గాలి వార్త కాదు.. గాలితో నడిచే టాటా ఎయిర్‌పాడ్!

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, కంప్రెస్డ్ ఎయిర్ (గాలి)తో నడిచే కార్లను తయారు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. మోటార్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్) నుండి టాటా మోటార్స్ లైసెన్స్ పొంది ఈ ఎయిర్-పవర్డ్ వాహనాలను అభివృద్ధి చేస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం, టాటా గాలి ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో రానున్నట్లు తెలుస్తోంది.

టాటా మోటార్స్ దాదాపు గత ఏడేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. కంపెనీ ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. ఇదొక దీర్ఘకాలిక ప్రాజెక్ట్ అని, అనేక సవాళ్లతో కూడుకున్నదని టాటా మోటార్స్ అడ్వాన్స్ అండ్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ తిమోతీ లెవెర్టన్ తెలిపారు. భవిష్యత్తు కోసం ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయటానికి మరిన్ని పెట్టుబడులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ గాలి కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి..!

గాలితో నడిచే టాటా ఎయిర్‌పాడ్!

గడచిన 2007వ సంవత్సరంలో మోటార్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్) మరియు టాటా మోటార్స్ కంపెనీలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా, ఎమ్‌డిఐ టెక్నాలజీని ఉపయోగించి కంప్రెస్డ్-ఎయిర్ ద్వారా నడిచే కార్లను అభివృద్ధి చేయనున్నారు.

గాలితో నడిచే టాటా ఎయిర్‌పాడ్!

టాటా మోటార్స్ ఇప్పటికే ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్-పవర్డ్ వాహనాలను పలు ఆటో షోలలో ప్రదర్శనకు ఉంచింది. కంప్రెస్డ్-ఎయిర్‌తో నడిచే రెండు వాహనాలను అభివృద్ధి చేశారు. వీటిలో ఒకటి చిన్న తరహా వాణిజ్య వాహనంగానూ, మరొకటి ప్యాసింజర్ కారు గానూ ఉండనున్నాయి.

గాలితో నడిచే టాటా ఎయిర్‌పాడ్!

కంప్రెస్డ్-ఎయిర్‌తో నడిచే వాహనాలు గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగంతో పరుగులు తీయగలవు. సిలిండర్లలో ఉండే ఎయిర్ (గాలి)తో సుమారు 300 కి.మీ రేంజ్ వరకూ ప్రయాణించవచ్చు.

గాలితో నడిచే టాటా ఎయిర్‌పాడ్!

ఈ ఎయిర్-పవర్డ్ కారులో ఓ ఎయిర్‌ ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. దీనిని నింపడానికి కేవలం రెండు డాలర్లు (సుమారు 120 రూపాయలు) మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంటిలో ఉండే ఎయిర్ కంప్రెసర్ ద్వారా ఈ ట్యాంక్‌ను ఫిల్ చేసుకోవడానికి 3-4 గంటల సమయం పడుతుంది.

గాలితో నడిచే టాటా ఎయిర్‌పాడ్!

తక్కువు బరువుండేలా ఈ కారును డిజైన్ చేయటం వలన ఎక్కువ దూరం ప్రయాణించేదుకు వీలవుతుంది. దీనిలో కంబస్టియన్ ఇంజన్ ఉండదు కాబట్టి, కేవలం 50,000 కి.మీ. ఒక్కసారి చొప్పున ఆయిల్ మార్పిడి చేస్తే సరిపోతుంది.

Most Read Articles

English summary
According to sources, Tata Motors might bring its air-powered Airpod car in 2015. In 2007 Tata Motors had signed an agreement with Luxembourg-based Motor Development International (MDI) to produce and sell cars running on compressed air.
Story first published: Friday, February 6, 2015, 10:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X