టాటా బోల్ట్ విడుదల; ధర కేవలం రూ.4.44 లక్షలు మాత్రమే

టాటా మోటార్స్ నుంచి కస్టమర్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సరికొత్త హ్యాచ్‌బ్యాక్ 'టాటా బోల్ట్' (Tata Bolt) నేడు (జనవరి 22, 2014) మార్కెట్లో విడుదలైంది. ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో, అత్యంత సరసమైన ధరకే (పెట్రోల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.4.44 లక్షలు, డీజిల్ వెర్షన్ ప్రారంభ ధర రూ.5.49 లక్షలు, ఎక్స్-షోరూమ్) టాటా మోటార్స్ తమ బోల్ట్ కారును ప్రవేశపెట్టింది.

టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం ఎనిమిది వేరియంట్లలో (నాలుగు పెట్రోల్, నాలుగు డీజిల్) లభ్యం కానుంది. ఈ సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌ను 35 ఏళ్ల లోపు వయస్సు కలిగిన యువతను లక్ష్యంగా చేసుకొని స్పోర్టీగా, స్టయిలిష్‌గా డిజైన్ చేశామని టాటా మోటార్స్ స్మాల్ కార్స్ ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ వాగ్ తెలిపారు (టాటా నానో కారును డిజైన్‌లో కీలక పాత్రధారి ఇతనే).

టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాటా బోల్ట్ కారును విడుదలకు ముందే 50 నగరాల్లో ప్రదర్శనకు ఉంచామని, దీనికి అనూహ్యమైన స్పందన లభించిందని టాటా మోటార్స్ (ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్) ప్రెసిడెంట్ మయాంక్ పారీక్ తెలిపారు. బోల్ట్ టెస్ట్ డ్రైవ్ కోసం ఇప్పటివరకూ 10,000 లకు పైగా అభ్యర్థనలు వచ్చాయని, 50,000 లకు పైగా ఎంక్వైరీలు వచ్చాయని ఆయన తెలిపారు.

టాటా బోల్ట్ కారుకి సంబంధించి ధరలు, వేరియంట్లు, ఇంజన్ ఆప్షన్స్ మరియు ఇతర వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.

జెస్ట్-బోల్ట్ ఒకే డిజైన్

జెస్ట్-బోల్ట్ ఒకే డిజైన్

ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా ఉంచేందుకు గాను టాటా జెస్ట్, మరియు టాటా బోల్ట్ మోడళ్లను రెండింటినీ ఒకే (ఎక్స్1) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. అందుకే ఈ రెండు మోడళ్ల ఫ్రంట్ డిజైన్ దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఇంజన్ పరంగా కూడా మార్పులు వీటిలో మార్పులు లేవు. టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఉపయోగించిన ఇంజన్లనే ఈ కొత్త టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోను ఉపయోగించారు.

టాటా బోల్ట్ పెట్రోల్ ఇంజన్ డిటేల్స్

టాటా బోల్ట్ పెట్రోల్ ఇంజన్ డిటేల్స్

పెట్రోల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో, టాటా మోటార్స్ అందిస్తున్న సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కానీ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ కానీ అందుబాటులో లేదు.

టాటా బోల్ట్ డీజిల్ ఇంజన్ డిటేల్స్

టాటా బోల్ట్ డీజిల్ ఇంజన్ డిటేల్స్

డీజిల్ వెర్షన్ టాటా బోల్ట్ కారులో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, టాటా జెస్ట్ మాదిరిగా డీజిల్ వెర్షన్ బోల్ట్ టాప్-ఎండ్ వేరియంట్‌లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) ఆప్షన్ అందుబాటులో లేదు.

మైలేజ్

మైలేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, టాటా బోల్ట్ మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి:

* పెట్రోల్ వెర్షన్ - 17.57 కెఎంపిఎల్

* డీజిల్ వెర్షన్ - 22.95 కెఎంపిఎల్

సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్లు

టాటా బోల్ట్ కారు డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, బాష్ నుంచి గ్రహించిన 9వ తరం ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), సిఎస్‌సి (కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్) వంటి సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుత మరియు భవిష్యత్ సేఫ్టీ నిబంధనలకు లోబడి ఈ కారును తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

కేవలం టాప్-ఎండ్ వేరియంట్ (ఎక్స్‌టి) టాటా బోల్ట్ కారులో మాత్రమే టచ్‌స్క్రీన్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. లోవర్ వేరియంట్లలో స్టాండర్డ్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అందిస్తున్నారు.

పెట్రోల్ వెర్షన్ ధరలు

పెట్రోల్ వెర్షన్ ధరలు

దేశీయ విపణిలో టాటా బోల్ట్ పెట్రోల్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

* ఎక్స్ఈ - రూ.4.44 లక్షలు

* ఎక్స్ఎమ్ - రూ.5.15 లక్షలు

* ఎక్స్ఎమ్ఎస్ - రూ.5.40 లక్షలు

* ఎక్స్‌‌టి - రూ.6.05 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వెర్షన్ ధరలు

డీజిల్ వెర్షన్ ధరలు

దేశీయ విపణిలో టాటా బోల్ట్ డీజిల్ వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

* ఎక్స్ఈ - రూ. 5.49 లక్షలు

* ఎక్స్ఎమ్ - రూ.6.11 లక్షలు

* ఎక్స్ఎమ్ఎస్ - రూ.6.34 లక్షలు

* ఎక్స్‌‌టి - రూ.6.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tata Motors India just launched its all new Tata Bolt hatchback. Check here the prices, variants, specifications, features and other details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X