టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్ నిలువుగా పైకెరిగే కారు

By Ravi

అమెరికాలోని మస్సాచుస్సెట్‌కు చెందిన 'టెర్రాఫుజియా' రూపొందించిన ప్రొడక్షన్ రెడీ 'ట్రాన్సిషన్' (Transition ) ఫ్లయింగ్ కారును గడచిన సంవత్సరం న్యూయార్క్‌లో జరిగిన '2012 న్యూయార్క్ ఇంటర్నేషల్ ఆటో షో'లో ప్రదర్శించిన సంగతి తెలిసినదే. ఇది 2015 అందుబాటులోకి వస్తుందని అప్పట్లో టెర్రాఫుజియా పేర్కొంది. అయితే, తాజాగా ఈ కంపెనీ అభివృద్ధి తర్వాతి తరం ఎగిరే కారు (నెక్స్ట్ జనరేషన్ ఫ్లయింగ్ కార్) 'టిఎఫ్-ఎక్స్' (TF-X)ను కంపెనీ ఆవిష్కరించింది.

ట్రాన్సిషన్ మరియు టిఎఫ్-ఎక్స్ మోడళ్లకు మధ్య కీలక వ్యత్యాసం ఏంటంటే, ట్రాన్సిషన్ ఫ్లయింగ్ కారును నడపటానికి చెల్లుబాటైన పైలట్ లైసెన్స్ కావాలి. అయితే టిఎఫ్-ఎక్స్‌ను మీరు నడపాల్సిన అసరం లేదు, ఇందులో ఎక్కి కూర్చుని మీరు వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఇందులో ఫీడ్ చేస్తే చాలు, ఈ ఫ్లయింగ్ మిమ్మల్ని సురక్షితంగా అక్కడికి చేర్చుతుంది. గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్, హెలికాఫ్టర్ మరియు విమానం ఈ మూడింటి టెక్నాలజీలను కలగలిపితే ఈ అధునాత ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు తయారవుతుంది.

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్

టెర్రాఫుజియా ట్రాన్సిషన్


ఇది వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (విటిఓఎల్) సిస్టమ్‌తో లభిస్తుంది. అంటే, దీనిని గాలిలో ఎగిరించేందుకు రన్‌వే అసరం లేదన్నమాట. కారు ఉన్న చోటు నుంచి విటిఓఎల్ సాయంతో దీనిని నిలువుగా గాల్లోకి ఎగిరించవచ్చు. కారు ఇరువైపులా అమర్చిన ఎలక్ట్రిక్ పవర్డ్ రోటర్ బ్లేడ్ల సాయంతో ఇది టేకాఫ్, ల్యాండింగ్ చేస్తుంది. ఒక్కసారి గాల్లోకి ఎగిరిన తర్వాత ఈ రోటర్ బ్లేడ్లు ఆగిపోయి, ఈ కారులో అమర్చిన శక్తివంతమైన టర్నింగ్ ఇంజన్ పనిచేయటం ప్రారంభించి గాలిలో ఈ ఫ్లయింగ్ కారును ముందుకు నడిపేందుకు సహకరిస్తుంది.

టెర్రాఫుజియీ టిఎఫ్-ఎక్స్ ఫ్లయింగ్ కారును నడిపేందుకు కేవలం 5 గంటల శిక్షణ సరిపోతుందని, ఇందులో ఉన్న ఆటోమేటిక్ ఫ్లయింగ్, ల్యాండింగ్ సిస్టమ్ వలన ఎవరైనా దీనిని సులువుగా నడపవచ్చని కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. గాలిలోకి ఎగిరేందుకు తోడ్పడే రోటర్ బ్లేడ్లకు రెండు 610 పిఎస్‌ల సామర్థ్యం కలిగిన ఇంజన్లను ఉపయోగించారు. అలాగే గాలిలో ముందుకు వెళ్లేందుకు గాను 307 పిఎస్‌‌ల సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను ఉపయోగించారు.

టిఎఫ్-ఎక్స్ గాలిలో గంటకు గరిష్టంగా 332 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గాలిలో దీని రేంజ్ 805 కిలోమీటర్లు. సేఫ్టీ పరంగా కూడా ఇది అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీనిని ఉపయోగించేవారు ప్రైమరీ ల్యాండిగ్ జోన్‌ను, అలాగే బ్యాకప్ ల్యాండిగ్ జోన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రెండు ల్యాండిగ్ జోన్లకు చేరుకునే శక్తి ఈ ఫ్లయింగ్ కారులో లేకపోయినట్లయితే, ఇది సురక్షిత మూడవ ల్యాండింగ్ జోన్‌లో ల్యాండ్ అవుతుంది.

ఒకవేళ ఈ ల్యాండిగ్ జోన్లలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా లేదా పరిమితులకు మించి ఉన్నా లేదా ఈ ల్యాండిగ్ జోన్లు తాత్కాలిక నియంత్రణ ఎయిర్‌స్పేస్ జోన్‌లో ఉన్నా కారులో సరైన ల్యాండింగ్ జోన్‌ను ఎంచుకునేంత వరకు ఫ్లయింగ్ కారు స్టార్ట్ కాదు. ఇంకా ఇందులో బ్యాకప్ ప్యారాచూట్, పైలట్ రెస్పాండ్ కాకపోయినట్లయితే ఆటోమేటిక్‌గా పనిచేసే ఎమర్జెన్సీ ఆటో-ల్యాండ్ ఫంక్షన్ వంటి అత్యవసర సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. అంతా సజావుగా జరిగితే టెర్రాఫుజియా టిఎఫ్-ఎక్స్ 8 నుంచి 12 సంవత్సరాల్లో ఇది నిజరూపం దాల్చే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
uired time, Terrafugia says it will take to develop the TF-X flying car, capable of vertical takeoff, like a helicopter. Terrafugia is the company behind The Transition, a fixed wing light aircraft that is capable of transitioning into a road car.
Story first published: Friday, May 10, 2013, 12:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X