టాటా జెస్ట్ ఎక్స్‌టిఏ వేరియంట్ విడుదల

By Ravi

టాటా మోటార్స్ అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ జెస్ట్‌లో కంపెనీ తాజాగా మరో కొత్త వేరియంట్‌‍ను ప్రవేశపెట్టింది. టాటా జెస్ట్ ఎక్స్‌టిఏ వేరియంట్ పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది.

టాటా జెస్ట్‌లో ఇప్పటి వరకూ ఎక్స్ఎమ్ఏ వేరియంట్‌లో మాత్రమే ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో ఉండేది. కాగా.. టాటా మోటార్స్ ఇప్పుడు తమ కస్టమర్ల కోసం ఎక్స్‌టిఏ మరో ఏఎమ్‌టి వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ కొత్త జెస్ట్ ఎక్స్‌టిఏ టాప్-ఎండ్ వేరియంట్‌గా లభ్యం కానుంది. ఈ కొత్త వేరియంట్ డీజిల్ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు లేవు, ఇది కూడా పాపులర్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తోనే లభిస్తుంది.

tata zest xta launch india

టాటా జెస్ట్ ఎక్స్‌టిఏ ధర:
దేశీయ విపణిలో టాటా జెస్ట్ ఎక్స్‌టిఏ ఏఎమ్‌టి వెర్షన్ ధర రూ.8.43 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

టాటా జెస్ట్ ఎక్స్‌టిఏ ఫీచర్లు:

  • టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్
  • ఆటో క్లైమేట్ కంట్రోల్
  • రియర్ పార్కింగ్ సెన్సార్స్
  • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
  • ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్
  • డేటైమ్ రన్నింగ్ లైట్స్
  • ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్
  • హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • రియర్ డిఫాగ్గర్
  • హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్

టాటా జెస్ట్ ఎక్స్‌టిఏ సేఫ్టీ ఫీచర్లు:

  • డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్టట
  • 9వ తరం ఏబిఎస్, ఈబిడి
  • కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్
  • ఇంజన్ ఇమ్మొబిలైజర్
  • స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్

టాటా జెస్ట్ ఎక్స్‌టిఏ ఇంజన్:
టాటా జెస్ట్ ఎక్స్‌టిఏ వేరియంట్‌లో 1248 (1.3 లీటర్) టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఏఎమ్‌టి వెర్షన్ టాటా జెస్ట్ లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

Most Read Articles

English summary
India's largest manufacturer of four-wheelers, Tata Motors had recently introduced its next-generation of products. These included the Zest compact sedan and Bolt hatchback, both of which are global products. Now the manufacturer has introduced an all-new variant in its compact sedan range.
Story first published: Tuesday, March 10, 2015, 13:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X