మూడు చక్రాల కారు 'ఎలియో': ఫీచర్లు, ధర, రివ్యూ

By Ravi

తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్టు, నేను తయారు చేసిన కారుకు మూడే చక్రాలు అంటున్నాడీ ఈ అమెరికా బుల్లోడు. అమెరికాకు చెందిన పాల్ ఎలియో ఈ మూడు చక్రాల కారును సృష్టించాడు. తన పేరుతోనే ఈ కారుకు 'ఎలియో' (Elio) అనే పేరును పెట్టాడు. పెరుగుతున్న ఇంధన ధరలు, నానాటికీ అధికమవుతున్న వాహనాల సంఖ్యతో రోడ్లపై అలాగే పార్కింగ్ ప్రదేశాల్లో తగ్గుతున్న స్థలం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని పాల్ ఎలియో ఈ కారును తయారు చేశాడు.

ఎలియో టూ సీటర్ కారు. ఇందులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. అందులో ఒక డ్రైవర సీట్, దానికి వెనుకన మరొక ప్యాసింజర్ సీటు ఉంటాయి. ఇది సాంప్రదాయ కార్ల మాదిరిగానే స్టీరింగ్, బ్రేక్స్, క్లచ్ పెడల్స్, ట్రాన్సిమిషన్ వంటి అన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో ఇన్‌లైన్ 3-సిలిండర్, 1-లీటర్, 70 హార్స్ పవర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంటుంది.

దీని ధర, మైలేజ్, ఇతర వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

మైలేజ్

మైలేజ్

ఇది లీటరు పెట్రోలుకు 35 కి.మీ. పైగా మైలేజీనిస్తుంది.

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 30 లీటర్లు. దీనిని ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే 1050 కి.మీ. దూరం పైగా ప్రయాణించవచ్చు.

ధర

ధర

ఎలియో కారు ధర కేవలం 6800 అమెరికన్ డాలర్లు మాత్రమే. మన దేశ కరెన్సీలు సుమారు రూ.4 లక్షలు.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

ప్రతి ఎలియో కారు కూడా సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇందులో 3 ఎయిర్‌బ్యాగ్‌లు, రీఇన్‌ఫోర్స్డ్ రోల్-కేజ్ ఫ్రేమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), 50 శాతం పెద్ద క్రష్ జోన్స్ ఫీచర్లున్నాయి.

మేడ్ ఇన్ అమెరికా

మేడ్ ఇన్ అమెరికా

పూర్తిగా అమెరికాలో తయారైన ఎలియో కారు ప్రస్తుతానికి అక్కడి మార్కెట్లో మాత్రమే లభ్యం కానుంది. ష్రెవ్‌పోర్టులో ఉన్న ఈ ప్లాంటులో సుమారు 1500 మంది ఉపాధి లభించనుంది.

విశిష్టమైనది

విశిష్టమైనది

ఇతర చిన్న కార్లతో పోల్చుకుంటే ఎలియో విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ఈకో-ఫ్రెండ్లీ

ఈకో-ఫ్రెండ్లీ

ఇది పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనం.

ఇంజన్

ఇంజన్

ఇందులో ఉపయోగించిన ఇన్‌లైన్ 3-సిలిండర్, 1-లీటర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 70 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమవుతుంది. ఇందులో రివర్స్ గేర్ కూడా ఉంటుంది.

ఫాస్ట్ ఫ్యాక్ట్స్

ఫాస్ట్ ఫ్యాక్ట్స్

ఎలియో గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఇది కేవలం 9.6 సెకండ్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ వేగం సూపర్ కార్లంత వేగం కాకపోయినప్పటికీ, ఎలియో మాత్రం వేగం విషయంలో సాధారణ కార్లకు ఏమాత్రం తీసిపోదు.

సురక్షితమైన బ్రేకింగ్

సురక్షితమైన బ్రేకింగ్

ఈ కారుకు అమర్చిన మూడు 15 ఇంచ్ చక్రాలలో 3-వీల్ డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇవి ఏబిఎస్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. కాబట్టి ఇవి సురక్షితమైన బ్రేకింగ్ వ్యవస్థను అందిస్తుంది.

సస్పెన్షన్

సస్పెన్షన్

అసమాన పొడవు కలిగిన కంట్రోల్ ఆర్మ్స్, కాయిల్ ఓవర్ స్పింగ్ మరియు షాక్ అబ్జార్వర్లతో ముందువైపు ఇండిపెండెంట్ సస్పెన్షన్ అలాగే వెనుక వైపు బైక్‌లలో గమనించినట్లు మోనో-షాక్ కాయిల్ స్పింగ్ షాక్ అబ్జార్వర్‌తో ఇది లభిస్తుంది.

ఇంటీరియర్ రూమ్

ఇంటీరియర్ రూమ్

హెడ్‌రూమ్ : డ్రైవర్ 39.8, ప్యాసింజర్ 36.4 ఇంచ్‌లు

సీట్ వెడల్పు : డ్రైవర్ 20.6, ప్యాసింజర్ 25.3 in, ఇంచ్‌లు

షోల్డర్ రూమ్ : 26.8 ఇంచ్‌లు

ముందు సీట్ లెగ్‌రూమ్ : 42.7 ఇంచ్‌లు

వెనుక సీట్ లెగ్‌రూమ్ : 33.1 ఇంచ్‌లు

ఎక్స్టీరియర్ కొలతలు

ఎక్స్టీరియర్ కొలతలు

మొత్తం వీల్ పొడవు : 160.5″

ముందు వీల్ ట్రాక్ : 66.8″

వీల్‌బేస్ : 110″

మొత్తం ఎత్తు : 54.2″

నిశ్శబ్ధ క్యాబిన్

నిశ్శబ్ధ క్యాబిన్

బయటి వైపు శబ్ధాలు కారు లోనికి ప్రవేశించకుండా ఉండేలా, దీని బాడీ ప్యానెళ్లను తేలికమైన మరియు ధృఢమైన మెటీరియర్‌లతో తయారు చేశారు. దీన్ని నడుపుతున్నప్పుడు ఇది షేక్ అవుతున్న భావన కూడా కలుగదు.

లగేజ్ స్పేస్

లగేజ్ స్పేస్

లగేజ్ తీసుకువెళ్లాలనుకున్నప్పుడు వెనుక సీటను మడిచిపెట్టేయవచ్చు. ఇందులో ఓ ఎయిర్‌లైన్ క్యారీఆన్ బ్యాగ్ లేదా గోల్ఫ్ బ్యాగును ఉంచేంత స్థలం ఉంటుంది.

మరిన్ని ఫీచర్లు

మరిన్ని ఫీచర్లు

ఇంకా ఇందులో హీటర్‌తో కూడిన ఏసి, ఏఎమ్/ఎఫ్ఎమ్ రేడియో, డీఫ్రోస్ట్, 3 ఎయిర్‌బ్యాగ్స్, పవర్ విండోస్, డోర్ లాక్, సీట్ బెల్ట్స్, ట్యాంపర్డ్ గ్లాస్, విండ్‌షీల్డ్ వైపర్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

రాకెట్ సిల్వర్

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

ట్రూ బ్లూ

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

లీకోరైస్

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

రెడ్ హాట్

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

క్రీమ్‌సికిల్

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

సౌర్ యాపిల్

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

మార్ష్‌మాల్లో

ఎలియో
ఎలియో
ఎలియో
ఎలియో
ఎలియో
ఎలియో
ఎలియో
ఎలియో
ఎలియో
ఎలియో

Most Read Articles

English summary
To create a vehicle for today’s generation of drivers that addressed their transportation needs and the world’s new realities. That’s when a car enthusiast, a visionary, a man with a dream named Paul Elio got an idea. A simple, brilliant idea. The result is Elio.
Story first published: Monday, July 8, 2013, 16:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X