కొరియాలో శాంగ్‌యాంగ్ కొరాండో సి ఫేస్‌లిఫ్ట్ విడుదల

By Ravi

'శాంగ్‌యాంగ్' పేరు గుర్తుందా..? భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్, తాజాగా కొరియాలో ఓ కొత్త మోడల్‌ను విడుదల చేసింది. 2011లో కంపెనీ ఆవిష్కరించిన ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ కొరాండోలో ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను అక్కడి మార్కెట్లో విడుదల చేసింది.

శాంగ్‌యాంగ్ కొరాండో సి (Ssangyong Korando C) పేరుతో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. (మహీంద్రా-శాంగ్‌యాంగ్ నుంచి భారత్‌కు రావాల్సి ఉన్న ఉత్పత్తులలో కొరాండో కూడా ఒకటి, ప్రస్తుతం భారత్‌లో రెక్స్టన్ లగ్జరీ ఎస్‌యూవీ మాత్రమే మార్కెట్లో లభ్యమవుతుంది). మారుతి ఎర్టిగాను ఎల్‌యూవీ (లైఫ్ యుటిలిటీ వెహికల్)గా పిలిచినట్లుగా, శాంగ్‌యాంగ్ కొరండా సి కారును యూఎల్‌వీ (అర్బన్ లీజర్ వెహికల్)గా పిలుస్తున్నారు.

ప్రత్యేకించి అర్బన్ ఏరియాలను దృష్టిలో ఉంచుకొని కొరాండో సిను రూపొందించిన నేపథ్యంలో ఇలా పిలుస్తున్నారు. మరి ఈ శాంగ్‌యాంగ్ కొరాండా యూఎల్‌వీకి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

ఎక్స్టీరియర్

ఎక్స్టీరియర్

సరికొత్త శాంగ్‌యాంగ్ కొరాండా సి యూఎల్‌వీలో ఫ్రంట్ డిజైన్‌ను మునపటి వెర్షన్ కన్నా మరింత స్టయిలిష్‌గా డిజైన్ చేశారు. ఫ్రంట్ గ్రిల్, ఎయిర్‌డ్యామ్, ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్ డిజైన్లను మార్పు చేశారు.

మరిన్ని ఫీచర్లు

మరిన్ని ఫీచర్లు

ఇందులో బ్లాక్ బెజెల్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఎల్ఈడి పొజిషన్ లైట్లు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. వెనుక వైపు C-షేపులో ఉండే గైడ్ లైట్స్ మరొక ప్రత్యేకత. కొరాండో సిలో కొత్తగా 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను జోడించారు.

ఇంటీరియర్

ఇంటీరియర్

నాణ్యమైన మెటీరియల్స్‌తో ఇంప్రూవ్ చేసిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, టూ-లెవల్ ఫ్యాన్‌తో కూడిన ఫోర్స్డ్ వెంటిలేషన్ వంటి ఇంటీరియర్ ఫీచర్లను కొరాండో సిలో గమనించవచ్చు. ఇంకా ఇందులో టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్), 7-ఇంచన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3డి మ్యాప్స్, హార్మన్/కార్డన్ సౌండ్ సిస్టమ్, స్మార్ట్ కీ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి.

మెరుగైన మైలేజ్

మెరుగైన మైలేజ్

కొత్త శాంగ్‌యాంగ్ కొరాండో సి యూఎల్‌వీలో ఉపయోగించిన అప్‌గ్రేడెడ్ ఇంజన్ 8.4 సాతం అధిక మైలజీని (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఈకో మోడ్‌లో) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Ssangyong Korando C, the compact premium SUV, introduced in South Korea in 2011, has received its first facelift. The new Korando C, dubbed an Urban Leisure Vehicle (ULV), is an SUV which has been designed mainly for use in urban areas.
Story first published: Thursday, August 8, 2013, 12:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X