స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ విడుదల; ప్రారంభ ధర రూ.18.63 లక్షలు

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'యెటి' (Yeti) ప్రీమియం ఎస్‌యూవీలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను నేడు (సెప్టెంబర్ 10, 2014) మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో కొత్త 2014 స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ రెండు వేరియంట్లలో (ఒకటి టూ-వీల్ డ్రైవ్‌తో, మరొకటి ఫోర్-వీల్ డ్రైవ్‌తో) లభిస్తుంది. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

* 2014 స్కొడా యెటి 4x2 - రూ.18.99 లక్షలు
* 2014 స్కొడా యెటి 4x4 - రూ.20.53 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొన్ని అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇది కేవలం టాప్-ఎండ్ వేరియంట్ (ఎలిగాంట్)లో మాత్రమే లభిస్తుంది. మధ్య తరగతికి ఎగువన ఉన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఈ ప్రీమియం ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ విడుదల

స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్స్, డిజైన్ మార్పులు, ధరలు తదితర వివరాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఫేస్‌లిఫ్ట్ యెటి స్టయిలింగ్, స్కొడా యొక్క కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను తలపిస్తుంది. ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, బై-జెనాన్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, సైడ్ మిర్రర్స్, అల్లాయ్ వీల్స్‌ను రీడిజైన్ చేశారు. రూఫ్ కోసం కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టారు.

స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఇంటీరియర్స్‌ను గమనిస్తే, కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, క్లైమేట్ కంట్రోల్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ సీట్స్ అండ్ స్టీరింగ్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ మొదలైన ఫీచర్లున్నాయి.

స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ విడుదల

సేఫ్టీ విషయానికి వస్తే.. కొత్త 2014 స్కొడా యెటిలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటర్, ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్-హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి.

స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ విడుదల

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, 4x2 మరియు 4x4 రెండు వేరియంట్లలోను ఒకేరకమైన డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. కానీ వీటి పవర్‌ను మాత్రం వేరియంట్‌ను బట్టి ట్యూన్ చేశారు.

స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ విడుదల

స్కొడా యెటి 4x2 వేరియంట్‌లోని 2.0 లీటర్ టిడిఐ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్‌తో లభిస్తుంది. స్కొడా యెటి 4x4 వేరియంట్‌లోని 2.0 లీటర్ టిడిఐ ఇంజన్ గరిష్టంగా 138 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌‌బాక్స్‌తో లభిస్తుంది.

Most Read Articles

English summary
The Czech Republican based car manufacturer Skoda has launched its new 2014 Yeti facelift in India at a starting price of Rs. 18.99 lakh (ex-showroom, Delhi). New Skoda Yeti gets few cosmetic updates and additional features.
Story first published: Wednesday, September 10, 2014, 14:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X