టెర్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా ఆవిష్కరణ; 2015లో విడుదల!

By Ravi

జపాన్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెర్రా మోటార్స్, ఈ ఏడాది జనవరి నెలలో భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్ కోసం ఇప్పటికే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ సూపర్ బైక్‌లను పరిచయం చేసిన టెర్రా మోటార్స్, వచ్చే ఏడాది ఆరంభంలో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్ (ఆటోరిక్షాను) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో, టెర్రా మోటార్స్ ఇండియా భారత మార్కెట్ కోసం తయారు చేసిన ఆర్6 అనే ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను ఆవిష్కరించింది. వాస్తవానికి టెర్రా మోటార్స్ గతంలో తమ టి4 మోడల్ ఆటోరిక్షాను ఇండియాలో విడుదల చేస్తామని చెప్పి, ఇప్పుడు ఆర్6 అనే మోడల్‌ను ఆవిష్కరించడం గమనార్గం. టెర్రా టి4 చూడటానికి మన సాంప్రదాయ ఆటో మాదిరిగానే ఉంటుంది. అయితే, ఈ టెర్రా ఆర్6 మోడల్ మాత్రం విచిత్రంగా ఉంది. టెర్రా ఆటోరిక్షాకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టెర్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా

టెర్రా మోటార్స్ ఆవిష్కరించిన ఆర్6 ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలోని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ పెర్ఫార్మెన్స్‌ను సాధించేందుకు గాను బ్యాటరీ, కంట్రోలర్, చార్జర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను టెర్రా మోటార్స్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది.

టెర్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా

టెర్రా ఆర్6 ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలో మొత్తం 7గురు ప్రయాణించవచ్చు (డ్రైవరుతో కలిపి). ఇది కాంపాక్ట్ డిజైన్‌ని, తేలికపాటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఇందులో విశాలమైన స్పేస్ ఉంటుంది.

టెర్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా

టెర్రా ఆర్6 మోడల్‌ను జపాన్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ఎలక్ట్రిక్ త్రీవలర్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో టెర్రా మోటార్స్ జపాన్ నాణ్యతా ప్రమాణాలతో కూడిన కాంపోనెంట్లను ఎంపిక చేసి దీనిని తయారు చేసింది. దీని ధృడత్వాన్ని పరీక్షించేందుకు గాను టెర్రా మోటార్స్ ఈ మోడల్‌ను ఇండియాలో అనేక సార్లు టెస్ట్ చేసింది.

టెర్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా

సాంప్రదాయ ఆటోరిక్షాలతో పోల్చుకుంటే, తమ ఆర్6 ఎలక్ట్రిక్ ఆటోరిక్షా డ్రైవర్లకు ఎంతో గొప్ప ప్రయోజనాలను చేకూర్చి పెడుతుందని, అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ వాహనం వలన పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరదని కంపెనీ పేర్కొంది. ఫ్యూయెల్ పరంగా చూసుకుంటే, టెర్రా ఆర్6ని నడిపే వారు సగటున సుమారు రూ.2.5 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

టెర్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా

టెర్రా ఆర్6 ఎలక్ట్రిక్ ఆటోరిక్షాను ముందుకే కాకుండా వెనుకకు కూడా నడపవచ్చు. ఇందులో రివర్స్ టర్నింగ్ ఫంక్షన్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. దీని వలన టర్నింగ్, పార్కింగ్ సులువుగా ఉంటుంది.

టెర్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా

వర్షం నుంచి ప్రయాణీకులను తడవకుండా ఉంచేందుకు ప్యాసింజర్ క్యాబిన్‌కి ఇరువైపులా రెయిన్ కవర్స్ ఆఫర్ చేస్తున్నారు.

టెర్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా

టెర్రా ఆర్6 సన్నటి డిజైన్‌ని, అతి తక్కువ టర్నింగ్ రేడియస్ (3.2 మీటర్ల)ను కలిగి ఉండి, ఇరుకుగా ఉండే రోడ్లపై సైతం ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది.

Most Read Articles

English summary
Terra Motors India has unvield its all-new electric autorickshaw R6. The Japanese electric vehicle manufacturer is planning to launch this electric autorickshaw in India in early 2015. Stay tuned for latest updates.
Story first published: Saturday, December 20, 2014, 16:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X