నానో ట్విస్ట్ యాక్టివ్, నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ ఆవిష్కరణ

By Ravi

టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'లో కంపెనీ మరిన్ని కొత్త వేరియంట్లను పరిచయం చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2014లో టాటా మోటార్స్ 'టాటా నానో ట్విస్ట్ యాక్టివ్' మరియు 'టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్' పేర్లతో రెండుకొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది.

'టాటా నానో ట్విస్ట్ యాక్టివ్'లో ఓపెనింగ్ టెయిల్ గేట్ (వెనుక (బూట్) డోర్ ఓపెన్) ఉంటుంది (ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెగ్యులర్ నానో, పవర్ స్టీరింగ్ వెర్షన్ నానో ట్విస్ట్ మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు). ఈ ఫీచర్ వలన నానోలో మరింత ఎక్కువ లగేజ్ స్పేస్ లభిస్తుంది. ఇకపోతే.. 'టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్' వేరియంట్లో మారుతి సెలెరియో, టాటా జెస్ట్ మోడళ్ల మాదిరిగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ను ఉపయోగించారు. ఇది మెరుగైన మైలేజీనిస్తుంది.

ఈ రెండు కొత్త టాటా నానో వేరియంట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

బూట్ డోర్

బూట్ డోర్

రెగ్యులర్ టాటా నానో కారులో వెనుక డోర్లను ఫోల్డ్ చేసినప్పుడు బూట్ స్పేస్‌ను యాక్సెస్ చేసుకునే వీలుండేది. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ, కొత్త టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్లో సాంప్రదాయ హ్యాచ్‌బ్యాక్‌ల మాదిరిగా వెనుకవైపు బూట్ డోర్‌ను ఓపెన్ చేసి, స్టోరేజ్ స్పేస్‌ను యాక్సెస్ చేసుకునే వెసలుబాటు కల్పించారు.

మైలేజ్

మైలేజ్

అయితే, ఈ ఓపెనింగ్ టెయిల్ గేట్ వలన టాటా నానో బరువు అదనంగా మరో 70 కేజీల వరకు పెరిగింది. దీని ఫలితంగా ఈ వేరియంట్ మైలేజ్ కాస్తంత తగ్గే అవకాశం ఉంది. కానీ రెగ్యులర్ నానో రేంజ్‌ను, నానో ట్విస్ట్ యాక్టివ్ రేంజ్‌ను ఒకేమాదిరిగా ఉంచేందుకు కంపెనీ ఈ వేరియంట్‌లో ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీని 25 లీటర్లకు పెంచింది.

డిజైన్

డిజైన్

రెగ్యులర్ నానో, నానో ట్విస్ట్ వేరియంట్లతో పోల్చుకుంటే ఈ కొత్త టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. బ్లాక్ కలర్ ఎయిర్ డ్యామ్‌తో కూడిన సరికొత్త బంపర్ డిజైన్, రివైజ్ చేయబడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ డిజైన్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

కాన్సెప్ట్ టూ ప్రొడక్షన్

కాన్సెప్ట్ టూ ప్రొడక్షన్

సులువుగా ఓపెన్ చేసుకునేందుకు వీలుండే బూట్ డోర్‌తో తయారు చేసిన టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే అయినప్పటికీ, ఈ ఏడాదిలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలున్నాయి.

టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ ఏఎమ్‌టి

టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ ఏఎమ్‌టి

ఇకపోతే రెండవ వేరియంట్ టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ ఏఎమ్‌టి. ఇదొక క్లచ్ లేని ఆమేటిక్ వేరియంట్. టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ వేరియంట్లో ఉపయోగించే ఏఎమ్‌టి యూనిట్‌ను పై ఫొటోలో చూడొచ్చు.

మైలేజ్ అండ్ కంఫర్ట్

మైలేజ్ అండ్ కంఫర్ట్

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)గా చెప్పుకునే ఈ యూనిట్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ మైలేజీతో ఆటోమేటిక్ గేర్ బాక్స్ సౌకర్యాన్ని ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, దీని ధర పూర్తి ఆటోమేటిక్ కారు ధర కన్నా తక్కువగానే ఉంటుంది.

డిజైన్

డిజైన్

టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ ఏఎమ్‌టి వేరియంట్ కూడా కొత్త టాటా నానో ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్ మాదిరిగానే సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. బ్లాక్ కలర్ ఎయిర్ డ్యామ్‌తో కూడిన సరికొత్త బంపర్ డిజైన్, రివైజ్ చేయబడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ డిజైన్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

కాన్సెప్ట్ టూ ప్రొడక్షన్

కాన్సెప్ట్ టూ ప్రొడక్షన్

చికాకు లేకుండా కారును సులువుగా నడిపేందుకు వీలుండేలా ఏఎమ్‌టి టెక్నాలజీతో తయారు చేసిన టాటా నానో ట్విస్ట్ ఎఫ్-ట్రానిక్ ఏఎమ్‌టి వేరియంట్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే అయినప్పటికీ, ఈ ఏడాదిలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలున్నాయి.

Most Read Articles

English summary
Tata Motors' efforts to upgrade and revive the Nano small car continues as the automaker today brought out a concept variant called the Twist Active at the 2014 Auto Expo and the Nano Twist F-Tronic, an automatic concept variant.
Story first published: Thursday, February 6, 2014, 23:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X