డిసెంబర్‌లో టాటా నానో ట్విస్ట్ ఎక్స్ఈ వేరియంట్ విడుదల

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న 'ప్రజల కారు' టాటా నానోలో కంపెనీ మరో కొత్త వేరియంట్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పవర్ స్టీరింగ్ వెర్షన్ టాటా నానో ట్విస్ట్‌లో ఓ బేస్ వేరియంట్‌ను కంపెనీ డిసెంబర్ 2014లో విడుదల చేయనుంది.

ఈ కొత్త వేరియంట్ పేరు టాటా నానో ట్విస్ట్ ఎక్స్ఈ. ఈ వేరియంట్‌ను పరిచయం చేసిన తర్వాత ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నానో సిఎక్స్, నానో ఎల్ఎక్స్ వేరియంట్స్‌‌ను కంపెనీ మార్కెట్ నుంచి తొలగించి వేయనుంది. అలాగే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నానో ట్విస్ట్ ఎక్స్‌టి వేరియంట్‌ను యధావిధిగా కొనసాగించనున్నారు.

అంటే, ఇకపై టాటా నానో కేవలం రెండు వేరియంట్లలో (బేస్ ట్విస్ట్ ఎక్స్ఈ మరియు టాప్-ఎండ్ ఎక్స్‌టి) మాత్రమే లభ్యం కానుందన్నమాట. అంతేకాదు, ఇక టాటా నానోలో నాన్-పవర్ స్టీరింగ్ (పవర్ స్టీరింగ్ లేని వేరియంట్లు) మార్కెట్ నుంచి తొలగిపోయి, కేవలం పవర్ స్టీరింగ్ ఉన్న నానో కార్లు మాత్రమే లభ్యం కానున్నాయి.

Tata Nano

కారులో ఎక్కువ మార్పులు చేయకుండా, వేరియంట్లలో మాత్రమే మార్పులు చేశారు. కొత్తగా రానున్న టాటా నానో ట్విస్ట్ ఎక్స్ఈ బేస్ వేరియంట్ డిజైన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇందులో బ్లాక్ కలర్ బంపర్స్ (ఫ్రంట్ అండ్ రియర్) ఉంటాయి, వీల్ క్యాప్స్ ఉండవు. కారు లోపల పెద్ద స్టీరింగ్ వీల్ ఉంటుంది.

అలాగే, మైలేజ్, శూన్యం నుంచి దూరం, డిజిటల్ క్లాక్‌తో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అలాగే, ప్రస్తుత నానో సిఎక్స్ వేరియంట్లో లభిస్తున్న అన్ని ఫీచర్లను ఈ కొత్త టాటా నానో ట్విస్ట్ ఎక్స్ఈ వేరియంట్లోను ఆఫర్ చేయనున్నారు. ఈ కొత్త వేరియంట్ సిల్వర్, గోల్డ్, వైట్ కలర్లలో మాత్రమే లభ్యం కానుంది. దీని ఇంజన్‌లో కూడా ఎలాంటి అప్‌గ్రేడ్స్ లేవు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata Motors is planing to introducing new Nano Twist XE base variant with power steering option in December. Company also reported to be cutting off CX and LX variants of Nano with manual steering.
Story first published: Friday, November 7, 2014, 18:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X