తెలంగాణాలో కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ల సిరీస్ ఇవే..

By Ravi

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలోని వాహనాల రిజిస్ట్రేషన్ మార్పు విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. తెలంగాణా రాష్ట్రానికి చెందిన మరియు ఆ రాష్ట్రంలో ఇప్పటికే AP పేరుతో రిజిస్టర్ అయి ఉన్న వాహనాలన్నింటినీ TS పేరుపైకి మార్చడంతో పాటుగా, జిల్లా కోడ్‌లను కూడా ఖరారు చేశారు. తెలంగాణా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కేటాయించిన కోడ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ - TS 01
కరీంనగర్ - TS 02
వరంగల్ - TS 03
ఖమ్మం - TS 04
నల్లగొండ - TS 05
మహబూబ్ నగర్ - TS 06
రంగారెడ్డి - TS 07, TS 08
హైదరాబాద్ - TS 09, TS 10, TS 11, TS 12, TS 13, TS 14
మెదక్ - TS 15
నిజామాబాద్ - TS 16
ఆర్టీసీ వాహనాలు - TS Z
పోలీసు వాహనాలు - TS P 09
రవాణా శాఖ - TS T, TS U, TS V, TS W, TS X, TS Y

TS Registration Series

రిజిస్ట్రేషన్ సిరీస్, జిల్లా కోడ్‌లపై స్పష్టత రావటంతో, రాష్ట్ర విభజన కారణంగా ఈ నెల 2వ తేది నుండి నిలిచిపోయిన వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి తిరిగి ప్రారంభమైంది. ఇకపై తెలంగాణలో కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలన్నింటినీ TS సిరీస్‌ను జోడించనున్నారు. కాగా.. AP పేరుతో ఉన్న పాత వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చుకునేందుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు నెలల గుడువు కేటాయించింది. అయితే, ఈ విషయంలో రిజిస్ట్రేషన్ మార్పుకు సంబంధించిన ఫీజు తదితర అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రావల్సి ఉంది.
Most Read Articles

English summary
Telangana State Transport Department finally rolled out its TS series for registration of new vehicles in Telangana from Wednesday morning, with secondary alphabet series EA in all the 10 districts.
Story first published: Thursday, June 19, 2014, 13:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X