భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 కార్లు

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రతి ఏటా అనేక కొత్త కార్లు విడుదలవుతున్నాయి. అయితే, మార్కెట్లోకి ఎన్ని కొత్త కార్లు వచ్చినప్పటికీ అవి మార్కెట్ లీడర్‌గా మారుతి సుజుకి బ్రాండ్‌కు మాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. గడచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోని కార్ల అమ్మకాలను గమనిస్తే, ఈ జాబితాలో మారుతి సుజుకి ఆల్టో కారు నెంబర్ వన్ స్థానంలో ఉంది.

మరిన్ని టాప్ 10 స్టోరీల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో, టాప్ 10 కార్లలో మొదటి నాలుగు మోడళ్లు మారుతి సుజుకికి చెందినవే అంటేనే కొనుగోలుదారుల్లో ఈ బ్రాండ్ పట్ల ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. మరి ఆ టాప్ 10 కార్లు ఏవో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్స్

తర్వాతి స్లైడ్‌లలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం రండి.

10. హోండా అమేజ్

10. హోండా అమేజ్

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్స్ జాబితాలో 10వ స్థానంలో ఉన్నది హోండా అమేజ్. ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో హోండా అమేజ్ అమ్మకాలు 15,182 యూనిట్లుగా ఉంటే, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 15,853 యూనిట్లుగా ఉన్నాయి.

9. మారుతి సుజుకి సెలెరియో

9. మారుతి సుజుకి సెలెరియో

ఈ జాబితాలో 9వ స్థానంలో మారుతి సుజుకి ఇండియా ఇటీవలే విడుదల చేసిన సెలెరియో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో మొత్తం 16,541 యూనిట్లు సెలెరియో కార్లు అమ్ముడుపోయాయి.

8. హ్యుందాయ్ ఇయాన్

8. హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ ఇయాన్ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో హోండా అమేజ్ అమ్మకాలు 19,379 యూనిట్లుగా ఉంటే, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 24,526 యూనిట్లుగా ఉన్నాయి.

7. హ్యుందాయ్ ఎక్సెంట్

7. హ్యుందాయ్ ఎక్సెంట్

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ సెడాన్ ఎక్సెంట్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. గడచిన ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు 21,524 యూనిట్లుగా రికార్డ్ అయ్యాయి.

6. హోండా సిటీ

6. హోండా సిటీ

హోండా సిటీ సెడాన్‌లో కంపెనీ డీజిల్ వెర్షన్‌తో పాటుగా రిఫ్రెష్డ్ డిజైన్‌‌తో మార్కెట్లో విడుదల చేయటంతో ఈ మోడల్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఈ జాబితాలో హోండా సిటీ 6వ స్థానంలో ఉంది. ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో 21,985 యూనిట్లుగా ఉంటే, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 6,949 యూనిట్లుగా ఉన్నాయి.

5. హ్యుందాయ్ గ్రాండ్

5. హ్యుందాయ్ గ్రాండ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లోకి విడుదల గ్రాండ్ హ్యాచ్‌బ్యాక్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ అమ్మకాలు గడచిన ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో 26,830 యూనిట్లుగా నమోదయ్యాయి.

 4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

4. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్న మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అమ్మకాలు ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో 38,156 యూనిట్లుగా నమోదైతే అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 35,141 యూనిట్లుగా ఉన్నాయి.

3. మారుతి సుజుకి స్విఫ్ట్

3. మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ అమ్మకాలు ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో 47,442 యూనిట్లుగా ఉంటే, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 48,120 యూనిట్లుగా నమోదయ్యాయి.

2. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

2. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

ఈ జాబితాలో ద్వితీయ స్థానంలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో 50,951 యూనిట్లుగా ఉంటే, అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇవి 49,259 యూనిట్లుగా ఉన్నాయి.

1. మారుతి ఆల్టో

1. మారుతి ఆల్టో

మారుతి ఆల్టో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్-జూన్ 2014 త్రైమాసికంలో మారుతి సుజుకి మొత్తం 64,573 ఆల్టో కార్లను విక్రయించింది. అంతకు ముందు ఇదే సమయంలో కంపెనీ 56,335 ఆల్టో కార్లను విక్రయించినట్లు పేర్కొంది.

Most Read Articles

English summary
In the present Indian automobile market, there have been many new car launches from various manufacturers in an effort to grab a larger market share. Maruti Suzuki however, has remained dominant again.
Story first published: Thursday, July 24, 2014, 15:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X