టాటా జెస్ట్ బుకింగ్స్ ప్రారంభం; ఆగస్ట్‌లో విడుదల!

By Ravi

టాటా మోటార్స్ నుంచి రానున్న తొలి కాంపాక్ట్ సెడాన్ 'జెస్ట్' (Zest) కోసం కంపెనీ ఇప్పటి నుంచే ఆన్‌లైన్‌లో బుకింగ్‌లను స్వీకరిస్తోంది. కేవలం 21,000 బయానా (అడ్వాన్స్) చెల్లించి కస్టమర్లు తమ టాటా జెస్ట్ సెడాన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ప్రస్తుతం కస్టమర్లు పెట్రోల్ లేదా డీజిల్ వెర్షన్‌ను మాత్రమే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోగలరు. ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం కోరుకునే వారు, కారు విడుదలైన తర్వాత మీ సమీపంలోని డీలర్‌‍షిప్ వద్ద వేరియంట్లు, ఫీచర్ల వివరాలను పొందవచ్చు.

ఇది కూడా చదవండి: టాటా బోల్ట్ ఫీచర్లు

టాటా మాంజా సెడాన్లకు రీప్లేస్డ్ వెర్షన్‌గా వస్తున్న టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను మోడ్రన్ లుక్‌తో పాటు అధునాత టెక్నాలజీతో తయారు చేశారు. టాటా 'హ్యుమినిటీ' లైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బంపర్స్, కొత్త కల్ ఆప్షన్స్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

Tata Bolt

టాటా జెస్ట్ కారులో 5 ఇంచ్ టచ్‍స్క్రీన్‌తో కూడిన హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్ అండ్ టెక్స్ట్ టూ స్పీచ్ సిస్టమ్, ఫోన్ ఆధారిగా నావిగేషన్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్స్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి పలు ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. కొత్త హెడ్‌లైట్స్, కొత్త ఫాగ్ ల్యాంప్ డిజైన్, కొత్త గ్రిల్, కొత్త టెయిల్ ల్యాంప్, కొత్త బంపర్స్ మరియు సైడ్ మిర్రర్లను ఈ కార్లలో గమనించవచ్చు.

ఇది కూడా చదవండి: టాటా నెక్స్ట్ జనరేషన్ స్మాల్ కార్ కైట్

ఇంకా ఉందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, శాటిలైట్ నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్పీడ్ సెన్సిటివ్ పవర్ స్టీరింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభ్యం కానున్నట్లు సమాచారం. ఇంజన్స్ విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్లలో టాటా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.

డీజిల్ వెర్షన్లలో మాత్రం 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా జెస్ట్ ధరలు వేరియంట్‌ను బట్టి ధర రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

ఈ వీడియో చూశారా? సైడ్ మిర్రర్స్ చూడనందుకు భారీ మూల్యం!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/7dQYbCaxZPA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Much awaited Tata Zest compact sedan will be launched in August. Tata Motors has already started accepting bookings for the Zest compact sedan through online for an amount of Rs 21,000, which can be paid via debit or credit card.&#13;
Story first published: Monday, July 21, 2014, 9:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X