ఆగస్టు 2014లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్స్

By Ravi

పండుగ సీజన్ నేపథ్యంలో, గడచిన ఆగస్ట్ నెలలో కార్ల అమ్మకాలు జోరుగానే సాగాయి. ఎప్పటి మాదిరిగానే ఆగస్ట్ నెలలో కూడా మారుతి సుజుకి ఇండియానే అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ కార్ల జాబితాను పరిశీలిస్తే అందులో మొదటి నాలుగు కార్లు మారుతి సుజుకికి చెందినవే కావటం విశేషం.

మరిన్ని టాప్ 10 కథనాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

గడచి నెలలో తొలిసారిగా అగ్రస్థానాన్ని కోల్పోయి మారుతి సుజుకి ఆల్టో, ఈనెలలో తిరిగి తన టాప్ పొజిషన్‌ను దక్కించుకుంది. ఆగస్ట్ 2014 నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల వివరాలను ఈ కథనంలో చూడండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

10. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

10. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

తర్వాతి స్లైడ్‌లలో ఆగస్ట్ 2014 నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయి టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం రండి.

10. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

10. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. గడచిన ఆగస్ట్ 2014 నెలలో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 అమ్మకాలు 6,627 యూనిట్లుగా నమోదయ్యాయి.

9. మారుతి సుజుకి సెలెరియో

9. మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి ఇండియా ఇటీవలే విడుదల చేసిన సెలెరియో ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆగస్ట్ 2014లో మారుతి సుజుకి 6,656 యూనిట్ల సెలెరియో కార్లను విక్రయించింది.

8. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

8. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 అమ్మకాలు గడచిన ఆగస్ట్ 2014లో 6,677 యూనిట్లుగా నమోదయ్యాయి.

7. హ్యుందాయ్ ఇయాన్

7. హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న పాపులర్ స్మాల్ ఇయాన్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఇందులో కంపెనీ ఇటీవల 1 లీటర్ ఇంజన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. గడచిన ఆగస్ట్ 2014లో హ్యుందాయ్ ఇయాన్ అమ్మకాలు 6,757 యూనిట్లుగా ఉన్నాయి.

6. మహీంద్రా బొలెరో

6. మహీంద్రా బొలెరో

గడచిన నెలలో టాప్ 10లో చోటు దక్కించుకోని మహీంద్రా బొలెరో, ఆగస్ట్ 2014లో 6,828 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకొని, 6వ స్థానానికి చేరుకుంది.

5. హోండా అమేజ్

5. హోండా అమేజ్

గడచిన జులై నెలలో 10వ స్థానంలో నిలిచిన హోండా అమేజ్, ఆగస్ట్ 2014లో 5వ స్థానానికి చేరుకుంది. టాప్ ఆగస్ట్ 2014 హోండా కార్స్ ఇండియా మొత్తం 9,198 అమేజ్ కాంపాక్ట్ సెడాన్లను విక్రయించింది.

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు ఆగస్ట్ 2014లో 13,133 యూనిట్లుగా ఉన్నాయి.

3. మారుతి సుజుకి స్విఫ్ట్

3. మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ అమ్మకాలు ఆగస్ట్ 2014లో 17,716 యూనిట్లుగా నమోదయ్యాయి.

2. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

2. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

ఈ జాబితాలో ద్వితీయ స్థానంలో నిలిచిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు గడచిన ఆగస్ట్ 2014లో 19,129 యూనిట్లుగా నమోదయ్యాయి.

1. మారుతి సుజుకి ఆల్టో

1. మారుతి సుజుకి ఆల్టో

జులై 2014లో ద్వితీయ స్థానానికి పడిపోయిన మారుతి సుజుకి ఆల్టో, ఆగస్ట్ 2014 నెలలో తిరిగి అగ్రస్థానంలో నిలిచింది. ఆగస్ట్ 2014లో మారుతి సుజుకి మొత్తం 21533 ఆల్టో కార్లను విక్రయించింది.

Most Read Articles

English summary
Take a look at the Top 10 best selling cars in August 2014. In the present Indian automobile market, there have been many new car launches from various manufacturers in an effort to grab a larger market share. Maruti Suzuki however, has remained dominant again.
Story first published: Wednesday, September 10, 2014, 11:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X