మరింత పవర్‌ఫుల్ నానో, హైబ్రిడ్ నానో కార్లు వస్తున్నాయ్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టాటా నానో కార్ ప్రాజెక్ట్ ఆశించిన రీతిలో కంపెనీకి విజయాలు తెచ్చిపెట్టలేకపోతున్న నేపథ్యంలో, ఈ కారుకు మరింత ప్రీమియం హోదాను కల్పించేందుకు కంపెనీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇందులో భాగంగానే, టాటా మోటార్స్ నానో ట్విస్ట్ పేరిట ఓ పవర్ స్టీరింగ్ వెర్షన్‌‍ను ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ నానో (పవర్ స్టీరింగ్ లేని వేరియంట్ల) ఉత్పత్తిని నిలిపివేసింది. సిఎన్‌జి నానోను విడుదల చేసింది. త్వరలోనే ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కలిగిన నానోను, ఓపెనబల్ బూట్ డోర్ కలిగిన నానోను కూడా విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. తాజా అప్‌డేట్ ప్రకారం, టాటా మోటార్స్ మరింత శక్తివంతమైన సూపర్‌చార్జ్డ్ ఇంజన్ కలిగిన నానోను అలాగే బ్యాటరీ మరియు పెట్రోల్ పవర్‌తో నడిచే ఓ హైబ్రిడ్ వెర్షన్ నానోను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న నానో కారులో 624సీసీ, 2-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌నను అమర్చారు, ఇది కేవలం 38 బిహెచ్‌పిల శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మరిన్ని నానో వేరియంట్స్..

తర్వాతి స్లైడ్‌లలో కొత్త నానో వేరియంట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని పరిశీలించండి.

సూపర్‌చార్జ్డ్ వేరియంట్

సూపర్‌చార్జ్డ్ వేరియంట్

టాటా నానో లాంటి చిన్న కారుతో పాటుగా మరింత పవర్‌ఫుల్ కారును కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకొని కంపెనీ సూపర్‌చార్జ్డ్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఆటోకార్ ప్రొఫెషనల్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది పండుగ సీజన్‌లోనే సూపర్‌చార్జ్డ్ ఇంజన్ కలిగిన టాటా నానో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

హైబ్రిడ్ వేరియంట్

హైబ్రిడ్ వేరియంట్

టాటా నానో ఈ-రెవ్ పేరిట కంపెనీ ఇందులో ఓ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో గ్రీన్ కార్లపై (పర్యావరణ సాన్నిహిత్యమైన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లపై) ప్రభుత్వం రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించినట్లయితే, త్వరలోనే ఈ మోడల్ కూడా భారత రోడ్లపైకి వచ్చే ఆస్కారం ఉంది.

ఏఎమ్‌టి వేరియంట్

ఏఎమ్‌టి వేరియంట్

అంతేకాకుండా, టాటా మోటార్స్ ఈ ఏడాదిలోనే ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్ బాక్స్ కలిగిన నానోను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్

ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్

మరోవైపు, గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ 'నానో ట్విస్ట్ యాక్టివ్' పేరిట ప్రదర్శించిన ఓపెనబల్ బూట్ డోర్ (తెరవడానికి వీలుండే వెనుక డోరు) కలిగిన వేరియంట్‌ను కూడా కంపెనీ ఈ ఏడాదిలోనే విడుదల చేయవచ్చని అంచనా.

Most Read Articles

English summary
To further enrich the Nano's lineup and to find new ways to make it popular, Tata Motors will reportedly launch a new variant of the Nano, powered by a supercharged engine. The supercharged engine will reportedly be more powerful and will be targeted towards those looking for a small car like the Nano, but with more grunt.
Story first published: Wednesday, June 18, 2014, 11:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X