ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్, సగం భారత్‌లోనే

By Ravi

దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా, అంతర్జాతీయ మార్కెట్లలో సుజుకి మోటార్ కార్పేషన్‌లు విక్రయిస్తున్న పాపులర్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. ఇందులో సగం (అంటే 20 లక్షల) స్విఫ్ట్ కార్లు భారతదేశంలోనే అమ్ముడుపోవటం విశేషం.

కంపెనీ వెబ్‍‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, స్విఫ్ట్ కారును వరల్డ్ స్ట్రాటజిక్ మోడల్‌గా 2004లో విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ప్రపంచ వ్యాప్తంగా 4 మిలియన్ల మైలురాయిని చేరుకుంది. ఈ మోడల్ మార్కెట్లోకి విడుదలై కేవలం 9 ఏళ్ల 9 నెలల సమయంలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఈ మైలురాయిని చేరుకోగలిగిందని కంపెనీ పేర్కొంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్

స్విఫ్ట్‌కు సంబంధించిన మరిత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్

స్విఫ్ట్ హ్యాచ్‌హబ్యాక్‌ను తొలిసారిగా నవంబర్ 2004లో జపాన్‌లో ఉత్పత్తి చేశారు. ఆ తర్వాతి సంవత్సరంలో (2005లో) దీనిని హంగేరీ, ఇండియా మరియు చైనా మార్కెట్లలో ఉత్పత్తి చేసి, విక్రయించడం ప్రారంభించారు.

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్

మారుతి సుజుకి తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను 2005లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికీ ఈ కారును మారుతి సుజుకి నుంచి అమ్ముడుపోతున్న టాప్ 5 మోడళ్లలో ఒకటిగా ఉంటోంది. ఈ మోడల్‌కు భారత విపణిలో మంచి డిమాండ్ ఉంది. ప్రత్యేకించి ఇది పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభ్యమవుతుండటంతో కొనుగోలుదారులు స్విఫ్ట్ కోసం క్యూ కడుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్

ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు రూ.4.42 లక్షల నుంచి రూ.6.70 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్

స్విఫ్ట్‌లో పూర్తి స్థాయి మోడల్ మార్పును 2010లో చేశారు. అయితే, ఈ మోడల్ ఉత్పత్తి, విక్రయాలు మాత్రం మార్చ్ 2012లో థాయ్‌లాండ్‌లో ప్రారంభమయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్

సుజుకి స్విఫ్ట్ మొత్తం ప్రపంచ విక్రయాలలో 19 శాతం యూరప్ మార్కెట్ నుంచి, 11 శాతం జపాన్ మార్కెట్ నుంచి వస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్

జూన్ 2008లో సుజుకి స్విఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల (1 మిలియన్) ఉత్పత్తి మార్కును తాకింది, ఆ తర్వాత 2011లో ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల (2 మిలియన్) అమ్మకాల మార్కును తాకింది.

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్

గడచిన సంవత్సరం (2013) జనవరిలో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల (3 మిలియన్) మార్కును తాకాయి.

ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మార్కును చేరుకున్న స్విఫ్ట్

ప్రస్తుతం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచ వ్యాప్తంగా 8 దేశాల్లో ఉత్పత్తి చేస్తుంటే, 140కి పైగా దేశాలు మరియు ప్రాంతాలలో దీనిని విక్రయిస్తున్నారు.

Most Read Articles

English summary
Japan's small car major Suzuki Motor Corporation has clocked four million milestone in total global sales of its successful premium hatchback Swift with about half of them coming from India.
Story first published: Wednesday, September 10, 2014, 10:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X