స్కొడా సూపర్బ్ 2015 ఆవిష్కరణ: ఫొటోలు, వివరాలు

By Ravi

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా అందిస్తున్న సూపర్బ్ సెడాన్‌‌లో ఓ నెక్స్ట్ జనరేషన్ వెర్షన్‌‌ను ఫిబ్రవరి 17న ఆవిష్కరించనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా.. ఇప్పుడు స్కొడా తమ సరికొత్త సూపర్బ్ లగ్జరీ సెడాన్‌ను చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో ఆవిష్కరించింది. ఈ మోడల్ ఇండియాకు కూడా వచ్చే ఆస్కారం ఉంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ సెడాన్లను తలపించేలా అత్యంత సుందరంగా ఈ కారును డిజైన్ చేశారు. స్కొడా పేరెంట్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పస్సాట్ లగ్జరీ సెడాన్‌ను తయారు చేసిన బి8 ప్లాట్‌ఫామ్‌పైనే ఈ నెక్స్ట్ జనరేషన్ స్కొడా సూపర్బ్ సెడాన్‌ను కూడా తయారు చేశారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

స్కొడా సూపర్బ్ 2015 ఆవిష్కరణ

స్కొడా ఆవిష్కరించిన ఈ కొత్త తరం సూపర్బ్ సెడాన్‌ను మార్చ్ నెలలో జరగనున్న 2015 జెనీవా మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు.

స్కొడా సూపర్బ్ 2015 ఆవిష్కరణ

ఈ నెక్స్ట్ జనరేషన్ స్కొడా సూపర్బ్ సెడాన్‌లో డిజైన్ పరంగా అనేక మార్పులు ఉన్నాయి. దీని ఎక్స్టీరియర్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు.

స్కొడా సూపర్బ్ 2015 ఆవిష్కరణ

ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ మార్కెట్లో గట్టి పట్టు సాధించేందుకు స్కొడా తమ సరికొత్త సూపర్బ్‌ను మరింత విశాలంగా, విలాసవంతంగా తీర్చిదిద్దారు.

స్కొడా సూపర్బ్ 2015 ఆవిష్కరణ

గతంలో స్కొడా ఆవిష్కరించిన విజన్ సి కాన్సెప్ట్ నుంచి స్ఫూర్తి పొంది ఈ నెక్స్ట్ జనరేషన్ స్కొడా సూపర్బ్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది.

స్కొడా సూపర్బ్ 2015 ఆవిష్కరణ

ఇదివరకటి తరం సూపర్బ్‌తో పోల్చుకుంటే ఈ కొత్త స్కొడా సూపర్బ్ 20 మి.మీ. ఎక్కువ పొడవును, 50 మి.మీ ఎక్కువ వెడల్పును కలిగి ఉండి, 75 కేజీల తక్కువ బరువును కలిగి ఉండనుంది.

స్కొడా సూపర్బ్ 2015 ఆవిష్కరణ

గ్లోబల్ మార్కెట్లలో స్కొడా సూపర్బ్ కారును 5 పెట్రోల్, 3 డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఈ ఇంజన్లు 123 హెచ్‌పిల పవర్ నుంచి 276 హెచ్‌పిల పవర్ రేంజ్‌లలో లభ్యం కానున్నాయి.

స్కొడా సూపర్బ్ 2015 ఆవిష్కరణ

గేర్‌బాక్స్ విషయానికి వస్తే.. ప్రస్తుత వెర్షన్‌లో ఉపయోగిస్తున్న డిఎస్‌జి గేర్‌బాక్స్‌లనే కొత్త మోడల్‌లోను ఉపయోగించనున్నట్లు సమాచారం.

స్కొడా సూపర్బ్ 2015 ఆవిష్కరణ

కొత్త 2015 స్కొడా సూపర్బ్ కారులో రియర్ ప్యాసింజర్ల కోసం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే కంపాటబిలిటీ, 625 లీటర్ల బూట్ స్పేస్, రీస్టయిల్డ్ డ్రో ట్రిమ్మింగ్, లెథర్ సీట్లు, అప్‌డేటెడ్ స్టీరింగ్ వీల్, అప్‌డేటెడ్ సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లు/మార్పులు ఉన్నాయి.

Most Read Articles

English summary
Czech automobile manufacturer has unveiled its redesigned Superb in Prague. The luxury sedan now looks more bolder and sharper than its predecessors. This is the third generation model and is most likely to come to India as well.
Story first published: Wednesday, February 18, 2015, 12:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X