ప్రపంచంలో కెల్లా టాప్ 10 ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ కార్స్

By Ravi

మీ కారు 0-100 కి.మీ. వేగాన్ని చేరుకోవటానికి ఎంత సమయం తీసుకుంటుంది..? బహుశా 30 సెకండ్లు..? కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే కార్లు కేవలం 3 సెకండ్ల కన్నా తక్కువ సయమంలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుంకుంటాయి.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో కెల్లా టాప్ 10 ఫాస్టెస్ట్ రోడ్స్

ఇది వరకటి కథనంలో ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన రోడ్ల గురించి తెలుసుకున్నాం కదా.. ఈనాటి మన కథనంలో ప్రపంచంలో కెల్లా అతి తక్కువ సమయంలో 0-100 కి.మీ. వేగాన్ని చేరుకో గలిగే టాప్ 10 ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కార్ల గురించి తెలుసుకుందాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టాప్ 10 ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ కార్స్

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచంలో కెల్లా అతి తక్కువ సమయంలో అత్యధిక వేగాన్ని అందుకునే కార్ల గురించి తెలుసుకుందాం రండి.

10. ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో టిటి

10. ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో టిటి

ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్నది ఉత్తర అమెరికాకు చెందిన ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో టిటి. ఇది కేవలం 2.9 సెకండ్ల వ్యవధిలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. కొంత కాలం పాటు ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారుగా గిన్నిస్ రికార్డును కూడా కలిగి ఉండేది. అయితే, బుగాటి వేరాన్ ఆ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

9. లాంబోర్గినీ ముర్సిలాగో ఎల్‌పి 670-4 సూపర్‌వెలాస్

9. లాంబోర్గినీ ముర్సిలాగో ఎల్‌పి 670-4 సూపర్‌వెలాస్

ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్న ఈ అల్టిమేట్ ముర్సిలాగో కారును లాంబోర్గినీ 2009లో పరిచయం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 186 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించింది. ఇది కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లాంబోర్గినీ ముర్సిలాగో ఎల్‌పి 670-4 కారులో 6.5 లీటర్, వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 661 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇదొక స్పెషల్ ఎడిషన్ కారు. ఇది ఒరిజినల్ ముర్సిలాగో కన్నా 100 కిలోల బరువు తక్కువ.

8. లాంబోర్గినీ అవెంటేడర్

8. లాంబోర్గినీ అవెంటేడర్

ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నది కూడా లాంబోర్గినీకి చెందిన కారే కావటం విశేషం. లాంబోర్గినీ అందిస్తున్న అవెంటేడర్ సూపర్‌కారు కేవలం 2.7 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుటుంది. ఇందులో సరికొత్త వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 690 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

7. పోర్షే 911 టర్బో ఎస్

7. పోర్షే 911 టర్బో ఎస్

జర్మన్ కార్ కంపెనీ పోర్షే నుంచి అత్యంత పాపులర్ అయిన 911 టర్బో ఎస్ మోడల్ ఈ జాబితాలో 7వ స్థానాన్ని దక్కించుకుంది. పోర్షే 911 టర్బో ఎస్ స్పోర్ట్స్ కార్ కేవలం 2.6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారులో పవర్‌ఫుల్ ఇంజన్ 553 హార్స్‌పవర్‌ల శక్తిని 553 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

6. మెక్‌లారెన్ పి1

6. మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ ఎఫ్1 మోడల్‌‍కు సక్సెసర్‌గా వచ్చిన మెక్‌లారెన్ పి1 సూపర్‌కార్ ఈ జాబితాలో 6వ స్థానంలో ఉంది. ఈ కారు కేవలం 2.6 సెకండ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మెక్‌లారెన్ ఈ మోడల్ ఉత్పత్తిని పరిమితం చేయటంతో ఇప్పటికే దాదాపు అన్ని యూనిట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. దీని ధర పది లక్షల డాలర్కు పైమాటే.

5. కపారో టి1

5. కపారో టి1

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ కపారో వెహికల్ టెక్నాలజీస్ తమ టి1 కారును 2007 మధ్య భాగంలో ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. ఈ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 25 కార్లు మాత్రమే. ఇప్పటి వరకు యూకే కేవలం 12 యూనిట్ల కపారో టి1 కార్లను మాత్రమే కంపెనీ డెలివరీ చేసింది. ఈ మోడల్ కేవలం 2.5 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఇందులో ఉపయోగించిన వి8 మెనార్డ్ ఇంజన్ గరిష్టంగా 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 575 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ జాబితాలో కపారో టి1 5వ స్థానంలో ఉంది.

4. బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

4. బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే సూపర్‌కారు బుగాటి వేరాన్ ఈ జాబితాలో 4వ స్థానంలో ఉంది. ఈ కారు కేవలం 2.46 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఇందులో 1200 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే పవర్‌ఫుల్ ఇంజన్ కారణంగా, ఇది గరిష్టంగా గంటకు 415 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. ప్రస్తుతం ఇదే ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే ప్రొడక్షన్ వెర్షన్ సూపర్‌కారుగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది.

3. నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో

3. నిస్సాన్ జిటి-ఆర్ నిస్మో

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌కు చెందిన పెర్ఫార్మెన్స్ విభాగం నిస్మో అప్‌గ్రేడ్ చేసిన స్పోర్ట్స్ కారు జిటి-ఆర్ నిస్మో ఈ జాబితాలో 3వ స్థానంలో ఉంది. ఈ కారు కేవలం 2.4 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. నిస్సాజ్ జిటి-ఆర్ కారులోని ఇంజన్ గరిష్టంగా 595 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర సుమారు రెండు లక్షల డాలర్లు.

2. పోర్షే 918 స్పైడర్

2. పోర్షే 918 స్పైడర్

జర్మన్ కార్ కంపెనీ పోర్షే అందిస్తున్న 918 స్పైడర్ మోడల్ ప్రపంచంలో కెల్లా టాప్ 10 ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ కార్లలో ద్వితీయ స్థానంలో ఉంది. ఈ మోడల్ కేవలం 2.4 సెకండ్ల కన్నా తక్కువ సయమంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఇదొక హైబ్రిడ్ కారు. ఇందులో 608 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే ఓ పెట్రోల్ ఇంజన్ మరియు 279 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే ఓ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇవి రెండూ కలిసి సగటున 880 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

1. ఏరియల్ ఆటమ్ 500 వి8

1. ఏరియల్ ఆటమ్ 500 వి8

చూడటానికి ఫార్ములా వన్, రేస్ కార్ మాదిరిగానే కనిపించే ఈ కారు పేరు ఏరియల్ ఆటమ్ 500 వి8, ఇది రోడ్ లీగల్ ప్రొడక్షన్ వెర్షన్ కారు. దీనిని ఏరియల్ మోటార్స్ అనే సంస్థ తయారు చేస్తోంది. ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఏరియల్ ఆటమ్ 500 వి8 స్పోర్ట్స్ కారు కేవలం 2.3 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు మొత్తం బరువు కేవలం 550 కిలోలు మాత్రమే. అందుకే ఇది అతిఎక్కువ వేగాన్ని అతి తక్కువ సమయంలో చేరుకోగలదు. ఈ కారు పవర్ టూ వెయిట్ రేషియో ప్రతి టన్నుకు 909 బిహెచ్‌పిలు.

టాప్ 10 ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ కార్స్

ఇవి టాప్ 10 ఫాస్టెస్ట్ యాక్సిలరేటింగ్ కార్స్

మరిన్ని టాప్ 10 కథనాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

Most Read Articles

English summary
While some four-wheeled species are capable of attaining ridiculously high top speeds, others prefer to do battle on the acceleration front. We bring to you an elite list of the fastest accelerating production cars from across the world. 
Story first published: Thursday, July 24, 2014, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X