్ వద్ద 105 పిఎస్‌ల శక్తిని, 3800 ఆర్‌పిఎమ్ వద్ద 153 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్ లీటరుకు 14.3 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

కొత్త స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో కొత్తగా ఆఫర్ చేస్తున్న ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. స్కొడా ర్యాపిడ్ ఈ సెగ్మెంట్లోని హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ వంటి మిడ్-సైజ్ సెడాన్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Skoda is offering attractive finance scheme for its Rapid sedan. Now customers can avail loan from Volkswagen Finance India Pvt Ltd at just 7.99 percent interest rate. Company is also offering 1st year free insurance and 2+2 years extended warranty.
Story first published: Friday, January 23, 2015, 10:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X