మార్చ్ 12న టాటా ఆరియా ఫేస్‌లిఫ్ట్, మూవస్ ఎమ్‌పివి లాంచ్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈ నెలలో రెండు కొత్త వాహనాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, మార్చ్ 12వ తేదీన టాటా మోటార్స్ ఓ సరికొత్త 2014 ఆరియా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మరియు మూవస్ ఎమ్‌పివిని (టాటా గ్రాండేకు కొత్త పేరే మూవస్) విడుదల చేయనుంది.

టాటా మోటార్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని తమ ఆరియా క్రాసోవర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఇది వినియోగదారులను ఆకట్టుకోవటంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ తమ ఆరియాకు మోడ్రన్ లుక్ ఇచ్చేందుకు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల చేయనుంది.

టాటా ఆరియా ఫేస్‌లిఫ్ట్, టాటా మూవస్ ఎమ్‌పివలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఆరియా ఫేస్‌లిఫ్ట్

ఆరియా ఫేస్‌లిఫ్ట్

కొత్త టాటా ఆరియాలో రీస్టయిల్డ్ హెడ్‌ల్యాంప్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ వంటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ముందువైపు కొత్త డిజైన్‌ను కలిగి ఉండనుంది.

కొత్త టాటా ఆరియా

కొత్త టాటా ఆరియా

ప్రత్యేకించి, 2014 టాటా ఆరియాలో అప్‌గ్రేడెడ్ వేరికార్ 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ ఇదివరకటి ఇంజన్ కన్నా గరిష్టంగా 10 హెచ్‌పిల అదనపు శక్తిని (మొత్తం 148 హెచ్‌పిల శక్తిని) ఉత్పత్తి చేస్తుంది. ఇది మెరుగైన మైలేజీని కూడా ఇస్తుంది.

మూవస్ ఎమ్‌పివి

మూవస్ ఎమ్‌పివి

ఇక మూవస్ ఎమ్‌పివి విషయానికి వస్తే, ఇది టాటా గ్రాండేకు అప్‌గ్రెడెడ్ వెర్షన్ మాత్రమే. కాకపోతే దాని పేరు మార్చి విక్రయించనున్నారు. ఇందులో రివైజ్డ్ స్టయిలింగ్, వేరియంట్‌ను బట్టి అధనపు ఫీచర్లు, టాప్ ఎండ్ వేరియంట్లో కెప్టెన్ సీట్లు వంటి పలు మార్పులతో ఇది రానుంది. డ్యాష్‌బోర్డులో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది.

మూవస్ ఎమ్‌పివి

మూవస్ ఎమ్‌పివి

ఇక టాటా మూవస్‌లోని ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో కూడా ఆరియాలో ఉపయోగించిన వేరికార్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. అయితే, దీని పెర్ఫార్మెన్స్‌ను డీట్యూన్ చేశారు. ఈ ఇంజన్ కేవలం 118 హెచ్‌పిల శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Tata Motors will reportedly launch the 2014 Aria facelift and the Movus MPV, which is nothing but the new name for the Grande. The facelifted version of the two vehicles are expected as early as March 12.
Story first published: Tuesday, March 4, 2014, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X