2015 జెనీవా మోటార్ షో: టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీ

By Ravi

ఆటోమొబైల్ ప్రియులను అలరించేందుకు 2015 జెనీవా మోటార్ షో సిద్ధమైంది. ఈ అంతర్జాతీయ ఆటో షోలో టాటా మోటార్స్ కూడా ఓ సరికొత్త కాన్సెప్ట్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. కంపెనీ అందిస్తున్న టాటా ఆరియా క్రాసోవర్‌ను ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన 'టాటా హెక్సా' (Tata Hexa) అనే మోడల్‌ను ఆవిష్కరించింది.

టాటా హెక్సా కాన్సెప్ట్ వాహనానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీ

తర్వాతి స్లైడ్‌లలో టాటా హెక్సా కాన్సెప్ట్ కారుకు సంబంధించిన వివరాలను తెలుసుకోండి.

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీ

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ అందిస్తున్న ఆరియా క్రాసోవర్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు.

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీ

టాటా హెక్సా కాన్సెప్ట్ కారులో 2.2 లీటర్, ఫోర్-సిలిండర్, వారికార్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీ

ఈ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీ

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీని చూడగానే టాటా ఆరియా గుర్తుకు వస్తుంది. కాకపోతే మరింత అప్‌మార్కెట్ ఫీల్‌నిచ్చేందుకు గాను ఈ కాన్సెప్ట్ కారును మరింత ప్రీమియంగా డిజైన్ చేశారు.

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీ

ఈ కాన్సెప్ట్ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త హనీకోంబ్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్డ్ ఎయిర్‌డ్యామ్ వంటి డిజైన్ మార్పులు ఉన్నాయి.

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీ

టాటా హెక్సా కాన్సెప్ట్ 6-సీటర్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో లెథర్ సీట్లు ఉంటాయి. ఈ కారులో పెద్ద 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు.

టాటా హెక్సా కాన్సెప్ట్ ఎస్‌యూవీ

టాటా హెక్సా కాన్సెప్ట్‌లో ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

టాటా హెక్సా కాన్సెప్ట్ కార్ వీడియోని ఈ స్లైడ్‌లో వీక్షించండి.

Most Read Articles

English summary
The Geneva Motor Show is an ultimate platform for carmakers from around the world to showcase their latest production cars and concepts to the world. That was exactly what Tata Motors had in mind and nothing could stop the company from showcasing their latest SUV Concept, the Tata Hexa.
Story first published: Wednesday, March 4, 2015, 15:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X