టాటా ఆరియా ఫేస్‌లిఫ్ట్ విడుదల; ధర రూ.9.95 లక్షలు

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న టాటా ఆరియా ఎట్టకేలకు అప్‌గ్రేడ్ అయింది. టాటా ఆరియా భారత మార్కెట్లో విడుదైలన తర్వాత మొట్టమొదటి సారిగా కంపెనీ ఇందులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో ప్రీమియం విభాగంలో గడచిన 2010 సంవత్సరంలో టాటా మోటార్స్ విడుదల చేసిన ఆరియా కొనుగోలుదారులను ఆకర్షించడంలో విఫలమైంది.

ఈ నేపథ్యంలో, టాటా ఆరియాకు రిఫ్రెష్డ్ లుక్‌ని కల్పించేందుకు కంపెనీ ప్రయత్నించింది. దాని ఫలితమే ఈ కొత్త 2014 టాటా ఆరియా. ఈ సరికొత్త 2014 టాటా ఆరియాలో కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ ఇప్పుడు కొత్త 2014 టాటా ఆరియా బేస్ వేరియంట్లో సైతం ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను ఆఫర్ చేస్తుండటం విశేషం.

కొత్త 2014 టాటా ఆరియా ధరలు, ఫీచర్లు మరియు ఇతర వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఎక్స్టీరియర్ అప్‌గ్రేడ్స్

ఎక్స్టీరియర్ అప్‌గ్రేడ్స్

కొత్త 2014 టాటా ఆరియాలో ఎక్స్టీరియర్స్ పరంగా స్వల్ప మార్పులు మాత్రమే ఉన్నాయి. కొత్త బాడీ డెకాల్స్, డబుల్ బ్యారెల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ (బ్లాక్ వెజెల్‌తో), క్లియర్ లెన్స్ టెయిల్ ల్యాంప్స్, 16-ఇంచ్ స్టీల్ వీల్స్ (స్టాండర్డ్) మరియు 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ (ఆప్షనల్) వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్

ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్

కొత్త ఆరియాలో ఎక్కువగా ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో నావిగేషన్ సిస్టమ్, హార్మన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ (4 మిడ్-రేంజ్ స్పీకర్స్, 4 ట్వీటర్స్, ఒక సెంట్రల్ స్పీకర్, ఒక సబ్ వూఫర్ (టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే)), బీజ్ ఫ్యాబ్రిక్ కవర్లతో కూడిన లెథర్ సీట్స్, లెథర్‌‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, చిల్డ్ గ్లౌవ్ బాక్స్, కప్ హోల్డర్స్ వంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

ఇంజన్

ఇంజన్

టాటా ఆరియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొత్తగా మెరుగు పరచిన 2.2 లీటర్ వెరికార్ డీజిల్ ఇండన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 150 హెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను మరింత రీఫైన్ చేశామని, ఇది మెరుగైన మైలేజీనిస్తుందని (15.05 కెఎమ్‌పిఎల్) టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

బేస్ వేరియంట్ ఫీచర్లు

బేస్ వేరియంట్ ఫీచర్లు

కొత్త టాటా ఆరియా ఇప్పుడు మూడు వేరియంట్లలో (ప్యూర్ 4X2, ప్లెజర్ 4X2 మరియు ప్రైడ్ 4X4) లభ్యం కానుంది. బేస్ వేరియంట్లో (ప్యూర్ 4X2లో) ఇదివరకు చెప్పుకున్నట్లుగా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, రియర్ ఎయిర్ కండిషన్ వెంట్స్, సన్‌గ్లాస్ హోల్డర్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, ఫాలో-మి-హోమ్ ల్యాంప్స్, డిస్క్ బ్రేక్స్‌ను అందిస్తున్నారు.

మిడ్ వేరియంట్ ఫీచర్లు

మిడ్ వేరియంట్ ఫీచర్లు

ఇకపోతే మిడ్ లెవల్ వేరియంట్ అయిన ప్లెజర్ 4X2లో పై ఫీచర్లకు అదనంగా డబుల్ డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, రూఫ్ స్టోరేజ్ బిన్స్, చిల్డ్ గ్లవ్ బాక్స్ వంటి కంఫర్ట్ ఫీచర్లతో పాటుగా రియర్ వైపర్ అండ్ డిఫాగ్గర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ఇంకా ఇందులో క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఫుల్ క్రోమ్ గ్రిల్, హాడీ కలర్డ్ రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లున్నాయి.

టాప్ వేరియంట్ ఫీచర్లు

టాప్ వేరియంట్ ఫీచర్లు

టాప్ ఎండ్ వేరియంట్ అయిన ప్రైడ్ 4X4లో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, లెథర్ సీట్స్, శాటిలైట్ నావిగేషన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బ్లాక్ సరౌండ్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్‌పి, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.

వారంటీ

వారంటీ

కొత్త టాటా ఆరియా 2014 మోడల్‌పై 3 ఏళ్లు లేదా లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని మరియు వెరికార్ ఇంజన్‌పై 3 ఏళ్లు లేదా లక్షా యాభై వేల కిలోమీటర్ల వరకు వారంటీ (రెండు సందర్భాల్లోను ఏది ముందుగా ముగిస్తే అది)ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా ఆరియా 2014 వేరియంట్లు, ధరలు

టాటా ఆరియా 2014 వేరియంట్లు, ధరలు

* ప్యూర్ ఎల్ఎక్స్ - రూ.9.95 లక్షలు

* ప్లెజర్ - రూ.12.00 లక్షలు

* ప్రైడ్ 4X4 - రూ.14.74 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Tata Motors has launched the updated 2014 Aria MPV at a starting price of INR 9.95 lakhs (ex-showroom, Delhi). The facelifted Tata Aria does not differ much from last year's model as the exterior changes are minor.
Story first published: Friday, April 11, 2014, 20:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X