టాటా మోటార్స్ అన్ని మోడళ్లలోను ఏఎమ్‌టి గేర్‌బాక్స్

By Ravi

ఆటోమొబైల్ రంగంలో గేర్‌‌బాక్స్ విషయంలో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి). ఏఎమ్‌టి గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక క్లచ్ రహిత మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్. ఇప్పటికే ఈ టెక్నాలజీని మారుతి సుజుకి ఇండియా తమ 'సెలెరియో' హ్యాచ్‌బ్యాక్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.

మార్కెట్లో ఏఎమ్‌టి మంచి సక్సెస్‌ను సాధించిన నేపథ్యంలో, సమీప భవిష్యత్తులో టాటా మోటార్స్ నుంచి రానున్న అన్ని ప్యాసింజర్ వాహనాలు కూడా ఇదే ఏఎమ్‌టి టెక్నాలజీతో రూపుదిద్దుకోనున్నాయి. టాటా మోటార్స్ ఇప్పటికే ఈ తరహా ఏఎమ్‌టి గేర్‌‌బాక్స్ టెక్నాలజీని తమ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్, బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు టాటా నానో ఎఫ్-ట్రానిక్ వేరియంట్లలో పరిచయటం, వాటిని ఇటీవలే ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శన చేయటం తెలిసినదే.

టాటా మోటార్స్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (అడ్వాన్స్డ్ అండ్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్) టిమ్ లెవెర్టన్ ఓ ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మరికొద్ది కాలంలో తమ అన్ని ఉత్పత్తులలో ఏఎమ్‌టిని వినియోగిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌

టాటా మోటార్స్ ప్రస్తుతం అందిస్తున్న మాంజా సెడాన్‌కు సక్సెసర్‌గా అభివృద్ధి చేసిన జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌ను అమర్చిన సంగతి తెలిసినదే. బహుశా, భారత్‌లో ఇదే మొట్టమొదటి ఏఎమ్‌టి సెడాన్ కావచ్చు.

టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌

టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌

అలాగే, టాటా మోటార్స్ అందిస్తున్న విస్టా హ్యాచ్‌బ్యాక్‌కు సక్సెసర్‌గా కంపెనీ తీర్చిదిద్దిన బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో కూడా ఏఎమ్‌టి వేరియంట్ రానుంది. కానీ, లెవర్టన్ పేర్కొన్న దాని ప్రకారం, కేవలం డీజిల్ వెర్షన్ జెస్ట్, బోల్ట్ కార్లలో మాత్రమే ఏఎమ్‌టిని అమర్చనున్నారు.

టాటా నానో

టాటా నానో

అయితే, ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న పెట్రోల్ వెర్షన్ టాటా నానోలో కూడా ఓ ఏఎమ్‌టి వేరియంట్ అందుబాటులోకి రానుంది. కానీ, పెట్రోల్ నానో కారులో ఉపయోగించే ఏఎమ్‌టి మాత్రం జెస్ట్, బోల్ట్ కార్లలో ఉపయోగించే ఏఎమ్‌టి కన్నా భిన్నంగా ఉండనుంది.

టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్

టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్

ఆటో ఎక్స్‌పో 2014లోలో టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ పేరిట కంపెనీ ఏఎమ్‌టి వెర్షన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ ఆటోమేటిక్ నానో కారును ఎప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇది ముందుగా ఇండోనేషియా వంటి మార్కెట్లకు ఎగుమతయ్యే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
In the not too distant future, ever Tata Motors passenger vehicle will be equipped with the Automated Manual Transmission (AMT). Tata Motors first previewed its AMT technology during the reveal of the Zest compact sedan which was equipped with the upcoming transmission system.
Story first published: Monday, February 24, 2014, 17:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X