ప్రపంచంలో కెల్లా టాప్ 10 అతిపెద్ద ఆటోమొబైల్ బ్రాండ్స్

By Ravi

ఒక చిన్న కంపెనీగా పుట్టి, ప్రపంచంలో కెల్లా అతిపెద్ద తయారీదారుగా అవతరించం ఆషామాషీ విషయం కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమిస్తే కానీ ఆ స్థానానికి చేరుకోవటం సాధ్యం కాదు. ఈనాటి మన ఆఫ్ బీట్ కథనంలో ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారులుగా ఎదిగిన టాప్ 10 కంపెనీల గురించి తెలుసుకుందాం రండి.

మరిన్ని టాప్ 10 స్టోరీల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

కస్టమర్లలో కొనుగోలు శక్తి పెరగటం, తయారీదారుల మధ్య పోటీ పెరగటం, సరసమైన ధరలకే వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ శ్రేణుల్లో ఉత్పత్తులు లభిస్తుండటం ఇలా అనేక అంశాలు తయారీదారులను అత్యున్నత స్థానాలకు తీసుకువెళ్తున్నాయి. మరి లేట్ చేయకుండా ఆ టాప్ 10 ఆటోమొబైల్ కంపెనీలు ఏవో, వాటి వివరాలేంటో చూసేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాప్ 10 ఆటోమొబైల్ బ్రాండ్స్

తర్వాతి స్లైడ్‌లలో ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారులుగా ఎదిగిన టాప్ 10 కంపెనీల గురించి తెలుసుకోండి.

10. బిఎమ్‌డబ్ల్యూ

10. బిఎమ్‌డబ్ల్యూ

ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది జర్మన్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ. ఈ బ్రాండ్ 2013లో అతిపెద్ద కార్ మేకర్‌గా అవతరించింది. మినీ, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్‌లను కలిగి ఉన్న బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ 2012లో మొత్తం 1.9 మిలియన్ వాహనాలను విక్రయించింది. కేవలం 3-సిరీస్ వాహనాలనే 3.50 లక్షల యూనిట్లను విక్రయించింది, 2013లో ఇది బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.

9. పిఎస్ఏ ప్యూజో సిట్రాన్

9. పిఎస్ఏ ప్యూజో సిట్రాన్

ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నది ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ పిఎస్ఏ ప్యూజో సిట్రాన్. 2013లో దాదాపు చాలా కంపెనీల అమ్మకాలు పెరిగితే ఈ బ్రాండ్ అమ్మకాలు మాత్రం తగ్గాయి. యూరోపియన్ మార్కెట్ చాలా నెమ్మదిగా రికవరీ అవుతున్న నేపథ్యంలో, ఈ కంపెనీ ఫారిన్ మార్కెట్లపై కన్నేసింది. చైనాలో ప్యూజో 26 శాతం వృద్ధిని సాధించింది.

8. హోండా మోటార్

8. హోండా మోటార్

ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నది జపనీస్ ఆటో మేకర్ హోండా. గడచిన సంవత్సరంలో హోండా గ్లోబల్ సేల్స్ 7 శాతం వృద్ధి చెందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్ మొత్తం 4 మిలియన్ల వాహనాలను విక్రయించింది. హోండాకు అతిపెద్ద మార్కెట్ అమెరికా, బెస్ట్ సెల్లర్ మోడల్ సిఆర్-వి.

7. ఫియట్ క్రైస్లర్

7. ఫియట్ క్రైస్లర్

ఈ జాబితాలో 7వ స్థానంలో ఉన్నది ఇటాలియన్ బ్రాండ్ ఫియట్ మరియు అమెరికన్ బ్రాండ్ క్లైస్లర్‌ల విలీనం ఫియట్ క్రైస్లర్. 2013లో ఫియట్ క్రైస్లర్ మొత్తం 4.3 మిలియన్ వాహనాలను విక్రయించింది. ఇందులో ఎక్కువ భాగం అమ్మకాలు క్రైస్లర్ నుంచి వచ్చినవే. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్లర్ 2.6 మిలియన్ వాహనాలను విక్రయిస్తే, ఫియట్ 1.7 మిలియన్ వాహనాలను విక్రయించింది.

6. ఫోర్డ్

6. ఫోర్డ్

ఈ లిస్ట్‌లో 6వ స్థానంలో ఉన్నది అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్. 2013లో ఫోర్డ్ గ్లోబల్ సేల్స్ 6.3 మిలియన్ యూనిట్లు. ఫోర్డ్‌కు నార్త్ అమెరికా అతిపెద్ద మార్కెట్. ఎఫ్ సిరీస్ పికప్ ట్రక్ ఈ బ్రాండ్ నుంచి అమెరికా, కెనడాలలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్.

5. హ్యుందాయ్ కియా

5. హ్యుందాయ్ కియా

ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ కియా. 2013లో హ్యుందాయ్ కియా గ్లోబల్ సేల్స్ 7.5 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా.. 2014లో ఈ బ్రాండ్స్ 8 మిలియన్ వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నాయి. ఎలాంట్రా/అవాంటి ఈ బ్రాండ్ నుంచి బెస్ట్ సెల్లర్‌గా ఉంది, ఈ మోడల్ కార్లను 8.66 లక్షల యూనిట్లు విక్రయించారు.

4. రెనో నిస్సాన్ గ్రూప్

4. రెనో నిస్సాన్ గ్రూప్

ఫ్రెంచ్ అండ్ జపనీస్ అలయన్స్ కంపెనీ రెనో నిస్సాన్ ఈ జాబితాలో 4వ స్థానంలో ఉంది. 2013లో ఈ గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా 8.2 మిలియన్ వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో ఒక్క నిస్సాన్ బ్రాండ్ మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా 5.1 మిలియన్ వాహనాలను విక్రయించింది. ఈ బ్రాండ్‌కు చైనా అతిపెద్ద మార్కెట్, 2013లో చైనాలో నిస్సాన్ 1.2 మిలియన్ వాహనాలను విక్రయించింది.

3. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్

3. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్

ప్రపంచంలో కెల్లా మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్. జర్మనీకి చెందిన ఈ గ్రూప్ వద్ద ఆడి, బెంట్లీ, లాంబోర్గినీ, పోర్షే వంటి బ్రాండ్లున్నాయి. 2013లో ఈ గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా 9.7 మిలియన్ వాహనాలను విక్రయించింది. ఈ గ్రూపుకు చైనా అతిపెద్ద మార్కెట్, 3.2 మిలియన్ యూనిట్ల అమ్మకాలు చైనా నుంచి వచ్చినవే.

2. జనరల్ మోటార్స్

2. జనరల్ మోటార్స్

ప్రపంచంలో కెల్లా రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్. అమెరికాకు చెందిన ఈ బ్రాండ్ 2013లో జనరల్ మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా 9.71 మిలియన్ వాహనాలను విక్రయించింది. దీని బిగ్గెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ షెవర్లే, 5 మిలియన్ వాహనాలు ఈ బ్రాండ్ నుంచి వచ్చినవే. బెస్ట్ సెల్లర్ షెవర్లే క్రూజ్, 2013లో ప్రపంచం వ్యాప్తంగా 7.29 లక్షల క్రూజ్ కార్లు అమ్ముడయ్యాయి.

1. టొయోటా

1. టొయోటా

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది జపనీస్ ఆటోమొబైల్ బ్రాండ్ టొయోటా. 2011లో కూడా టొయాటానే నెంబర్ వన్‌గా ఉండేది. ఆ తర్వాత 2013లో తిరిగి ఆ స్పాట్‌ను దక్కించుకుంది. గడచిన సంవత్సరం ఈ బ్రాండ్ మొత్తం 9.88 మిలియన్ వాహనాలను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించింది. టొయోటా కరోలా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

Most Read Articles

English summary
With people from rural areas moving to urban settlements in the modern world, cars have become more of a necessity these days than a luxury need. These in turn give the automobile industry a big turnover. With so many automobile manufacturers out there in the modern world, it is a tough competition. Let's take a look at the top 10 biggest automobile manufacturers.
Story first published: Wednesday, July 30, 2014, 12:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X