మారుతి ఆల్టోకి పోటీగా వస్తున్న టాటా పెలికాన్!

By Ravi

టాటా మోటార్స్ ఎన్నో ఆశలతో ప్రవేశపెట్టిన తమ ప్రజల కారు టాటా నానో, కంపెనీ ఆశించిన రీతిలో విజయం సాధించలేకపోయింది. ఈ మోడల్ కోసం కంపెనీ సుమారు రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడిని వెచ్చించి, గుజరాత్‌లోని సనంద్‌లో కేవలం టాటా నానో కారు కోసమే ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. కాగా.. ఇప్పుడు టాటా మోటార్స్ భారత మార్కెట్ కోసం మరో సరికొత్త చిన్న కారును అభివృద్ధి చేస్తోంది.

భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్మడుపోతున్న మారుతి ఆల్టో కారుకి గట్టి పోటీనిచ్చేలా టాటా మోటార్స్ ఓ సరికొత్త చిన్న కారును డెవలప్ చేస్తోంది. 'పెలికాన్' (Pelican) అనే కోడ్‌నేమ్‌తో 'ఎక్స్302' (X302) అనే ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ ఈ కొత్త కారును అభివృద్ధి చేస్తోంది. ఇది కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న టాటా నానో కారుకి అప్‌గ్రేడ్ (పెద్ద హ్యాచ్‌బ్యాక్) వెర్షన్ అని సమాచారం.

టాటా మోటార్స్‌కి అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త పెలికాన్ హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

ఆల్టోకి పోటీగా టాటా పెలికాన్!

టాటా పెలికాన్ కారు ఇంజన్ విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి 1000సీసీ లీటర్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 800సీసీ ఇంజన్.

ఆల్టోకి పోటీగా టాటా పెలికాన్!

టాటా మోటార్స్ సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశలో భాగంగా మరియు చిన్న కార్ మార్కెట్లో ఓ మంచి కారును ఆఫర్ చేయాలనే భావనతో కంపెనీ ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేస్తోంది.

ఆల్టోకి పోటీగా టాటా పెలికాన్!

టాటా మోటార్స్ డెవలప్ చేస్తున్న ఈ పెలికాన్ హ్యాచ్‌బ్యాక్‌ను టాటా నానో కారుకి ఎగువన ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా.. ఈ కొత్త మోడల్‌ను ఓ కొత్త బ్రాండ్ పేరుతో విక్రయించనున్నారు.

ఆల్టోకి పోటీగా టాటా పెలికాన్!

టాటా పెలికాన్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది. ఇందులో 800సీసీ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది ఎక్కువ మైలేజీనిస్తుందని సమాచారం. అంతేకాకుండా.. దేశంలో కెల్లా అత్యంత చవకైన డీజిల్ కారుగా కూడా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

ఆల్టోకి పోటీగా టాటా పెలికాన్!

టాటా పెలికాన్ కారును ఇండియన్ మార్కెట్లోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Tata Motors is planning to launch a new vehicle, code named the Pelican, to take on the best selling car in India, the Maruti Suzuki Alto.
Story first published: Monday, January 19, 2015, 16:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X