బెంగుళూరులో టెస్టింగ్ దశలో కెమరాకు చిక్కిన టాటా జెస్ట్

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా, మాంజాలకు అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా టాటా బోల్ట్, టాటా జెస్ట్ మోడళ్లను కంపెనీ గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ మోడళ్లు త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఇప్పటికే ఈ రెండు మోడళ్లకు సంబంధించిన వెబ్‌సైట్లను కూడా రిలీజ్ చేసింది.

కాగా.. తాజాగా టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను బెంగుళూరు నగర వీధులపై టెస్ట్ చేస్తుండగా, మా కంట పడింది. వెంటనే మా కెమెరాలో దానిని బంధించాం. మహారాష్ట్ర లైసెన్స్ ప్లేట్ కలిగి ఉన్న ఈ కారును బెంగుళూరు రోడ్లపై టెస్టింగ్ చేస్తున్నారు. ఈ కారును ఎవ్వరూ గుర్తు పట్టకుండా ఉండేలా దానిని క్యాఫ్లేజ్ చేశారు. పండుగ సీజన్ కంటే ముందుగానే ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా.


బోరింగ్ టాటా మాంజా డిజైన్‌కు స్వస్తి పలుకుతూ, అధునాతన డిజైన్‌ అండ్ టెక్నాలజీతో కొత్త టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను తయారు చేశారు. డిజైనెక్స్ట్, డ్రైవ్‌నెక్స్ట్, కనెక్ట్‌నెక్స్ట్ లతో కూడిన టాటా మోటార్స్ యొక్క 'హారిజానెక్స్ట్' సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కారును తయారు చేశారు. టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను కంపెనీ యొక్క ఎక్స్1 ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు.

పూనే, యూకే మరియు ఇటలీలోని టాటా మోటార్స్ డిజైన్ స్టూడియోల నుంచి సేకరించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ కారును డిజైన్ చేశారు. ఈ కారులో సరికొత్త ఇంజన్లను కూడా ఉపయోగించారు. టాటా జెస్ట్ ఫ్రంట్ డిజైన్ పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. టాటా 'హ్యుమినిటీ' లైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బంపర్స్, కొత్త కల్ ఆప్షన్స్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి.

Tata Zest Compact Sedan

ఈ కారులో లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఎమినిటీస్‌తో అప్‌గ్రేడ్ చేసిన సరికొత్త ఇంటీరియర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టాటా జెస్ట్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్‌లో, టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన 1.2 లీటర్ రెవోట్రాన్ ఎమ్‌పిఎఫ్ఐ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

అలాగే డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో రెగ్యులర్ 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌కు బదులుగా ఇందులో శక్తివంతమైన 1.5 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇంజన్ పెర్ఫామెన్స్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఈ కారులో ఆఫర్ చేయనున్న కొన్ని ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 5 ఇంచ్ టచ్‍స్క్రీన్‌తో కూడిన హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్ అండ్ టెక్స్ట్ టూ స్పీచ్ సిస్టమ్, ఫోన్ ఆధారిగా నావిగేషన్ సిస్టమ్ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లున్నాయి.

Most Read Articles

English summary
We spotted the upcoming Tata Zest compact sedan in test camouflage in Bangalore. A rare occurrence, considering the car is already close to being launched. Our guess is the vehicle, which had a Maharashtra licence plate, was on an extended drive test before hitting the market prior to the festive season.
Story first published: Thursday, April 17, 2014, 11:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X