మారుతి సెలెరియో కన్నా బెటర్‌గా ఉండే టాటా కైట్

By Ravi

మారుతి సుజుకి ఇండియా మొట్టమొదటిసారిగా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీతో ప్రవేశపెట్టిన 'సెలెరియో' కారు అతి తక్కువ సమయంలోనే మార్కెట్లో మంచి పాపులర్ అయిన సంగతి తెలిసినదే. అంతేకాదు, ప్రస్తుతం భారత విపణిలో అత్యంత సరసమైన ధరకే లభిస్తున్న ఏఎమ్‌టి కారు కూడా ఇదే. అయితే, సెలెరియో త్వరలోనే టాటా మోటార్స్ నుంటి గట్టి పోటీ ఎదుర్కోనుంది.

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో బోల్ట్, జెస్ట్ కార్లను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. అంతేకాకుండా, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న టాటా నానోకు ఎగువన ఓ చిన్న కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ మేరకు టాటా మోటార్స్ ఇప్పటికే 'కైట్' (KITE) అనే కోడ్ నేమ్‌తో ఓ కాంపాక్ట్ కారును అభివృద్ధి చేస్తోంది.


టాటా కైట్‌ను ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి సెలెరియోకి పోటీగా ప్రవేశపెట్టనున్నారు. ఈ కారులో టాటా మోటార్స్ తాజాగా అభివృద్ధి చేస్తున్న 1000సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. టాటా నానో మరియు టాటా ఇండికా మధ్యలో ఈ బడ్జెట్ కారును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, మారుతి సెలెరియో కన్నా టాటా కైట్ మరింత బెటర్‌గా ఉండొచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం బడ్జెట్ కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో మారుతి సుజుకి సెలెరియో వంటి మోడళ్లు మార్కెట్‌ను డామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఈ విభాగంలో ఉత్పత్తులను అందించాలని భావిస్తోంది. టాటా మోటార్స్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ ఉంది. దీంతో, టాటా ప్రవేశపెట్టబోయే తమ చిన్న కారు మారుతి ఆల్టోలా సక్సెస్ సాధించే అవకాశం ఉంది.

Celerio

గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ప్రదర్శించిన నెక్సన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని కంపెనీ తమ కైట్ కాంపాక్ట్ కారును అభివృద్ధి చేస్తున్నట్లు విస్వసనీయ వర్గాల సమాచారం. టాటా మోటార్స్ తమ కైట్ కారును గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో (టాటా నానో మాత్రమే తయారవుతున్న ప్లాంట్‌లో) ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. టాటా కైట్ స్మాల్ కార్ 2015లో అందుబాటులోకి రానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Tata Kite will be placed straight up against the popular Maruti Suzuki Celerio. It will sport a smaller capacity engine, a sub 1000cc mill. The Kite hatchback will be positioned between Tata's Nano and Indica. They believe there is great potential for the Kite in its segment and it can beat the Celerio.
Story first published: Monday, June 30, 2014, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X