బెంగుళూరులో టాటా జెస్ట్ విడుదల; ప్రారంభ ధర రూ.4.69 లక్షలు

టాటా మోటార్స్ ఇటీవల దేశీయ విపణిలో విడుదల తమ తొలి కాంపాక్ట్ సెడాన్ 'టాటా జెస్ట్' (Tata Zest)ను కంపెనీ తాజాగా కర్ణాటక మార్కెట్లో విడుదల చేసింది. బెంగుళూరులో దీని ప్రారంభ ధర కేవలం రూ.4.69 లక్షలు (బేస్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్) మాత్రమే. టాటా జెస్ట్ సెడాన్‌ను మొట్టమొదటి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో సమయంలో కంపెనీ ఆవిష్కరించింది.

టాటా జెస్ట్ మొత్తం 9 వేరియంట్లలో (4 పెట్రోల్, 5 డీజిల్) లభ్యం కానుంది. అన్ని పెట్రోల్ వెర్షన్లు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తాయి, కానీ డీజిల్‌లో వెర్షన్ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో లభిస్తుంది. డిజైనెక్స్ట్, డ్రైవ్‌నెక్స్ట్, కనెక్ట్‌నెక్స్ట్ అనే మూడు కీలక అంశాలను ప్రతిభింభింపజేసేలా టాటా మోటార్స్ ఈ కారును తీర్చిదిద్దింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాటా జెస్ట్ విడుదల

తర్వాతి స్లైడ్‌లలో టాటా జెస్ట్ సెడాన్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

333 (ట్రిపుల్ త్రీ) స్కీమ్

333 (ట్రిపుల్ త్రీ) స్కీమ్

టాటా జెస్ట్ సెడాన్ కోసం కంపెనీ 333 (ట్రిపుల్ త్రీ) అనే విశిష్టమైన సర్వీస్ ఆఫర్‌ను కూడా విడుదల చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా, జెస్ట్ కారుపై 3 ఏళ్లు లేదా 1 లక్ష కి.మీ (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని, మూడేళ్ల లేదా 45,000 కి.మీ. (ఏది ముందుగా ముగిస్తే అది) యాన్యువల్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ (ఏఎమ్‌సి)ని మరియు 3 ఏళ్లు ఉచిత 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

డిజైనెక్స్ట్

డిజైనెక్స్ట్

'కాన్ఫిడెంట్ డైనమిజం' అనే కొత్త డిజైన్ డైరెక్షన్ ఆధారంగా చేసుకొని సరికొత్త జెస్ట్ స్టయిలింగ్‌ను తీర్చిదిద్దారు. మోడ్రన్ అండ్ స్టయిలిష్ ఎక్స్టీరియర్స్, ప్రీమియం ఇంటీరియర్లతో పాటుగా మెరుగైన ఇంజన్లతో కొత్త జెస్ట్ కారును తయారు చేశారు.

డ్రైవ్‌నెక్స్ట్ - రీఫైన్డ్ రెవోట్రాన్ 1.2లీ పెట్రోల్ ఇంజన్

డ్రైవ్‌నెక్స్ట్ - రీఫైన్డ్ రెవోట్రాన్ 1.2లీ పెట్రోల్ ఇంజన్

పెట్రోల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇందులో కంప్లీట్ ఆటోమేటిక్ కానీ లేదా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కానీ అందుబాటులో లేదు.

డ్రైవ్‌నెక్స్ట్ - 1.2లీ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్

డ్రైవ్‌నెక్స్ట్ - 1.2లీ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే అనుసంధానం చేయబడి ఉంటుంది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డీజిల్ వెర్షన్ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)తో లభిస్తుంది. ఈ ఏఎమ్‌టి ఇటలీకి చెందిన మాగ్నెటి మారెల్లీ సంస్థ సహకారంతో తయారు చేశారు.

డ్రైవ్‌నెక్స్ట్ - మల్టీ డ్రైవింగ్ మోడ్స్

డ్రైవ్‌నెక్స్ట్ - మల్టీ డ్రైవింగ్ మోడ్స్

ఇదివరకు చెప్పుకున్నట్లు గానే టాటా జెస్ట్ కారులోని పెట్రోల్ ఇంజన్ స్పోర్ట్స్, ఎకానమీ, సిటీ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో యాక్సిలరేషన్ వేగంగా ఉంటుంది, ఓపెన్ రోడ్స్, హైవేలపై ఈ మోడ్ చక్కగా ఉపయోగపడుతుంది. మైలేజ్‌ను కోరుకునే వారు ఈకో మోడ్‍‌ను ఎంచుకోవచ్చు, ఈ మోడ్‌లో బెటర్ మైలేజ్ కోసం పెర్ఫార్మెన్, థ్రోటల్ రెస్పాన్స్‌ను తగ్గుతుంది. సిటీ మోడ్‌లో పెర్ఫార్మెన్స్, మైలేజ్‌లు సమతౌల్యంగా ఉంటాయి.

జెస్ట్ డీజిల్ ఏఎమ్‌టి వెర్షన్ స్పోర్ట్, సిటీ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్‌లో మాత్రమే లభిస్తుంది.

ఫెర్ఫార్మెన్స్, టాప్ స్పీడ్

ఫెర్ఫార్మెన్స్, టాప్ స్పీడ్

హై బూస్ట్ టర్బోచార్జర్‌తో కూడిన 1.2 లీటర్ రెవట్రోన్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 90 పిఎస్‌ల శక్తిని, 1750-3500 ఆర్‌పిఎమ్ వద్ద 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 154 కిలోమీటర్లు.

ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 90 పిఎస్‌ల శక్తిని, 1750-3000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 158 కిలోమీటర్లు.

మైలేజ్

మైలేజ్

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం జెస్ట్ మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి:

* పెట్రోల్ వెర్షన్ - 17.6 కెఎమ్‌పిఎల్

* డీజిల్ వెర్షన్ - 23.0 కెఎమ్‌పిఎల్

కనెక్ట్‌నెక్స్ట్

కనెక్ట్‌నెక్స్ట్

ప్రీమియం కార్లలో లభించే పాపులర్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను టాటా మోటార్స్ జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో పరిచయం చేసింది. ఇందులోని 5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అడ్వాన్స్డ్ వాయిస్ కమాండ్ రికగ్నైజేషన్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్ అండ్ రీడ్ అవుట్స్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్స్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

టాటా జెస్ట్ మొత్తం ఆరు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది. అవి - బజ్ బ్లూ, వెనెటియన్ రెడ్, స్కై గ్రే, డ్యూన్ బీజ్, ప్లాటినం సిల్వర్, ప్రిస్టీన్ వైట్. టాటా జెస్ట్ వేరియంట్లు, ధరల వివరాలను తర్వాతి స్లైడ్‌లలో చూడండి.

పెట్రోల్ వెర్షన్ ధరలు:

పెట్రోల్ వెర్షన్ ధరలు:

టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్ఈ - రూ.4.69 లక్షలు

టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్ఎమ్ - రూ.5.31 లక్షలు

టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్ఎమ్ఎస్ - రూ.5.49 లక్షలు

టాటా జెస్ట్ పెట్రోల్ 1.2టి ఎక్స్‌టి - రూ.6.06 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

డీజిల్ వెర్షన్ ధరలు:

డీజిల్ వెర్షన్ ధరలు:

టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్ఈ - రూ.5.73 లక్షలు

టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్ఎమ్ - రూ.6.37 లక్షలు

టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్ఎమ్ఎస్ - రూ.6.55 లక్షలు

టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్‌టి - రూ.7.10 లక్షలు

టాటా జెస్ట్ పెట్రోల్ 1.3లీ ఎక్స్‌ఎమ్ఏ - రూ.7.10 లక్షలు (ఏఎమ్‌టి)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

Most Read Articles

English summary
Tata Motors has launched its all new, sub-four metre compact sedan Zest in Bangalore with a start price of Rs. 4.69 Lakhs for the petrol Revotron 1.2T model and Rs. 5.73 Lakhs for the diesel variant (both prices ex-showroom).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X