ఆస్ట్రేలియాలో టాటా జెనాన్ టఫ్ ట్రక్ కాన్సెప్ట్ ఆవిష్కరణ

By Ravi

టాటా మోటార్స్ అందిస్తున్న పవర్‌‌ఫుల్, స్టయిలిష్ పికప్ ట్రక్కు 'టాటా జెనాన్'లో ఓ సరికొత్త వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో టాటా జెనాన్ పికప్ ట్రక్ ఆస్ట్రేలియా మార్కెట్లో విడుదల కావాల్సి ఉంది. అయితే, టాటా మోటార్స్ అంతకంటే ముందుగానే ఇందులో 'టాటా జెనాన్ టప్ ట్రక్' పేరిట ఓ కొత్త కాన్సెప్ట్‌ను అక్కడి మార్కెట్‌కు పరిచయం చేసింది.

ఈ వారాంతంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నేషనల్ 4x4, అవుట్‌డోర్స్ షో అండ్ ఫిషింగ్, బోటింగ్ ఎక్స్‌పో నేపథ్యంలో, టాటా మోటార్స్ తమ జెనాన్ పికప్ ట్రక్‌ను ప్రదర్శించేందుకు ఆ కార్యక్రమాన్ని వేదికగా ఎంచుకుంది. మరి ఈ స్టయిలిష్ టాటా జెన్ టఫ్ ట్రక్కుకు సంబంధించి మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

టాటా జెనాన్ టఫ్ ట్రక్ కాన్సెప్ట్

ఫ్యూజన్ ఆటోమోటివ్ (ఆస్ట్రేలియాలోని టాటా మోటార్స్ స్థానిక పంపిణీదారు) సహకారంతో టాటా మోటార్స్ ఈ జెనాన్ టఫ్ ట్రక్కును రూపొందించింది. ఈ కాన్సెప్ట్ ఫోర్ వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌ను కలిగి ఉంటుంది.

టాటా జెనాన్ టఫ్ ట్రక్ కాన్సెప్ట్

రెగ్యులర్ వెర్షన్ టాటా జెనాన్ పికప్ ట్రక్కుకు అధనపు బాడీ కిట్లను, యాక్ససరీలను జోడించి జెనాన్ టఫ్ ట్రక్ కాన్సెప్ట్‌ను తయారు చేశారు. ఇందులో వీల్స్, స్నోర్కెల్, రూఫ్‌పై స్పోర్ట్స్ బార్, ఎల్ఈడి జెనాన్ డ్రైవింగ్ అండ్ స్పాట్ లైట్స్, డేటైమ్ రన్నింగ్ లైట్లు చెప్పుకోదగినవి.

టాటా జెనాన్ టఫ్ ట్రక్ కాన్సెప్ట్

ఈ చక్రాలు 20 ఇంచ్‌ల కొలతను కలిగి ఉండి, ధృడమైన అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి. ఇందులో మరొక ప్రధాన ఆకర్షన్ ఆఫ్ రోడ్ టైర్లు. శాటిన్ ఆర్డెన్ ఎక్స్టీరియర్ పెయింట్‌తో జెనాన్‌కు టఫ్ టచ్‌ను ఇచ్చారు.

టాటా జెనాన్ టఫ్ ట్రక్ కాన్సెప్ట్

ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 2.2 లీటర్ డైకార్, యూరో-5 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 148 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
With the National 4×4 & Outdoors Show and Fishing & Boating Expo going on in Melbourne this weekend Tata Motors found the right venue to showcase a concept based on the Xenon, the Tuff Truck Concept. Look at it once and you know Tata has done it right.
Story first published: Saturday, August 24, 2013, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X